CITIBANK CONSUMER BUSINESS IN THE HANDS OF AXIS WHAT ABOUT CITI CREDIT AND DEBIT CARD CUSTOMERS GH VB
Citi-Axis Bank Deal: యాక్సిస్ చేతికి సిటీబ్యాంక్ కన్సూమర్ బిజినెస్.. తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..
ప్రతీకాత్మక చిత్రం
భారతదేశంలో సిటీ బ్యాంక్‌కు చెందిన కన్సూమర్ బిజినెస్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది యాక్సిస్ బ్యాంక్ (Axis Bank). ఈ వివరాలను బుధవారం వెల్లడించింది.
భారతదేశంలో సిటీ బ్యాంక్‌కు చెందిన కన్సూమర్ బిజినెస్‌ను(Business) కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది యాక్సిస్ బ్యాంక్ (Axis Bank). ఈ వివరాలను బుధవారం వెల్లడించింది. అమెరికాకు(America) చెందిన సిటీ గ్రూప్(Citi Group).. ఇండియాలోని(India) సిటీబ్యాంక్ కన్సూమర్ బిజినెస్‌ను(Citi Bank Consumer) ప్రైవేట్ బ్యాంక్ యాక్సిక్కు విక్రయిస్తోంది. డీల్ పూర్తయిన తర్వాత తమకు వివిధ విభాగాల్లో కస్టమర్లు పెరుగుతారని, సిటీబ్యాంక్(Citi Bank) నుంచి వచ్చే వినియోగదారులకు అన్నీ సేవలు కొనసాగిస్తామని యాక్సిక్ బ్యాంక్(Axis Bank) చెబుతోంది. దీంతో సిటీ బ్యాంక్‌కు చెందిన రిటైల్ కస్టమర్లు యాక్సిస్ బ్యాంక్‌కు మారనున్నారు. తమ ఇండియన్ కన్సూమర్ బిజినెస్‌ను 1.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ.12,100 కోట్లు)కు ప్రైవేటు బ్యాంకు యాక్సిస్‌కు విక్రయిస్తున్నట్లు సిటీ బ్యాంక్ తెలిపింది. కస్టమర్లకు సేవలు, ఫీచర్లు అలాగే కొనసాగుతాయని యాక్సిస్ బ్యాంక్ పేర్కొంది. ఈ డీల్‌కు సంబంధించి క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులపై కనిపించే ప్రభావం గురించి తెలుసుకోవాల్సిన వివరాలు ఇవే..
క్రెడిట్ కార్డు వినియోగదారులు ఏం చేయాలి?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) విడుదల చేసిన తాజా సమాచారం మేరకు.. భారతదేశంలో ఉన్న మొత్తం సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల సంఖ్య 2.55 మిలియన్లుగా ఉంది. ఈ క్రెడిట్ కార్డుల ద్వారా ఈ నెలలో రూ.3,555 కోట్ల విలువైన ట్రాన్సాక్షన్లు జరిగాయని, అందులో ఏటీఎంల ద్వారా రూ.6.7 కోట్ల విలువైన ట్రాన్సాక్షన్లు ఉన్నాయని పేర్కొంది. సిటీ బ్యాంక్ మొత్తం డెబిట్ కార్డుల సంఖ్య 1.44 మిలియన్లుగా ఉఉందని, సిటీ బ్యాంక్ ఇండియాకు 1.2 మిలియన్ లోన్ అకౌంట్లు కూడా ఉన్నాయని వివరించింది.
బుధవారం యాక్సిస్ బ్యాంక్, బ్యాంకింగ్ ఆపరేషన్స్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ సుబ్రత్ మొహంతి విలేకరులతో మాట్లాడుతూ.. ‘క్రెడిట్ కార్డులు, ఇతర సేవల ప్రస్తుత ప్రయోజనాలు, ఫీచర్లు వినియోగదారులకు అలాగే అందిస్తాం. వాటిని మెరుగుపరిచే అవకాశం కూడా ఉంది.’ అని తెలిపారు. యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ చౌదరి మాట్లాడుతూ..‘సిటీ బ్యాంక్ నుంచి వచ్చే వినియోగదారులకు సేవలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. ఈ డీల్ పూర్తయిన తర్వాత ఎక్కువ ఫీచర్లు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం యాక్సిస్ బ్యాంక్‌కు కలుగుతుంది. రెండు బ్యాంకుల్లో ఖాతాదారులుగా ఉన్న వారి సమాచారం ఓవర్‌ల్యాప్ అయ్యే అవకాశం చాలా తక్కువగానే ఉండే అవకాశం ఉంది. దాన్ని పెద్ద సమస్యగా చూడట్లేదు.’ అని చెప్పారు.
