హోమ్ /వార్తలు /బిజినెస్ /

Citi group: ఆ కంపెనీలో నో వ్యాక్సిన్ - నో జాబ్ విధానం అమలు...జనవరి 14లోగా వ్యాక్సిన్ తీసుకోకపోతే ఉద్యోగం గోవిందా..

Citi group: ఆ కంపెనీలో నో వ్యాక్సిన్ - నో జాబ్ విధానం అమలు...జనవరి 14లోగా వ్యాక్సిన్ తీసుకోకపోతే ఉద్యోగం గోవిందా..

సిటీ గ్రూప్ తమ ఉద్యోగుల కోసం "నో-వ్యాక్సిన్, నో జాబ్" విధానంతో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. జనవరి 14లోగా కంపెనీకి చెందిన ఉద్యోగి ఎవరైనా వ్యాక్సిన్‌ తీసుకోకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామని అల్టిమేటం జారీ చేసింది.

  సిటీ గ్రూప్ తమ ఉద్యోగుల కోసం "నో-వ్యాక్సిన్, నో జాబ్" విధానంతో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. జనవరి 14లోగా కంపెనీకి చెందిన ఉద్యోగి ఎవరైనా వ్యాక్సిన్‌ తీసుకోకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామని అల్టిమేటం జారీ చేసింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి ఇటువంటి విధానాన్ని ప్రకటించిన అమెరికన్ వాల్ స్ట్రీట్‌లోని మొదటి బ్యాంక్ ఇదే కావడం విశేషం. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. అటువంటి పరిస్థితిలో, ఈ కంపెనీలు వ్యాపారాన్ని తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. పలు కంపెనీలు ఉద్యోగులు కార్యాలయానికి రావడం తప్పనిసరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని పలు సంస్థలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ కోవలోనే సిటీ గ్రూప్ కూడా నడుస్తోంది. సిటీ గ్రూప్ లాగే, గూగుల్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ వంటి కంపెనీలు కూడా "నో-వాక్సిన్, నో జాబ్" విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఈ కంపెనీకి చెందిన అమెరికన్ ఉద్యోగులకు కరోనా వ్యాక్సిన్ అవసరమని సిటీ గ్రూప్ అక్టోబర్ 2021లో ప్రకటించింది.

  కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజర్, సారా వెచ్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వంతో పనిచేసే కాంట్రాక్టర్లందరూ తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ పొందాలని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. US ప్రభుత్వం సిటీ బ్యాంక్‌కి అతి పెద్ద క్లయంట్ గా వ్యవహరస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులందరికీ టీకాలు తప్పనిసరి చేస్తూ సిటీ బ్యాంక్ తీర్మానం చేసింది.

  100 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటే టీకా తప్పనిసరి..

  అమెరికాలో ప్రస్తుతం ఒక కంపెనీలో 100 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తే, స్టాఫ్ తప్పనిసరిగా టీకాలు తీసుకోవాలని బైడెన్ ప్రభుత్వం తేల్చచెప్పింది. ఇదిలా ఉంటే అటు రిపబ్లికన్ ఆధిపత్యంలోని రాష్ట్రాలు, అనేక కంపెనీలు బైడెన్ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. దీనిపై శుక్రవారం అమెరికా సుప్రీంకోర్టులో విచారణ కూడా జరిగింది.

  జనవరి 14 నుంచి సిటీ గ్రూప్ ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్టు బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది. ఎవరైనా ఉద్యోగి వ్యాక్సిన్ తీసుకోకుండా దొరికితే, జనవరి 14 నుండి వేతనం లేని సెలవు ప్రారంభమవుతుందని ఉత్తర్వుల్లో  పేర్కొంది. అంతే కాదు అలాంటి వారు ఆలోగా వ్యాక్సిన్ తీసుకోకపోతే వారి చివరి పనిదినం జనవరి 31గా నిర్ణయం తీసుకుంది. నివేదికల ప్రకారం, గ్రూప్‌లోని 90 శాతానికి పైగా ఉద్యోగులు కరోనా టీకాలు తీసుకున్నారు. మిగితా 10 శాతం మంది మతపరమైన కారణాలతో, వైద్యపరమైన కారణాలతో ఇతర కారణాలతో వ్యాక్సిన్ తీసుకోలేదు. ఎవరైన ఒక ఉద్యోగి వ్యాక్సిన్ తీసుకోకపోతే, అలాంటి కేసులను వ్యక్తిగతంగా పరిశీలిస్తామని నివేదిక పేర్కొంది.

  First published:

  Tags: Corona Vaccine

  ఉత్తమ కథలు