ప్రస్తుతం నడుస్తున్న హాలిడేస్ సీజన్లో(Holiday Season) చాలా మందికి నచ్చిన ప్రదేశాలను చూసి రావాలని ఉంటుంది. కుటుంబంలో సరదాగా ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. కానీ అందరి అకౌంట్‌లో ట్రిప్‌కి(Trip) సరిపడా డబ్బులు ఉండకపోవచ్చు. అలాంటి వారి కోసమే ట్రావెల్ నౌ పే లేటర్ ఆప్షన్ వస్తోంది. ట్రావెల్ బుకింగ్ పోర్టల్ అయిన క్లియర్ ట్రిప్ ఈ వారాంతం లోపు ట్రావెల్ నౌ పే లేటర్(Travel Now Pay Later) ఆప్షన్ తీసుకురానుంది.
ట్రావెల్ నౌ పే లేటర్
పేరులో ఉన్నట్టుగానే నచ్చిన ప్రదేశానికి వెళ్లి రావడానికి ఈ కంపనీ క్విక్ లోన్ ఆప్షన్ అందిస్తుంది . ఇది బై నౌ పే లేటర్‌కి ట్రావెల్ వెర్షన్. క్లియర్ ట్రిప్ కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అయిన ప్రహ్లద్ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ప్రస్తుతానికి ఇది లిమిటెడ్ బేస్‌లో ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఫ్యూచర్‌లో దీన్ని క్రమక్రమంగా విస్తరించే యోచనలో ఉన్నట్లు చెప్పారు. పలు ఫిన్‌టెక్ కంపెనీల సహకారంతో కస్టమర్ల క్రెడిట్ బేస్‌ను తీసుకుని ఈ స్కీమ్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. ట్రావెల్ టిక్కెట్ బుక్ చేసుకునేటప్పుడు గానీ, ట్రిప్‌కి వెళ్లే టైమ్‌లో కానీ తీసుకునే అత్యవసర లోన్‌ను TNPL అంటారు. ఇది తర్వాత ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో పే చేయవచ్చు.
ఇది నో కాస్ట్ EMI ఆప్షన్‌తో పాటు, తీసుకున్న అమౌంట్‌ని బట్టి, తిరిగి చెల్లించే కాలాన్ని బట్టి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇండియన్ కస్టమర్లు చాలా మంది షాపింగ్ చేసేటప్పుడు ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో చెల్లించే ఆప్షన్‌లను ఎంచుకుంటున్నారు. కస్టమర్‌లను ఆకట్టుకునేందుకు చాలా ఫిన్‌టెక్ కంపెనీలు BNPL స్కీమ్‌లను తీసుకువచ్చాయి. గ్లోబల్ డేటా రిపోర్ట్స్ ప్రకారం BNPL సర్వీసుల్లో యాన్యువల్ గ్రోత్ రేట్ 32.5% పెరిగింది. 2026 నాటికి ఇది 1.1 ఇండియన్ ట్రిలియన్ రూపీస్ దాటుతుందని అంచనా వేస్తున్నారు.
BNPL
ఇండియన్స్‌లో ఎక్కువ శాతం BNPL లోన్ తీసుకున్నవారు ఎడ్యుకేషన్ , స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ , ట్రావెల్ అండ్ ఫ్యాషన్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. గ్లోబల్ డేటాలోని సీనియర్ బ్యాంకింగ్ అండ్ పేమెంట్ అనలిస్ట్ అయిన శివాని గుప్తా మాట్లాడుతూ.. BNPL అనేది ఆస్ట్రేలియా, యూరోపియన్ మార్కెట్లో ఇప్పటికే ప్రసిద్ధి చెందిందని చెప్పారు. ఇప్పుడు ఇండియాలో వేగంగా వృద్ధి చెందుతుందని తెలిపారు. క్రెడిట్ కార్డులు లేని వారికి, కొనుగోలు చేసిన తర్వాత వడ్డీ లేకుండా వాయిదాలలో చెల్లించే వారికి ఉపయోగపడుతుందని చెప్పారు. BNPL ద్వారా తన పార్ట్నర్ మర్చంట్స్ ప్రొడక్ట్స్ కొనుక్కుని తర్వాత 15 నుంచి 30 రోజుల వ్యవధుల్లో తిరిగి చెల్లించే సదుపాయం ఉంటుందని చెప్పారు. తిరిగి చెల్లించడంలో ఆలస్యం చేస్తే చెల్లించాల్సిన మొత్తంపై వడ్డీ పడుతుందని తెలిపారు. ఈ కామర్స్ కంపెనీలైన బిగ్ బాస్కెట్, అమెజాన్ , ఫ్లిప్కార్ట్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో, స్విగ్గీ ట్రావెల్ కంపెనీ లైన గోబీ బో, క్లియర్ ట్రిప్ వంటి కంపెనీలు కూడా ఈ ఆప్షన్ అందించే వాటిలో ఉన్నాయి.
TNPLని వినియోగిస్తారా?
ఇండియాలో 2020 సెప్టెంబర్ నుంచి డిజిటల్ ట్రావెల్ పర్చేస్ విధానం చాలా మార్పులకు గురైంది. చాలామంది ఈ ఆన్‌లైన్ సర్వీసెస్ ఉపయోగిస్తున్నారు. ట్రావెలింగ్‌కి చేతిలో తగిన డబ్బులు లేనప్పుడు ఈ పే లేటర్, సేవ్ నౌ ట్రావెల్ లెటర్ ఆప్షన్స్ వాడుకుంటున్నారు. ప్రస్తుత ఈ సర్వీస్‌లు ఇండియాలో వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఇటువంటి సర్వీసులను ఎన్నుకునే ముందు ఇందులో ఉన్న మంచి చెడ్డలు తెలుసుకోవడం ముఖ్యం. BNPL, TNPL ఉపయోగించే ముందు వాటిలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్లియర్‌గా చదివి, పెనాల్టీలు ఇంట్రెస్ట్ రేట్లు గురించి తెలుసుకోవడం మంచిది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Buy now pay later, Online service, Travel