హోమ్ /వార్తలు /బిజినెస్ /

Citroen: సిట్రోయెన్ నుంచి సరికొత్త SUV.. వచ్చే నెలలో మార్కెట్లోకి లాంచ్.. ప్రత్యేకతలు ఇవే..

Citroen: సిట్రోయెన్ నుంచి సరికొత్త SUV.. వచ్చే నెలలో మార్కెట్లోకి లాంచ్.. ప్రత్యేకతలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఫ్రెంచ్ ఆటోమేకర్ సిట్రోయెన్, భారత్‌లో వెహికల్స్ తయారు చేయడంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో మేడిన్ ఇండియా SUVని వచ్చే నెలలో మన దేశంలో ఆవిష్కరించనున్నట్లు తాజాగా వెల్లడించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Citroen: దిగ్గజ గ్లోబల్ ఆటోమొబైల్ కంపెనీలు భారత్‌లో బిజినెస్‌ను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. మేడిన్ ఇండియా(Make in india) ఇనిషియేటివ్‌లో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను కంపెనీలు అందిపుచ్చుకుంటున్నాయి. ఫ్రెంచ్ ఆటోమేకర్ సిట్రోయెన్ కూడా భారత్‌లో వెహికల్స్ తయారు చేయడంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో మేడిన్ ఇండియా SUVని వచ్చే నెలలో మన దేశంలో ఆవిష్కరించనున్నట్లు తాజాగా వెల్లడించింది.

సిట్రోయెన్ ఈ సరికొత్త SUVని 2023, ఏప్రిల్ 27న లాంచ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కానీ ఈ వెహికల్ గురించి కంపెనీ మరిన్ని వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇది ‘C3 ఎయిర్‌క్రాస్’ పేరుతో మార్కెట్లోకి రావచ్చని నివేదికలు చెబుతున్నాయి. సిట్రోయెన్ ఇండియాలో రిలీజ్ చేసే నెక్స్ట్ ప్రొడక్ట్, C3 హ్యాచ్‌బ్యాక్ బేస్డ్ మిడ్ సైజ్ SUVగా ఉంటుందని కంపెనీ గతంలోనే వెల్లడించింది. దీన్ని ఇండియన్ రోడ్లపై టెస్టింగ్ చేస్తున్న ఫోటోలు కూడా బటయకు వచ్చాయి. ఇదే ‘C3 ఎయిర్‌క్రాస్’ అని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

* స్పెషల్ SUV

సిట్రోయెన్ లేటెస్ట్ SUVని కంపెనీ ఇండియాలోనే తయారు చేస్తోంది. దేశంలో అత్యంత పోటీ ఉన్న కాంపాక్ట్ SUV విభాగంలో మంచి మార్కెట్ వాటా లక్ష్యంగా ఇది మార్కెట్లోకి రానుంది. సిట్రోయెన్ మాతృ సంస్థ స్టెల్లాంటిస్ (Stellantis), ఇండియన్ కస్టమర్ల అవసరాలను తీర్చే ప్రపంచ స్థాయి వాహనాలను ఉత్పత్తి చేయడానికి ఇప్పటికే భారీగా పెట్టుబడి పెట్టింది. దీంతో C3 ఎయిర్‌క్రాస్ వెహికల్‌ను ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దింది. ఈ లేటెస్ట్ SUV 5-సీట్, 7-సీట్ వంటి రెండు సీటింగ్ లేఅవుట్స్‌లో రానుంది. 7 సీట్ మోడల్‌లో రెండు, మూడో వరుసల్లో బెంచ్ టైప్ సీట్లు ఉంటాయి. కొత్త మోడల్ యూరోపియన్-స్పెక్ C3 ఎయిర్‌క్రాస్ కంటే కాస్త పెద్దదిగా ఉండవచ్చు.

* ఇంజిన్ స్పెసిఫికేషన్స్

C3 ఎయిర్‌క్రాస్ CMP మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్‌ బేస్డ్ 1.2-లీటర్, 3-సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో రావచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఇది 110hp పవర్‌ను, 190Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గేర్‌బాక్స్ ఆప్షన్ వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

Home Loan: కొత్త ఇల్లు కొంటున్నారా? హోమ్ లోన్‌తో ట్యాక్స్‌ ఇలా సేవ్‌ చేసుకోండి..

* ఇతర ఫీచర్లు

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం.. కొత్త సిట్రోయెన్ SUV విశాలమైన క్యాబిన్, ఆధునిక ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లతో రావచ్చు. ప్రస్తుతానికి ఇది పెట్రోల్ ఆప్షన్‌లో వచ్చినా, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. 10.2 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, పవర్ విండోస్, 4 స్పీకర్లు, ఆటో AC వంటి అనేక ఇతర ఫీచర్లతో C ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ మార్కెట్లోకి రానుంది.

* ధర ఎంత?

5-సీట్ల C3 ఎయిర్‌క్రాస్ SUV హ్యుందాయ్ క్రెటా, టయోటా హైర్డర్, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, VW టైగన్, MG ఆస్టర్, స్కోడా కుషాక్‌లతో పోటీ పడనుంది. 7-సీటర్ వెహికల్ కియా కార్నెస్, మారుతి సుజుకి XL6 వంటి వాటికి పోటీగా ఉంటుంది. దీంతో C3 ఎయిర్‌క్రాస్ వెహికల్ ధరలు కూడా పోటీ కంపెనీల మాదిరిగానే ఉండవచ్చు. లేదంటే మార్కెట్ షేర్ పెంచుకోవడానికి ఇంకా తక్కువ ధరకే అందించవచ్చు.

First published:

Tags: SUV

ఉత్తమ కథలు