ఫ్రెంచ్ కార్ల(French Cars) తయారీ సంస్థ సిట్రాన్ ఎట్టకేలకు C3 SUV కారును ఇండియన్ మార్కెట్లో(Indian Market) ఆవిష్కరించింది. ఈ కంపెనీ సిట్రాన్ సీ3 ఎస్‌యూవీని (Citroen C3 SUV) జూలై 20న విడుదల చేయనుంది. ఈ వెహికల్ బుకింగ్స్(Vehicle Booking) జూలై 1 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ ధ్రువీకరించింది. అయితే కారు లాంచింగ్‌కు(Launching) ముందే దీని ఫీచర్లు(Features), స్పెసిఫికేషన్ల(Specifications) వివరాలను కంపెనీ వెల్లడించింది. కామన్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్ (CMP) ఆధారంగా నిర్మితమైన సిట్రాన్ C3 SUV యూనిట్లను(Units) తిరువళ్లూరు తయారీ కేంద్రంలో అసెంబుల్(Assemble) చేయనున్నారు. అయితే ఇంజిన్లను(Engine) మాత్రం హోసూర్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనున్నారు. సిట్రాన్ C3 ఎస్‌యూవీ 90% లోకలైజ్డ్ బ్రాండ్(Brand) అని కంపెనీ పేర్కొంది.
Aadhaar Card: పిల్లల స్కూల్ అడ్మిషన్ కోసం ఆధార్ ఇవ్వాల్సిందేనా? రూల్స్ తెలుసుకోండి
డైమెన్షనల్ వివరాలు చూస్తే.. C3 SUVకి 2,540mm వీల్‌బేస్ ఉంటుంది. దీంట్లో ప్రయాణికులకు ఎక్కువ స్పేస్ ఉంటుంది. SUV వెనుక సీట్ల కోసం 653 mm లెగ్‌రూమ్, 991 mm హెడ్‌రూమ్ స్పేస్ కేటాయించారు. సిట్రాన్ C3 ఇంటీరియర్ స్పెసిఫికేషన్లలో 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ముందు, వెనుక సీట్లలోని ప్రయాణీకుల కోసం USB ఛార్జర్‌లు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే వంటి ఎన్నో ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
సిట్రాన్ C3 ఎస్‌యూవీ.. వైబ్ (Vibe), ఎనర్జీ (Energy), ఎలగెన్స్ (Elegance) వంటి మూడు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ వెహికల్స్ రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తాయి. కస్టమర్లు 82 PS పవర్‌ను ఉత్పత్తి చేసే 1.2- లీటర్ నేచురల్- ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ లేదా 110 PS పవర్, 190 Nm టార్క్‌ను విడుదల చేసే 1.2- లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ వేరియంట్‌ను ఎంచుకోవచ్చు. ఈ ఇంజిన్‌లు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తాయి.
C3 SUV కేవలం 10 సెకన్లలోనే సున్నా నుంచి 100 kmph వరకు వేగాన్ని అందుకోగలదని సిట్రాన్ పేర్కొంది. 1.2 లీటర్ నేచురల్- ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ARAI మైలేజ్ 19.8 kmpl కాగా, 1.2- లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ 19.4 kmpl మైలేజ్‌ను అందిస్తుంది. సిట్రాన్ C3 SUV ఆరు కలర్ స్కీమ్‌లలో లభిస్తుంది. కస్టమర్లు పోలార్ వైట్, స్టీల్ గ్రే, జెస్టీ ఆరెంజ్, ప్లాటినం గ్రే, జెస్టీ ఆరెంజ్ విత్ బ్లాక్ రూఫ్, పోలార్ వైట్ విత్ జెస్టీ ఆరెంజ్ రూఫ్.. వంటి కలర్ వేరియంట్స్‌ను ఎంచుకోవచ్చు. ఈ కారు ధర రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా. మార్కెట్లోకి లాంచ్ అయిన తర్వాత ఈ కారు హ్యుందాయ్ i20, మారుతి సుజుకి బాలెనో, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్‌లతో పోటీ పడనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: New cars, New feature, SUV