CNBC-TV18 ఆధ్వర్యంలో 14వ 'ఇండియా బిజినెస్ లీడర్స్ అవార్డ్స్' ఈవెంట్

దేశ ఆర్థిక వ్యవస్థ, వ్యాపార రంగాల్లో స్ఫూర్తిగా నిలిచినందున "లీడర్స్ ఆఫ్ ఛేంజ్" థీమ్‌తో ఈవెంట్ నిర్వహిస్తున్నారు. రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

news18-telugu
Updated: January 17, 2019, 12:30 PM IST
CNBC-TV18 ఆధ్వర్యంలో 14వ 'ఇండియా బిజినెస్ లీడర్స్ అవార్డ్స్' ఈవెంట్
CNBC-TV18 ఆధ్వర్యంలో 14వ 'ఇండియా బిజినెస్ లీడర్స్ అవార్డ్స్' ఈవెంట్
  • Share this:
CNBC-TV18 ఆధ్వర్యంలో 14వ 'ఇండియా బిజినెస్ లీడర్స్ అవార్డ్స్' ఈవెంట్ ఇవాళ ముంబైలో జరగనుంది. పలు రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులకు కారణం కావడంతో పాటు అభివృద్ధిలో, మార్కెట్ లీడర్‌షిప్‌లో సత్తా చాటిన వ్యాపారవేత్తలను ఈ ఈవెంట్‌లో సత్కరించనున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ, వ్యాపార రంగాల్లో స్ఫూర్తిగా నిలిచినందున "లీడర్స్ ఆఫ్ ఛేంజ్" థీమ్‌తో ఈవెంట్ నిర్వహిస్తున్నారు. రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

భారతదేశానికి చెందిన అనేక మంది వ్యాపార ప్రముఖులు 'ఇండియా బిజినెస్ లీడర్స్ అవార్డ్స్' ఈవెంట్‌లో పాల్గొననున్నారు. Ogilvy గ్లోబల్ సీసీఓ పీయూష్ పాండే, మోతీలాల్ ఓస్వాల్ గ్రూప్ ఎండీ రామ్‌దేవ్ అగర్వాల్, జేఎస్‌డబ్ల్యూ ఎండీ, ఛైర్మన్ సజ్జన్ జిందాల్‌లాంటి ప్రముఖులు హాజరౌతారు. ప్రతిష్టాత్మక అవార్డులకు వ్యాపారవేత్తల్ని ఎంపికచేసేందుకు జ్యూరీ ప్యానెల్‌లో కొటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ, ఛైర్మన్ ఉదయం కొటక్, ఇండస్ట్రీ ప్రముఖులు మారికో ఛైర్మన్ హర్ష్ మరివల, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ రజనీష్ కుమార్, జేపీ మార్గన్ ఇండియా సీఈఓ కల్పన మార్పారియా, కేకేఆర్ ఇండియా సీఈఓ సంజయ్ నాయర్, కలారీ క్యాపిటల్ ఎండీ వాణి కోలా, జేఎం ఫైనాన్షియల్ ఛైర్మన్ నిమేష్ కంపానీ, ఈవై ఇండియా రీజనల్ మెనేజింగ్ పార్ట్‌నర్, ఛైర్మన్ రాజీవ్ మేమానీ, స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంక్ సీఈఓ జరీన్ దారువాలా ఉన్నారు.

థీమ్‌కు తగ్గట్టుగా 14వ 'ఇండియా బిజినెస్ లీడర్స్ అవార్డ్స్' లక్ష్యం ఆయా రంగాల్లో విజయాలను అందుకున్న, దేశ ఆర్థికాభివృద్ధికి తమ వంతు కృషి చేసిన నాయకులను గుర్తించడమే.

షెరీన్ భాన్, CNBC-TV18 మేనేజింగ్ డైరెక్టర్



ఈ ఈవెంట్‌కు సంబంధించిన అప్‌డేట్స్ కోసం #leadersofchange #CNBCTV18IBLA హ్యాష్‌ట్యాగ్స్ ఫాలో అవండి.

ఇవి కూడా చదవండి:WHATSAPP BUG: వాట్సప్‌లో మీ మెసేజెస్ మాయం... ఎందుకో తెలుసా?

WhatsApp Dictation: చెప్తే చాలు... వాట్సప్‌ మెసేజ్ టైప్ అయిపోతుంది

Paytm Petrol Offer: పేటీఎంతో పెట్రోల్ కొంటే రూ.7,500 క్యాష్ బ్యాక్

REDMI 6 PRO: రూ.11,499 విలువైన ఫోన్ రూ.1,058 ధరకే... ఎలా కొనాలో తెలుసుకోండి
First published: January 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>