Fixed Deposits | ప్రైవేట్ రంగానికి ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన సిటీ బ్యాంక్ ఇండియా తాజాగా కీలక ప్రకటన చేసింది. కస్టమర్లకు ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు వెల్లడించింది. రూ.2 కోట్లలోపు డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది. దీంతో బ్యాంక్‌లో (Bank) డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. గతంలో కన్నా ఇకపై కస్టమర్లకు అధిక వడ్డీ రేటు లభిస్తుంది.
సిటీ బ్యాంక్ ఇండియా వెబ్‌సైట్ ప్రకారం చూస్తే.. కొత్త వడ్డీ రేట్లు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. ఇప్పుడు బ్యాంక్ 7 రోజుల నుంచి 1096 రోజుల ఎఫ్‌డీలపై 2.1 శాతం నుంచి 3.5 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. అలాగే బ్యాంక్ గరిష్టంగా 181 రోజుల నుంచి 400 రోజుల ఎఫ్‌డీలపై 7.25 శాతం వరకు వడ్డీని అందిస్తోంది.
ఒక్కసారి చార్జ్ చేస్తే 200 కి.మి. వెళ్లొచ్చు.. అదిరే ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్!
7 రోజుల నుంచి 14 రోజుల ఎఫ్‌డీలపై బ్యాంక్ 2.1 శాతం వడ్డీని అందిస్తోంది. అలాగే 15 నుంచి 35 రోజుల ఎఫ్‌డీలపై 2.15 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. 36 రోజుల నుంచి 180 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 3.5 శాతంగా ఉంది. అలాగే 181 రోజుల నుంచి 400 రోజుల ఎఫ్‌డీలపై అయితే 7.25 శాతం వడ్డీ లభిస్తోంది. 401 రోజుల నుంచి 1096 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 3.5 శాతంగా కొనసాగుతోంది.
రూ.400తో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వెళ్లొచ్చు.. ఎలక్ట్రిక్ బైక్ అదిరింది!
అంతేకాకుండా సిటీ బ్యాంక్ కస్టమర్లకు రికరింగ్ డిపాజిట్ సర్వీసులు కూడా అందిస్తోంది. కనీసం రూ. 1000తో ఆర్‌డీ అకౌంట్ తెరవొచ్చు. అలాగే రూ.20 వేల వరకు మొత్తంతో ఆర్‌డీ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. 12 నెలల నుంచి 24 నెలల వరకు డబ్బులు దాచుకోవచ్చు. బ్యాంక్ సాధారణ కస్టమర్లకు 3.5 శాతం వడ్డీని అందిస్తోంది. ఇంకా సీనియర్ సిటిజన్స్‌కు అయితే 4 శాతం వడ్డీని అందుబాటులో ఉంచింది. ట్యాక్స్ సేవింగ్ ఐదేళ్ల డిపాజిట్లకు ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది.
సిటీ బ్యాంక్ సీనియర్ సిటిజన్స్‌కు గరిష్టంగా 7.75 శాతం వరక వడ్డీని అందిస్తోంది. 181 రోజుల నుంచి 400 రోజుల డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది. ఇకపోతే మీరు సిటీ బ్యాంక్‌లో ఎఫ్‌డీ అకౌంట్ లేదా ఆర్‌డీ అకౌంట్ తెరవాలని భావిస్తే.. ముందుగా సిటీ బ్యాంక్‌లో సేవింగ్స్ ఖాతా కలిగి ఉండాలి. తర్వాతనే ఎఫ్‌డీ సేవలు పొందడం వీలవుతుంది. కొన్ని బ్యాంకులు సేవింగ్స్ ఖాతా లేకపోయినా కూడా ఎఫ్‌డీ సేవలు అందిస్తూ ఉంటాయి. కాగా ఇప్పటికే చాలా బ్యాంకులు ఎఫ్‌డీ రేట్లను పెంచేశాయి. ఎందులో ఎక్కువ వడ్డీ వస్తే.. అక్కడ డబ్బులు దాచుకోవడం బెస్ట్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, Citi bank, FD rates, Fixed deposits, Money, Personal Finance