సిటీ బ్యాంక్ కస్టమర్స్, యాక్సిక్ కస్టమర్స్ అవుతారా?
అవును, డీల్ ముగిసిన తర్వాత.. సిటీ బ్యాంక్ కస్టమర్లు యాక్సిస్ బ్యాంక్‌లోకి మారుతారు. వారికి యాక్సిస్ బ్యాంక్ సాంకేతికత, విస్తృత సేవలు అందుబాటులో ఉంటాయని చౌదరి తెలిపారు.
ట్రాన్సాక్షన్ పీరియడ్
ట్రాన్సాక్షన్ పీరియడ్ 9 నుంచి 18 నెలల పాటు ఉంటుంది. అవసరానికి తగినట్లు మరో ఆరు నెలలు పొడిగించుకొనే సదుపాయం ఉంది. సిటీ బ్యాంక్ కస్టమర్లు క్రమంగా యాక్సిస్ బ్యాంక్ ప్లాట్‌ఫారమ్‌కి మారుతారు. ట్రాన్సాక్షన్ పీరియడ్‌ను నిర్వహించేందుకు ఓ బృందం సిద్ధంగా ఉందని, ఇందుకు దాదాపు రూ.1,500 కోట్లు ఖర్చు అవుతుందని, యాక్సిక్ బ్యాంక్ రూ.1,100 నుంచి రూ.1,200 కోట్ల వరకు చెల్లిస్తుందని అమితాబ్ చౌదరి వివరించారు.
కొత్తగా కేవైసీ ఉంటుందా?
అవును. మళ్లీ కేవైసీ చేయాల్సి ఉంటుంది. 18 నెలల్లోపు పూర్తి చేయాలి. విడతల వారీగా ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకొంటామని చెప్పారు.
బ్యాంకు బ్రాంచ్‌ల పరిస్థితి ఏంటి?
సిటీ బ్యాంక్ బ్రాంచ్‌లు అలాగే ఉంటాయి. ఆయా నగరాల్లో ప్రధాన ప్రదేశాల్లోనే ఉన్నాయి కాబట్టి వినియోగదారులకు సేవలు అందించేందుకు కొనసాగిస్తామని యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈవో వివరించారు.
సిటీ- యాక్సిస్ బ్యాంక్ డీల్‌లో ఎన్ని సెగ్మెంట్స్ బదిలీ అవుతాయి?
డీల్‌లో ప్రధాన భాగం క్రెడిట్ కార్డ్‌లు. ఇది కాకుండా పోర్ట్‌ఫోలియో మేనేజింగ్, రిటైల్ కస్టమర్ ఖాతాల విభాగాలు వంటి వ్యక్తిగత సంపద నిర్వహణ సిటీ బ్యాంక్ ఇండియా నుంచి యాక్సిస్ బ్యాంక్‌కి బదిలీ అవుతాయి. ఫైనాన్షియల్ పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్కు సంబంధించిన బిజినెస్ కూడా యాక్సిస్కి వెళ్తుంది. సిటీ గ్రూప్ 1902లో భారతదేశంలోకి ప్రవేశించింది. 1985లో కన్సూమర్ బ్యాంకింగ్ వ్యాపారాన్ని ప్రారంభించింది.
యాక్సిస్ ఒక ప్రకటనలో.. ‘ డీల్ ద్వారా సిటీ బ్యాంక్ ప్రాఫిటబుల్ పోర్ట్‌ఫోలియో, క్వాలిటీ క్రెడిట్ కార్ట్ పోర్ట్‌ఫోలియో, విలువైన కస్టమర్లు, 81 శాతం సరైన డిపాజిట్లు అందుతాయి. కొనుగోలు తర్వాత.. యాక్సిస్ బ్యాంక్‌కు 28.5 మిలియన్ సేవింగ్స్ ఖాతాలు, 2.3 లక్షలకు పైగా బర్గండీ కస్టమర్స్, 10.6 మిలియన్ కార్డుల వినియోగదారులు ఉంటారు’ అని వివరించింది.
ఇతర దేశాల్లో సిటీ బ్యాంక్ పరిస్థితి?
2021 ఏప్రిల్‌లో సింగపూర్, హాంకాంగ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, లండన్‌లోని నాలుగు సంపద కేంద్రాలపై దృష్టి సారించినందున, భారతదేశం సహా 13 దేశాలలో వినియోగదారుల వ్యాపారాల నుంచి నిష్క్రమించాలనే ఉద్దేశంలో సిటీ గ్రూప్ ఉంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.