CLOSING BELL BENCH MARK INDICES END AT 2 MONTH LOW SENSEX LOSS 560 PTS MK
Stock Market: స్టాక్ మార్కెట్లలో రక్తకన్నీరు...ఒకే రోజు 560 పాయింట్లు సెన్సెక్స్ పతనం...
ప్రతీకాత్మక చిత్రం (Reuters)
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రకటించిన నేపథ్యంలో, ఒక్కసారిగా విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల నుంచి తమ సంపదను తరలిస్తున్నారు. దీంతో శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా -560.45 (-1.44%) పాయింట్లు నష్టపోయి 38,337.01 వద్ద నెగిటీవ్ గా ముగిసింది
వారాంతంలో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. బెంచ్ మార్క్ సూచీలు రెండు నెలల కనిష్టాన్ని చవిచూశాయి. ముఖ్యంగా ఎఫ్పీఐ( ఫారిన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు)లు ట్రస్టులుగా ఉన్నట్లయితే సూపర్ రిచ్ సర్ చార్జీ చెల్లించాల్సి ఉంటుందని, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రకటించిన నేపథ్యంలో, ఒక్కసారిగా విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల నుంచి తమ సంపదను తరలిస్తున్నారు. దీంతో శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా -560.45 (-1.44%) పాయింట్లు నష్టపోయి 38,337.01 వద్ద నెగిటీవ్ గా ముగిసింది, అదే సమయంలో నిఫ్టీ సైతం -177.65 (-1.53%) పాయింట్లు నష్టపోయి 11,419.25 పాయింట్ల వద్ద నెగిటీవ్ గా ముగిసింది. దాదాపు అన్ని సెక్టార్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. బ్యాంక్ నిఫ్టీ సైతం ఏకంగా 660 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ ఆటో సూచీ ఏకంగా 3.31 శాతం నష్టపోగా, దాదాపు మూడేళ్ల కనిష్టాన్ని నిఫ్టీ ఆటో అందుకుంది. సూచీలను నష్టపరిచిన స్టాక్స్ చూసినట్లయితే మహీంద్రా అండ్ మహీంద్రా -4.37శాతం నష్టపోగా, బజాజ్ ఫైనాన్స్ -4.17 శాతం, ఐషర్ మోటార్స్ -4.03 శాతం, హీరో మోటోకార్ప్, -3.71 శాతం, టాటా మోటార్స్ -3.67 శాతం నష్టపోయాయి.
ఈరోజు మార్కెట్లు
ఇదిలా ఉంటే మార్కెట్లను నష్టపరిచిన కారణాలు చూసినట్లయితే ఎఫ్ పీఐలసపై సూపర్ రిచ్ సర్ చార్జీలతో పాటు, దేశ వ్యాప్తంగా బలహీనంగా రుతుపవనాల పురోగతి కూడా జత అయ్యింది. అలాగే నిఫ్టీ వరుసగా కీలక మద్దతు స్థాయి 11,700; 11,650; 11,600; 11,500లను కోల్పోతూ రావడంతో పాటు, నిఫ్టీ 100 రోజుల ఈఎంఏ దిగువకు పడిపోయి ఇంట్రా మంత్లీ కనిష్ట స్థాయి వద్ద ట్రేడవుతుందని, అలాగే ఇండెక్స్ 200 రోజుల డీఎంఏ 11125 పాయింట్ల దిగువ దిశగా వెళుతోంది. ఈ నేపథ్యంలో 100 రోజుల సింపుల్ మూవింగ్ యావరేజ్ నిఫ్టీని నూతన కనిష్ట స్థాయిల దిశగా పతనమయ్యే అవకాశం ఉందని టెక్నికల్ ఎక్స్ పర్ట్స్ పేర్కొంటున్నారు. దీంతో పాటు బలహీనమైన కార్పోరేట్ రిజల్ట్స్ మిశ్రమంగా ఉండటం కూడా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.