CNBC-TV18 IBLA 2020: ధీరూభాయ్ అంబానీయే నా ఐకానిక్ లీడర్...రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ...

రిలయన్స్ కోసం పెద్ద కలలు కన్నాను, భారతదేశం కోసం మరింత పెద్ద కలలు కన్నాను. కాబట్టి నేను ఈ గుర్తింపును నా తండ్రి ధీరూభాయ్ అంబానీకి అంకితం చేస్తున్నాను

news18-telugu
Updated: February 28, 2020, 7:59 PM IST
CNBC-TV18 IBLA 2020: ధీరూభాయ్ అంబానీయే నా ఐకానిక్ లీడర్...రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ...
ఐకానిక్ బిజినెస్ లీడర్ ఆఫ్ ది డికేడ్ - ముఖేష్ అంబానీ, చైర్మన్ మరియు మేనేజింగ్ డైరక్టర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
  • Share this:
ముంబై వేదికగా వ్యాపార రంగంలో అత్యున్నత పురస్కారాలను అందించే ఇండియా బిజినెస్ లీడర్ షిప్ అవార్డ్స్ (CNBC-TV18 IBLA 2020) కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో ఐకానిక్ బిజినెస్ లీడర్ ఆఫ్ ది డికేడ్ గా  ముఖేష్ అంబానీ, చైర్మన్ మరియు మేనేజింగ్ డైరక్టర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ను పురస్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..."నాకు, నా జీవితంలో ఏకైక ఐకానిక్ లీడర్ నా తండ్రి ధీరూభాయ్ అంబానీ. ఆయన పెద్దగా కలలు కనడం నేర్పించారు. రిలయన్స్ కోసం పెద్ద కలలు కన్నాను, భారతదేశం కోసం మరింత పెద్ద కలలు కన్నాను. కాబట్టి నేను ఈ గుర్తింపును నా తండ్రి ధీరూభాయ్ అంబానీకి అంకితం చేస్తున్నాను అలాగే యువ లీడర్లు ఎవరైతే గత దశాబ్దంలో కంపెనీ స్వరూపాన్ని మార్చారో వారికి ఈ పురస్కారం అంకితం." అన్నారు. అలాగే ఒక టెక్స్‌టైల్ కంపెనీగా ప్రారంభమై మమ్మల్ని పెట్రోకెమికల్స్ కంపెనీగానూ, ఇంధన సంస్థగానూ రూపాంతరం చెందాము. ఈ దశాబ్ద వ్యవధిలో టెలికాం మరియు రిటైల్ దిగ్గజాలుగా ఎదిగామని ఆయన గుర్తుచేశారు.



First published: February 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు