CLOSING BELL NIFTY ENDS BELOW 14400 SENSEX PLUNGES 746 PTS DRAGGED BY METAL FINANCIALS MK
Stock Market: వరుసగా రెండో రోజు నష్టాల్లో స్టాక్ మార్కెట్ ముగింపు...
ప్రతీకాత్మక చిత్రం
స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిసాయి. మార్కెట్లు ఇప్పటికే రికార్డు స్థాయిని తాకిన రెండో రోజే దేశీయ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. దేశీయ బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్ 746 పాయింట్లు క్షీణించగా, నిఫ్టీ 1.5 శాతం మేర పతనమైంది.
స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిసాయి. మార్కెట్లు ఇప్పటికే రికార్డు స్థాయిని తాకిన రెండో రోజే దేశీయ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. దేశీయ బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్ 746 పాయింట్లు క్షీణించగా, నిఫ్టీ 1.5 శాతం మేర పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలతో రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు తదితర షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురైనట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 746.22 పాయింట్లు (1.50 శాతం) నష్టపోయి 48,878.54 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 218.45 పాయింట్లు (1.5 శాతం) పతనమై 14,371.90 వద్ద క్లోజ్ అయ్యింది. యాక్సిస్ బ్యాంకు అత్యధికంగా 4 శాతం మేర నష్టపోగా.. ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ టాప్ లూజర్స్ గా నిలిచాయి.