పెరుగుతున్న ముడి సరుకు వ్యయాలు, రవాణా ఖర్చులతో వాహన తయారీ సంస్థలు కొత్త కార్ల ధరలు పెంచుతున్నాయి. ఇప్పటికే అనేక ప్రముఖ ఆటోమేకర్లు వివిధ మోడళ్లపై ధరలు పెంచగా.. ఇప్పుడు, ఈ జాబితాలోకి ఫ్రెంట్ కార్ బ్రాండ్ సిట్రోయెన్ (Citroen) కూడా చేరింది. తాజాగా సిట్రోయోన్ తన మిడ్‌రేంజ్ ఎస్యూవీ సీ5 ఎయిర్ క్రాస్ ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. దీని ధరను ఏకంగా రూ. 1.40 లక్షల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సిట్రోయెన్ సంస్థ భారత్‌లో విక్రయిస్తున్న ఏకైక మోడల్ సిట్రోయెన్ సీ 5 ఎయిర్‌క్రాస్. ఇది ఫీల్, షైన్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
ప్రస్తుతం సిట్రోయెన్ ఫీల్ (మోనో-టోన్) వేరియంట్ రూ. 29.90 లక్షల వద్ద లభిస్తుండగా.. ఫీల్ (ట్రిమ్ డ్యుయల్-టోన్) వేరియంట్ రూ. 30.40 లక్షల వద్ద అందుబాటులో ఉంది. దీని టాప్- స్పెక్ షైన్ వేరియంట్ రూ. 31.90 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వద్ద లభిస్తుంది. అయితే తాజా ధరల పెరుగుదలతో ఇప్పుడు కొత్త సిట్రోయెన్ సీ5 ఎయిర్ క్రాస్ ఫీల్ వేరియంట్ ధర రూ. 31.30 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. డ్యుయల్-టోన్ ఫీల్ వేరియంట్ ధర రూ. 31.80 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. షైన్ ట్రిమ్ మోనో-టోన్, డ్యూయల్-టోన్ వేరియంట్ల ధరలు రూ. 32.80 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతాయి.
ఇక, సిట్రోయెన్ సీ5 ఎయిర్ క్రాస్ ఇంటీరియర్ డిజైన్ విషయానికి వస్తే.. ఇందులో ఫుట్ ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ ఇంజిన్, స్టాప్ స్టార్ట్ ఫంక్షన్, 12.3 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఫోన్ మిర్రరింగ్ ఫంక్షన్‌తో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లను అందించింది. ఈ కారులో 2.0 లీటర్ డీజిల్ ఇంజన్‌ను సంస్థ చేర్చింది. ఈ ఇంజిన్ 177 బీహెచ్పీ, 400 ఎన్ఎమ్ టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8- స్పీడ్ ఆటో మేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. లీటర్‌కి 18.6 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.