భారత ఫుట్బాల్ క్రీడా రంగంలో గొప్ప ముందడుగు పడింది. ఇండియన్ సూపర్ లీగ్లోనిి ముంబై సిటీ ఎఫ్సీలో మెజారిటీ వాటా కొనుగోలు చేయడానికి సిటీ ఫుట్బాల్ గ్రూప్ ముందుకొచ్చింది. సిటీ ఫుట్బాల్ గ్రూప్ 65 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఈ క్లబ్లో బాలీవుడ్ స్టార్లు రణ్బీర్ కపూర్, బిమల్ పరేఖ్ ఉమ్మడిగా 35 శాతం వాటాను కలిగిఉన్నారు. ఈ పెట్టుబడికి సంబంధించి ఆయా ఫుట్బాల్ క్లబ్స్ అధికారికంగా లావాదేవీలు పూర్తి చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని సిటీ ఫుట్బాల్ గ్రూప్ సీఈవో ఫెరాన్ సొరియానోతో కలసి ఫుట్బాల్ క్రీడాభివృద్ధి లిమిటెడ్, రిలయన్స్ ఫౌండేషన్ చైర్మన్ నీతా అంబానీ ప్రకటించారు. ఈ డీల్ వల్ల ఇటు ముంబై ఎఫ్సీకి, అటు సీఎఫ్జీకి కూడా లాభదాయకంగా ఉండనుంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.