Home /News /business /

CLEVER PLANNING CAN MAKE EVEN RS 10 LAKH INCOME FULLY TAX FREE HERES HOW GH VB

Income Tax Planning: మీకు రూ.10 లక్షలకు పైగా ఆదాయం ఉందా.. అయితే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు.. ఎలా అంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుత ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం, పన్ను పరిధిలోకి వచ్చే రూ. 10 లక్షల కంటే అధిక ఆదాయం ఉన్న వ్యక్తి పన్ను రూపేణా పైసా చెల్లించకుండా తప్పించుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం..

మరో రెండు వారాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కేంద్ర బడ్జెట్ (Union Budget 2022-23)ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో సరికొత్త బడ్జెట్‌తో తమకు కొంత ఉపశమనం లభిస్తుందని పన్ను(Tax) చెల్లింపుదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రూ. 2.5 లక్షల నుంచి ప్రాథమిక మినహాయింపు (basic exemption) పెరుగుతుందని పలువురు ఆశిస్తున్నారు. మరికొందరు తమ పన్ను బాధ్యత తగ్గేలా పన్ను శ్లాబ్‌లను రీ-అరేంజ్(Re Arrange) చేయాలని కోరుతున్నారు. ధనికులు కూడా తమ పన్నుపై విధించిన సర్‌ఛార్జీలు ఎత్తివేస్తారేమోనని ఆశిస్తున్నారు. ఇలా బడ్జెట్‌పై(Budget) పన్ను చెల్లింపుదారులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ప్రస్తుత పన్ను నిబంధనలు పరిశీలిస్తే.. తెలివైన ప్రణాళికతో ఇప్పటికిప్పుడు పన్నును గణనీయంగా తగ్గించుకోవడానికి పుష్కలంగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అవేంటో చూద్దాం.

Amazon Great Republic Day Sale 2022: వాటిపై భారీ డిస్కౌంట్.. రూ. 2,799 ధరకే ఆ ప్రొడక్ట్ సొంతం..


ప్రస్తుత ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం, పన్ను పరిధిలోకి వచ్చే రూ. 10 లక్షల కంటే అధిక ఆదాయం ఉన్న వ్యక్తి పన్ను రూపేణా పైసా చెల్లించకుండా తప్పించుకోవచ్చు. అదెలాగో తెలుసుకుంటే... ఓ వ్యక్తి జీతం ద్వారా మొత్తం రూ.10 లక్షల ఆదాయం... రూ. 20,000 వడ్డీ ఆదాయం కలిగి ఉన్నారని అనుకుంటే... ముందుగా రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్ పొందొచ్చు. దీంతో పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.9.7 లక్షలకు తగ్గుతుంది. ఆ తర్వాత సెక్షన్ 80C కింద పన్ను ఆదా చేసే పెట్టుబడుల (tax-saving investments) ద్వారా పన్ను వర్తించే ఆదాయాన్ని రూ. 1.5 లక్షల వరకు తగ్గించవచ్చు. సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మరో రూ.50,000 తగ్గించుకోవచ్చు. ఈ రెండు తగ్గింపుల వల్ల పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.7.7 లక్షలకు తగ్గుతుంది.

Flipkart Big Saving Days Sale 2022: ల్యాప్‌టాప్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. తక్కువ ధరకు 5జీ మొబైల్ స్మార్ ఫోన్లు..


హోం లోన్ మినహాయింపు మొత్తం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుంచి మరొక పెద్ద భాగాన్ని తీసివేస్తుంది. పన్ను చెల్లింపుదారులు అద్దెపై జీవిస్తున్నట్లయితే, హెచ్ఆర్ఏ (HRA) కోసం మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. హోం లోన్ లేదా హెచ్‌ఆర్‌ఏ అనేది పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని రూ. 2 లక్షలు తగ్గించి, నికర పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని రూ. 5.7 లక్షలకు తగ్గిస్తుంది. అలాగే 60 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పన్ను చెల్లింపుదారులు ఆరోగ్య బీమా ప్రీమియం కోసం రూ. 25,000 వరకు తగ్గింపును పొందవచ్చు. సీనియర్ సిటిజన్ తల్లిదండ్రుల ఆరోగ్య బీమా కోసం చెల్లించిన రూ. 50,000 వరకు మినహాయింపును విడిగా క్లెయిమ్ చేయవచ్చు.

WhatsApp: త్వరలోనే వాట్సాప్​లో డ్రాయింగ్ ఎడిటర్‌ ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే..?


సీనియర్ సిటిజన్‌లకు బీమా చేయడానికి అధిక ధర ఉన్నందున, ఆ పరిమితిని సులభంగా ఉల్లంఘించవచ్చు. ఈ రెండు తగ్గింపులను క్లెయిమ్ చేసినట్లయితే, పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 4.95 లక్షలకు పడిపోతుంది. ఇది కీలకమైన పరిమితిని అని చెప్పవచ్చు. ఎందుకంటే పన్ను వర్తించే ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువ ఉంటే.. పన్ను చెల్లింపుదారులు సెక్షన్ 87A ప్రకారం పూర్తి పన్ను రాయితీకి అర్హులు. మరో మాటలో చెప్పాలంటే.. నికర పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువ ఉంటే ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

TTD Recruitment 2022: టీటీడీ జాబ్ నోటిఫికేషన్... దరఖాస్తుకు 3 రోజులే గడువు

ఇంటెలిజెంట్ ప్లానింగ్ ద్వారా పన్ను చెల్లింపుదారులు చట్టబద్ధంగా పొందే అన్ని మినహాయింపులను పొందవచ్చు. పన్ను చెల్లింపుదారుల ఆర్థిక శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఈ తగ్గింపులను (deductions) పెంచుతోంది. ట్యాక్స్ సేవింగ్స్ ద్వారా పన్ను చెల్లింపుదారులు డబ్బు ఆదా చేసుకోవచ్చు. అలాగే పెట్టుబడులు దీర్ఘకాలిక సంపదను సృష్టించడంలో సహాయపడతాయి.
Published by:Veera Babu
First published:

Tags: Income tax, TAX SAVING

తదుపరి వార్తలు