CLOSING BELL NIFTY ENDS ABOVE 10800 AFTER SLIPPING BELOW THIS LEVEL FOR THE 1ST TIME SINCE FEB 27 MK
Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు...10900 దిగువకు నిఫ్టీ...
(ప్రతీకాత్మక చిత్రం)
Stock Market | భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు...10900 దిగువకు నిఫ్టీ... ప్రధాన బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 418.38 పాయింట్లు నష్టపోయిన 36,699.84 వద్ద ముగియగా, నిఫ్టీ సైతం 134.80 పాయింట్లు నష్టపోయి 10,862.60 వద్ద ముగిసింది.
Stock Market | వారం ప్రారంభంలోనే మార్కెట్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ అంశంపై ఏర్పడన ఉద్రిక్తతలు మదుపరుల సెంటిమెంటును దెబ్బతీశాయి. ముఖ్యంగా దీంతో ప్రధాన బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 418.38 పాయింట్లు నష్టపోయిన 36,699.84 వద్ద ముగియగా, నిఫ్టీ సైతం 134.80 పాయింట్లు నష్టపోయి 10,862.60 వద్ద ముగిసింది. భారతీ ఎయిర్ టెల్, టెక్ మహీంద్రా, కోల్ ఇండియా, టీసీఎస్, బజాజ్ ఆటో షేర్లు టాగ్ గెయినర్లుగా సూచీలను బలపరచగా, ఎస్ బ్యాంక్, యూపీఎల్, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్ కార్ప్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ సూచీలను టాప్ లూజర్లుగా నిలిచాయి. ఐటీ సెక్టార్ మినహా, దాదాపు అన్ని సెక్టార్స్ నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా మెటల్స్, బ్యాంక్, ఆటో, ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రా, ఫార్మా స్టాక్స్ భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. స్మాల్ కప్, మిడ్ క్యాప్ సూచీలు ఒక శాతం చొప్పున నష్టపోయాయి.
ఇదిలా ఉంటే మార్కెట్లలో భారీ పతనానికి, ఆసియా మార్కెట్లలో వెల్లువెత్తిన అమ్మకాల ఒత్తిడి కారణంగా కనిపిస్తోంది. ప్రధానంగా యూఎస్-చైనా ట్రేడ్ వార్ భయాలతో పాటు జపాన్ ఎగుమతుల్లో క్షీణత కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే దేశీయంగా కాశ్మీర్ అంశంతో ముడిపడిన అంశాలు సైతం అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇదిలా ఉంటే చైనా కరెన్సీ యువాన్ 11 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. అటు రూపీ పతనం కూడా ఇన్వెస్టర్ల అమ్మకాలకు దారి తీసింది. అన్నింటి కన్నా ప్రధానంగా ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ పోర్టు ఫోలియో(ఎఫ్‌పీఐ)లు దేశీయ మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడుల ఉపసంహరణకు దిగింది. గత వారంతంలో ఎఫ్‌పీఐలు రూ.3 వేల కోట్లు ఉపసంహరించుకున్నాయి. జూలై నెలలో సుమారు రూ.15 వేల కోట్ల పెట్టుబడులను ఎఫ్‌పీఐలు దేశీయ మార్కెట్లలో అమ్మేసినట్లు కోటక్ సెక్యూరిటీస్ నివేదికలో తెలిపారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.