CLOSING BELL NIFTY TO END AROUND 11000 SENSEX ABOVE 37000 METAL STOCKS TANK MK
Stock market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...11000 దిగువన నిఫ్టీ పతనం...
ప్రతీకాత్మక చిత్రం
Stock market: మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 462.80 పాయింట్లు నష్టపోయి 37,018.32 వద్ద ముగియగా, అదే సమయంలో నిఫ్టీ 138 పాయింట్లు నష్టపోయి 10,980 పాయింట్ల వద్ద ముగిసింది.
చివరి గంటలో కొనుగోళ్లు పుంజుకోవడంతో ఎట్టకేలకు మార్కెట్లు డే కనిష్ట స్థాయి నుంచి రికవరీ బాటపట్టాయి. మార్కెట్లు ముగసే సమయానికి సెన్సెక్స్ 462.80 పాయింట్లు నష్టపోయి 37,018.32 వద్ద ముగియగా, అదే సమయంలో నిఫ్టీ 138 పాయింట్లు నష్టపోయి 10,980 పాయింట్ల వద్ద ముగిసింది. సెక్టార్ పరంగా చూసినట్లయితే నిప్టీ బ్యాంక్ సూచీ ఏకంగా 1.73 శాతం నష్టపోయిది. అలాగే ప్రధాన సెక్టార్లన్నీ కూడా నష్టాల్లోనే ముగిశాయి. ముఖ్యంగా మెటల్ స్టాక్స్ భారీగా పతనమయ్యాయి. నిఫ్టీ మెటల్స్ సూచీ ఏకంగా 3.13 శాతం పతనమైంది. అలాగే నిఫ్టీ ఫార్మా, ఇన్ ఫ్రా, రియాలిటీ సూచీలు ఒక శాతం చొప్పున నష్టపోయాయి.
స్టాక్స్ పరంగా చూసినట్లయితే వేదాంత, జేఎస్‌డబ్ల్యు స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఎస్ బీఐ, టాటా మోటార్స్ టాప్ లూజర్స్ గా నిలిచాయి. అలాగే విప్రో, భారతీ ఇన్ఫ్రాటెల్, మారుతి సుజుకి, రిలయన్స్ ఇండస్ట్రీస్, పవర్ గ్రిడ్ కార్ప్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక బీఎస్ఈ లిస్టులోని దాదాపు 300 స్టాక్స్ ఫ్రెష్‌గా 52 వారాల కనిష్ట స్థాయిని తాకాయి. ఇందులో ఐషర్ మోటార్స్, బ్లూడార్ట్, ఎక్సయిడ్ ఇండస్ట్రీస్, వీఎస్టీ టిల్లర్స్, కేర్ రేటింగ్స్, మోతీలాల్ ఓస్వాల్, ఎస్కార్ట్స్, ఆర్తీ ఇండస్ట్రీస్, ఐఎఫ్బీ ఆగ్రో భారీగా నష్టపోయాయి.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.