లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...కలిసి వచ్చిన కరోనా ప్యాకేజీ...

అమెరికా ఆర్థిక వ్యవస్థకు 2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీపై సెనెట్ నాయకులు, శ్వేతసౌదం ఒక అవగాహనకు రావడం ఇన్వెస్టర్లపై సానుకూల ప్రభావం చూపినట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు భారత ప్రభుత్వం కూడా ఆర్ధిక ఉద్దీపనలు ప్రకటించడంతో పెట్టుబడిదారుల్లో కొత్త ఆశలు రేపాయి.

news18-telugu
Updated: March 26, 2020, 4:07 PM IST
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...కలిసి వచ్చిన కరోనా ప్యాకేజీ...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. వరుసగా మూడో సెషన్లో మార్కెట్లు గ్రీన్ గా ముగిశాయి. Nifty 50 సూచీ 8641.45 పాయింట్ల వద్ద 323.60 పాయింట్ల లాభపడితే , Sensex 29946.77 పాయింట్ల వద్ద 1410.99 పాయింట్లు లాభపడింది. సెక్టార్ల పరంగా చూస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా మార్కెట్లకు బూస్టప్ ఇచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయం కట్టుదిట్టంగా అమలవుతుండడంతో పాటు.. అంతర్జాతీయ మార్కెట్లలో కనిపిస్తున్న సానుకూల పరిస్థితులు కూడా మార్కెట్ మంచి ఊపు తీసుకొస్తున్నాయి.

అమెరికా ఆర్థిక వ్యవస్థకు 2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీపై సెనెట్ నాయకులు, శ్వేతసౌదం ఒక అవగాహనకు రావడం ఇన్వెస్టర్లపై సానుకూల ప్రభావం చూపినట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు భారత ప్రభుత్వం కూడా ఆర్ధిక ఉద్దీపనలు ప్రకటించడంతో పెట్టుబడిదారుల్లో కొత్త ఆశలు రేపాయి.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు