ITR: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే థాయ్‌ల్యాండ్ ట్రిప్ గెలుచుకునే ఛాన్స్... క్లియర్‌ట్యాక్స్ ఆఫర్

ClearTax Big Filing Days | ఆగస్ట్ 21, 22 తేదీల్లో 'బిగ్ ఫైలింగ్ డేస్' ప్రారంభించింది క్లియర్‌ట్యాక్స్. ఈ రెండు రోజుల్లో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే ట్యాక్స్‌పేయర్స్‌కు ఆఫర్లు ప్రకటించింది.

news18-telugu
Updated: August 21, 2019, 11:34 AM IST
ITR: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే థాయ్‌ల్యాండ్ ట్రిప్ గెలుచుకునే ఛాన్స్... క్లియర్‌ట్యాక్స్ ఆఫర్
ITR: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే థాయ్‌ల్యాండ్ ట్రిప్ గెలుచుకునే ఛాన్స్... క్లియర్‌ట్యాక్స్ ఆఫర్
news18-telugu
Updated: August 21, 2019, 11:34 AM IST
మీరు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా? ఇంకా చేయలేదా? సమయం ముంచుకొచ్చేస్తోంది. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఆగస్ట్ 31 చివరి తేదీ. గడువు పూర్తిగా దగ్గరికొచ్చాక టెన్షన్ పడటం కన్నా ముందే ఐటీఆర్ ఫైల్ చేయడం మేలు. చివరి రెండుమూడు రోజుల్లో ఐటీ రిటర్న్స్ పైల్ చేయడం అలవాటు. ఇలా హడావుడిగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం ద్వారా ఫైలింగ్‌లో తప్పులు దొర్లుతుంటాయి. ఆ తర్వాత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌ను సులభతరం చేసే ఆన్‌లైన్ ప్లాట్‌‌ఫామ్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ క్లియర్‌ట్యాక్స్‌లో ఉచితంగా ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు. ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైలింగ్, జీఎస్‌టీ, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్, జీఎస్‌‌టీ, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం ఆగస్ట్ 21, 22 తేదీల్లో 'బిగ్ ఫైలింగ్ డేస్' ప్రారంభించింది క్లియర్‌ట్యాక్స్. ఈ రెండు రోజుల్లో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే ట్యాక్స్‌పేయర్స్‌కు ఆఫర్లు ప్రకటించింది.

క్లియర్‌ట్యాక్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఐటీ రిటర్స్ ఫైల్ చేయడం ఉచితమే. అయితే 'బిగ్ ఫైలింగ్ డేస్'లో భాగంగా ఆగస్ట్ 21, 22 తేదీల్లో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే కొన్ని బహుమతులు గెలుచుకునే అవకాశముంది. ప్రతీ నిమిషానికి ఓ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్, ప్రతీ గంటకు ఓ గూగుల్ హోమ్ స్మార్ట్ స్పీకర్, ప్రతీ రోజు థాయ్‌ల్యాండ్ ట్రిప్ గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది క్లియర్‌ట్యాక్స్. ఈ ఆఫర్ రెండు రోజులు మాత్రమే. ఇవి కాకుండా క్లియర్‌ట్యాక్స్‌లో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే ప్రతీ ఒక్కరికీ రూ.10,000 విలువైన రివార్డ్స్ అందిస్తోంది. ఈ రివార్డులను ఆగస్ట్ 31 వరకు పొందొచ్చు. ClearTax.in వెబ్‌సైట్ లేదా, క్లియర్‌ట్యాక్స్ ఇ-ఫైలింగ్ యాప్ ద్వారా ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు. క్లియర్‌ట్యాక్స్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 40 లక్షల మంది ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారు.

Realme 5 Pro: నాలుగు కెమెరాలతో రియల్‌మీ 5 ప్రో... ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:

Loan in 59 minutes: 59 నిమిషాల్లో హోమ్ లోన్, కార్ లోన్ ఇవ్వనున్న బ్యాంకులు

LIC Policy: ఎల్ఐసీ పాలసీ నచ్చలేదా? వెనక్కి ఇవ్వొచ్చు తెలుసా
Loading...
Uday Express: విశాఖపట్నం-విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ రైలు ప్రత్యేకతలివే
First published: August 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...