హోమ్ /వార్తలు /బిజినెస్ /

Citroen C3 EV: వచ్చే ఏడాది ఇండియన్ మార్కెట్లోకి సిట్రోయెన్ C3 ఎలక్ట్రిక్ కారు.. ఈవీ ధర, ఫీచర్ల వివరాలు..

Citroen C3 EV: వచ్చే ఏడాది ఇండియన్ మార్కెట్లోకి సిట్రోయెన్ C3 ఎలక్ట్రిక్ కారు.. ఈవీ ధర, ఫీచర్ల వివరాలు..

Photo Credit : Citroen

Photo Credit : Citroen

Citroen C3 EV: ఫ్రెంచ్ వాహన తయారీ కంపెనీ సిట్రోయెన్ (Citroen) ఇండియాలో ఒక బడ్జెట్ ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం, ఈ కంపెనీ సిట్రోయెన్ సీ3 (Citroen C3 EV) అనే హ్యాచ్‌బ్యాక్ ఎలక్ట్రిక్ కారును విడుదల చేయాలని భావిస్తోంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లకు (Electric Cars) డిమాండ్ విపరీతంగా నెలకొంది. దీంతో దేశీయ వాహన తయారీ కంపెనీలతో పాటు విదేశీ వెహికల్ తయారీ సంస్థలు సైతం ఇండియాలో ఎలక్ట్రిక్‌ కార్లను రిలీజ్ చేయడం మొదలు పెట్టాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం ఫ్రెంచ్ వాహన తయారీ కంపెనీ సిట్రోయెన్ (Citroen) కూడా ఇండియాలో ఒక బడ్జెట్ ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం, ఈ కంపెనీ సిట్రోయెన్ సీ3 (Citroen C3 EV) అనే హ్యాచ్‌బ్యాక్ ఎలక్ట్రిక్ కారును విడుదల చేయాలని భావిస్తోంది.

సీ3 హ్యాచ్‌బ్యాక్ ఈ-కారును భారత్‌లో పరిచయం చేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. కాకపోతే ఒక ఆటోమొబైల్ వెబ్‌సైట్ రిపోర్ట్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ రిపోర్టు ప్రకారం ఇండియాలో మార్చి 2023లోగా సిట్రోయెన్ సీ3 ఈవీ లాంచ్ అవ్వొచ్చు.

* పెట్రోల్ వేరియంట్ లాంచ్

సిట్రోయెన్ సీ3 పెట్రోల్ వేరియంట్ 2022 జులైలో రూ.5.70 లక్షలు-8.05 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో రిలీజ్ అయింది. ఇది 5,750 rpm వద్ద 80.46 bhp శక్తిని, 3,750rpm వద్ద 115 Nm టార్క్‌ను అందిస్తోంది. అయితే ఇప్పుడు ఈ కారుకు ఎలక్ట్రిక్ వేరియంట్‌ను కంపెనీ తయారు చేసిందని, దానిని వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో తీసుకొస్తుందని సమాచారం. కాగా ఎలక్ట్రిక్ వేరియంట్ ధర పెట్రోల్ వేరియంట్ కంటే కాస్త ఎక్కువగా ఉండే అవకాశముంది.

ఎలక్ట్రిక్ సీ3 కారు ధరలు రూ.9-12 లక్షల మధ్య ఉండవచ్చు. ఈ ధరతో ఈ హ్యాచ్‌బ్యాక్ కారు విడుదలైతే చాలా మంది భారతీయులు దీనిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఎలక్ట్రిక్ కార్ల కంటే ఈ ధర ఎంతో తక్కువ అని చెప్పవచ్చు.

* వాటితో పోలిస్తే మంచివే..

నిజానికి సెడాన్, కంపాక్ట్-SUV వంటి కార్లతో పోలిస్తే హ్యాచ్‌బ్యాక్ కార్లు చిన్నవిగానే ఉంటాయి. అందువల్ల వీటిలో బ్యాటరీ సైజు తగ్గే అవకాశం ఉంది. ఫలితంగా రేంజ్ కూడా తగ్గొచ్చు. ధర తక్కువైనా తక్కువ రేంజ్ వల్ల దీనిని ఎంతమంది కొనుగోలు చేస్తారనేది కూడా ప్రస్తుతానికి ఒక ప్రశ్నార్థకమే. సిట్రోయెన్ కంపెనీ తన అప్‌కమింగ్ ఆల్-ఎలక్ట్రిక్ కారు మోటార్స్/ఇంజన్ స్పెసిఫికేషన్లను ఇప్పటివరకైతే బయటపెట్టలేదు. దీంతో రేంజ్‌ను అంచనా వేయడం కూడా కష్టంగా మారింది.

ఇది కూడా చదవండి : డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ సింపుల్‌గా డౌన్‌లోడ్ చేయండిలా

* మరిన్ని కంపెనీల నుంచి ఈవీలు

2022-23లో భారత్‌ ఎలక్ట్రిక్ కారు మార్కెట్‌లో ఎంట్రీ-లెవెల్ మొదలుకొని లగ్జరీ కార్ల వరకు చాలా ఎలక్ట్రిక్ కార్లు రిలీజ్ కానున్నాయి. ఇప్పటినుంచి, వచ్చే ఏడాదిలోగా ఇండియాలో హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ 2022, బీఎండబ్ల్యూ ఐ సెవెన్, టాటా టియాగో, హ్యుందాయ్ ఐకానిక్, టాటా ఆల్ట్రోజ్ ఈవీ, ఫోర్డ్ ముస్తాంగ్ మాక్ ఇ, మహీంద్రా eKUV100, మెర్సిడెస్ బెంజ్ EQS SUV వంటి ఎలక్ట్రిక్ కార్లు విడుదల కానున్నాయి.

అయితే టాటా ఆల్ట్రోజ్, మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు, ఓలా ఎలక్ట్రిక్ కార్ తప్ప అప్‌కమింగ్ ఈ-కార్లు అన్నీ కూడా భారీ ప్రైస్ ట్యాగ్‌తో వస్తున్నాయి. వీటిలో టాటా మోటార్స్ నుంచి రూ.10-12 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో రానున్న టాటా ఆల్ట్రోజ్ ఈవీ (Tata Altroz EV) ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. ఈ ఆల్ట్రోజ్ ఈవీ నెక్సాన్ ఈవీ లాంటి పవర్‌ట్రెయిన్‌తో రావచ్చని సమాచారం.

Published by:Sridhar Reddy
First published:

Tags: Auto, Electric cars, Electric Vehicles

ఉత్తమ కథలు