Home /News /business /

CLOSING BELL NIFTY ENDS ABOVE 8700 SENSEX SURGES 2476 PTS NIFTY BANK PHARMA UP MK

లాభాల్లో ముగిసిన్ స్టాక్ మార్కెట్లు...బూస్ట్ అందించిన ఆసియా మార్కెట్లు...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఫ్రాన్స్, ఇటలీ సహా ప్రధాన యూరోపియన్ దేశాల్లో కరోనా మరణాలు తగ్గుముఖం పట్టడంతో యూరోపియన్ మార్కెట్లు సైతం లాభాల బాటపట్టాయి. ఫలితంగా దేశీయ మార్కెట్లు సైతం లాభపడ్డాయి.

    ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 ప్రభావం తగ్గుముఖం పడుతుందన్న ఆశలు ఇన్వెస్టర్లకు సరికొత్త బూస్ట్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఫ్రాన్స్, ఇటలీ సహా ప్రధాన యూరోపియన్ దేశాల్లో కరోనా మరణాలు తగ్గుముఖం పట్టడంతో యూరోపియన్ మార్కెట్లు సైతం లాభాల బాటపట్టాయి. ఫలితంగా దేశీయ మార్కెట్లు సైతం లాభపడ్డాయి. భారత స్టాక్ మార్కెట్లలో ఇవాళ మళ్లీ లాభాల సందడి కనిపించింది. ఉదయం ట్రేడింగ్ మొదలైన దగ్గర్నుంచే పాజిటివ్‌గా కనిపించిన సూచీలు ఇవాళ ఏకంగా 5 శాతానికి పైగా లాభాలతో దూసుకెళ్లాయి. మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 30067.21 పాయింట్ల వద్ద 2476.26 లాభంతో ముగిసింది. నిఫ్టీ సైతం అంతే జోరు ప్రదర్శించింది. ఎన్‌ఎస్ఈ నిఫ్టీ 8,792.20 వద్ద 708.40 పాయింట్ల లాభంతో ముగిసింది. అంతర్జాతీయ స్టాక్‌మర్కెట్లు లాభాల్లో దూసుకెళ్తుండడం భారత స్టాక్‌మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపిస్తున్నట్టు ట్రేడింగ్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఆసియా మార్కెట్లు సైతం కొద్దిమేర కోలుకున్నాయి. జపాన్ మార్కెట్ నిక్కీ 2.3 శాతం లాభాల్లో కొనసాగుతుండగా.. దక్షిణ కొరియా కోస్పి సైతం 1 శాతం మేర లాభపడింది. అమెరికా మార్కెట్లు సైతం దాదాపు 7 శాతం మేర లాభాలు నమోదు చేశాయి.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Business, Stock Market

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు