Home /News /business /

CLOSING BELL NIFTY ENDS AROUND 10950 SENSEX GAINS 277 POINTS INDIABULLS HOUSING SURGES MK

Stock Market: పుంజుకున్న మార్కెట్లు...లాభాల్లోకి సెన్సెక్స్, నిఫ్టీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Stock Market: సెన్సెక్స్ సూచీ 277.01 పాయింట్లు లాభపడి 36,976.85 వద్ద ముగియగా, నిఫ్టీ 85.70 పాయింట్లు లాభపడి 10,948.30 వద్ద ముగిసింది.

    Stock Market: దేశీయ మార్కెట్లు వరుస పతనాల అనంతరం మంగళవారం పుంజుకున్నాయి. సెన్సెక్స్ సూచీ 277.01 పాయింట్లు లాభపడి 36,976.85 వద్ద ముగియగా, నిఫ్టీ 85.70 పాయింట్లు లాభపడి 10,948.30 వద్ద ముగిసింది. మార్కెట్లలో ఇండియా బుల్స్ హౌజింగ్, ఎస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. అదే సమయంలో జీ ఎంటర్ టెయిన్ మెంట్స్, సిప్లా, రిలయన్స్ ఇండస్ట్రీస్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, టీసీఎస్ షేర్లు నష్టపోయి, టాప్ లూజర్లుగా నిలిచాయి. సెక్టార్ల పరంగా చూసినట్లయితే ఎనర్జీ మినహా అన్ని సెక్టార్లలో కొనుగోళ్ల సందడి కనిపించింది. ఇన్‌ఫ్రా, ఆటో, బ్యాంక్, మెటల్, ఎఫ్ఎంసీజీ కంపెనీల షేర్లు నష్టపోయాయి.

    రేపటి రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ భేటీలో వడ్డీరేట్ల తగ్గింపును ప్రకటించవచ్చని ప్రచారంతో మార్కెట్లలో కొనుగోళ్లు పుంజుకున్నాయి. మరోవైపు డీహెచ్ఎఫ్ఎల్ షేర్లు ఈ రోజు ఇంట్రాడేలో ఏకంగా 40 శాతం లాభపడ్డాయి. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ రుణ పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ, దానికి సంబంధించిన రుణ ప్రణాళిక (రిజల్యూషన్‌ ప్లాన్‌ డ్రాప్ట్‌)ను ఆమోదించింది. ఈ డ్రాఫ్ట్‌ ప్రణాళికను డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ సహకారంతో తయారు చేసింది. మరోవైపు మంగళవారం రూపాయి మరింత బలహీన పడింది. డాలర్ కు ప్రతిగా రూపీ విలువ రూ.70.75 పైసలకు పతనమైంది.
    First published:

    Tags: Business, Money, Nifty, Sensex, Stock Market

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు