హోమ్ /వార్తలు /బిజినెస్ /

Stock Market: కరోనా దెబ్బకు స్టాక్ మార్కెట్ కుదేలు...రక్తమోడిన సెన్సెక్స్, నిఫ్టీ

Stock Market: కరోనా దెబ్బకు స్టాక్ మార్కెట్ కుదేలు...రక్తమోడిన సెన్సెక్స్, నిఫ్టీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనావైరస్ చైనా దాటి ఇతర దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందడం, దాని ఫలితంగా ఏర్పడే ఆర్థిక పతనం గురించి మార్కెట్లు ఎక్కువగా ఆందోళన చెందుతున్నాయి.

చైనాను దాటి కరోనావైరస్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా నమోదు అవుతుండటంతో, దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బిఎస్ఇ సెన్సెక్స్ నవంబర్ 2016 తర్వాత అతిపెద్ద సింగిల్ సెషన్ భారీ నష్టాన్ని నమోదు చేయగా, ఎన్ఎస్ఇ నిఫ్టీ చరిత్రలోనే మూడో అతిపెద్ద సింగిల్ సెషన్ భారీ నష్టాన్ని చవిచూసింది. ఇంట్రాడేలో ఒక దశలో ఏకంగా 1,525.69 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్, మార్కెట్ ముగిసే సమయానికి 1,448.37 పాయింట్లు నష్టపోయి, 3.64 శాతం తగ్గి 38,297.29 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 431.55 పాయింట్లు నష్టపోయి, 3.71 శాతం పడిపోయి 11,201.75 వద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 3.36 శాతం క్షీణించగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 3.9 శాతం తగ్గింది. మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2018 నుండి వరస్ట్ ఇంట్రాడే క్షీణతను నమోదు చేసింది.

బ్యాంకింగ్ ఇండెక్స్ గత నాలుగు సంవత్సరాలలో సింగిల్ సెషన్లో ఇదే అతిపెద్ద పతనం. బ్యాంకింగ్ ఇండెక్స్ ఏకంగా 3.44 శాతం పతనమైంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఇ) లోని అన్ని సెక్టార్ల ఇండెక్స్ లు నష్టాల్లో ముగియగా, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 7.34 శాతం, నిఫ్టీ పిఎస్‌యు బ్యాంక్ ఇండెక్స్‌లో 5.3 శాతం క్షీణించాయి. నిఫ్టీ ఐటి 5.3 శాతం, నిఫ్టీ ఆటో 3.8 శాతం, నిఫ్టీ ఫార్మా 3.7 శాతం మేర క్షీణించింది. వేదాంత, టాటా మోటార్స్, హిండాల్కో, టెక్ మహీంద్రా మరియు టాటా స్టీల్ చార్ట్ లో భారీగా నష్టపోయింది. టాప్ లూజర్స్ గా నిలిచాయి. ఇవి 7.70 శాతం నుంచి 13.56 శాతం నష్టపోయాయి. నిఫ్టీ 50 సూచికలో ఐఓసి, మారుతి మాత్రమే లాభపడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ మరియు హెచ్‌డిఎఫ్‌సి సెన్సెక్స్‌లో నష్టాలకు ఎక్కువ దోహదపడ్డాయి.

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, కరోనావైరస్ చైనా దాటి ఇతర దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందడం, దాని ఫలితంగా ఏర్పడే ఆర్థిక పతనం గురించి మార్కెట్లు ఎక్కువగా ఆందోళన చెందుతున్నాయి. చైనాలో ప్రారంభమైన ఈ వైరస్ వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా 83,000 మందికి పైగా సోకింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పిఐ) అమ్మకాలు, రిటైల్ పెట్టుబడిదారులను కదిలించిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీకెండ్ ప్రాతిపదికన చూస్తే సెన్సెక్స్, నిఫ్టీ గత 10 సంవత్సరాలలో అత్యంత వరస్ట్ పెర్ఫార్మెన్స్ నమోదు చేశాయి. ఒక్కొక్కటి 7 శాతానికి పైగా పడిపోయిన తరువాత వరస్ట్ వీక్‌గా మారాయి.

First published:

Tags: Nifty, Sensex, Stock Market

ఉత్తమ కథలు