• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • CITI BANK TRANSFERS 900 MILLION BY MISTAKE TO WRONG ACCOUNT KNOW HOW TO AVOID THESE MISTAKES SS GH

Explainer: సిటీ బ్యాంక్ చేసిన తప్పిదం మీరు చేయకండి... ఈ టిప్స్ ఫాలో అవండి

Explainer: సిటీ బ్యాంక్ చేసిన తప్పిదం మీరు చేయకండి... ఈ టిప్స్ ఫాలో అవండి

Explainer: సిటీ బ్యాంక్ చేసిన తప్పిదం మీరు చేయకండి... ఈ టిప్స్ ఫాలో అవండి (ప్రతీకాత్మక చిత్రం)

మీరు చెల్లించాల్సిన వ్యక్తి బ్యాంక్ నంబర్ లో ఉన్న ఒక అంకెను మీరు తప్పుగా రాశారనుకుందాం. ఆ నంబర్ తో వేరే అకౌంట్ ఉన్నా.. ఆ వ్యక్తి పేరు, మీరు రాసిన పేరు సరిపోలకపోవడం వల్ల డబ్బు ట్రాన్స్ ఫర్ అవ్వదు.

  • Share this:
సాధారణంగా బ్యాంకులు ఒకరి అకౌంట్లో వేయాల్సిన మొత్తాన్ని మరొకరి అకౌంట్లలో వేయడం గురించి మనం వింటుంటాం. కానీ తాజాగా సిటీ బ్యాంక్ చేసిన తప్పిదం మాత్రం చాలా పెద్దదనే చెప్పాలి. దాదాపు 900 మిలియన్ డాలర్లు (6,554 కోట్ల రూపాయలు) తప్పు ఖాతాల్లో వేసి ప్రస్తుతం కోర్టుల చుట్టూ తిరుగుతోంది ఆ బ్యాంక్. రెవ్లాన్ కి ఆ సంస్థ రుణదాతలకు మధ్య వారధిగా ఉంది సిటీ బ్యాంక్. ఆ సంస్థ రుణదాతలకు వడ్డీ చెల్లింపుల కింద రూ. 8 మిలియన్ డాలర్లు (రూ. 58 కోట్లు) చెల్లించాల్సి ఉంది. అయితే అంతే మొత్తాన్ని చెల్లిస్తే ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ 8 మిలియన్ డాలర్లకు బదులు సిటీ బ్యాంక్ 900 మిలియన్ డాలర్లు ట్రాన్స్ ఫర్ చేసేసింది. ఆ తర్వాత జరిగింది తెలుసుకొని నాలుక కరుచుకున్న సిటీబ్యాంక్ తన డబ్బును తిరిగి తనకు ఇప్పించాలంటూ కోర్టుకెక్కింది. ఈ మొత్తంలో ఇంకా 500 మిలియన్ డాలర్లు సిటీ బ్యాంక్ కి తిరిగి రావాల్సి ఉంది.

అయితే తాజాగా అమెరికా కోర్టు సిటీ బ్యాంక్ తమ తప్పు కారణంగా ఈ మొత్తాన్ని చెల్లించడం జరిగింది కాబట్టి వాటిని వెనక్కి తీసుకోవడానికి కుదరదంటూ తీర్పు చెప్పింది. ఈ సందర్భంగా మనందరికీ సాధారణంగా కొన్ని అనుమానాలు వస్తుంటాయి. ఇంత పెద్ద మొత్తం వేరే అకౌంట్లోకి అలా వెళ్లిపోయే అవకాశం ఉందా? అనుకోకుండా మనం కూడా అప్పుడప్పుడూ అకౌంట్ నంబర్ తప్పుగా రాస్తుంటాం. అలాంటప్పుడు వేరే వారి ఖాతాలోకి వెళ్లిపోతే తిరిగి మన డబ్బు మనకు వచ్చే అవకాశం ఉండదా? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు మనకు ఉత్పన్నమవుతుంటాయి. వాటికి సమాధానాలు తెలుసుకుందాం.

Free FASTag: వాహనదారులకు గుడ్ న్యూస్... ఫాస్ట్‌ట్యాగ్ ఉచితంగా పొందండి ఇలా

Explained Gas Cylinder Price Hike: మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర... కారణమిదే

1. మనం వేసే డబ్బు వేరే బెనిఫిషియరీ అకౌంట్లోకి వెళ్లిపోయే అవకాశం ఉందా?


సాధారణంగా అయితే ఇలా జరగదు. డబ్బులు పంపే వ్యక్తి అందించిన వివరాలు బెనిఫిషియరీ బ్యాంక్ తో ట్యాలీ చేసుకున్న తర్వాతే ట్రాన్స్ ఫర్ చేయడం జరుగుతుంది. దీనికి ప్రతి వివరాన్ని జాగ్రత్తగా అందించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అందించిన వివరాల్లో ఏమాత్రం తప్పు ఉన్నా.. లేక ఏది సరిపోలకపోయినా డబ్బు చెల్లింపు జరగదు. ఉదాహరణకు మీరు చెల్లించాల్సిన వ్యక్తి బ్యాంక్ నంబర్ లో ఉన్న ఒక అంకెను మీరు తప్పుగా రాశారనుకుందాం. ఆ నంబర్ తో వేరే అకౌంట్ ఉన్నా.. ఆ వ్యక్తి పేరు, మీరు రాసిన పేరు సరిపోలకపోవడం వల్ల డబ్బు ట్రాన్స్ ఫర్ అవ్వదు. ఇవే కాదు.. IFSC కోడ్, అకౌంట్ నంబర్, పేరు అన్ని సరిపోల్చుకున్న తర్వాతే ట్రాన్స్ ఫర్ జరుగుతుంది. కానీ అతి అరుదుగా మాత్రం డబ్బు వేరే వారి ఖాతాలో జమ అయ్యే అవకాశాలుంటాయి. దీనికి బ్యాంకులు లేదా పంపే వ్యక్తులు ఇద్దరిలో ఏ ఒక్కరిదైనా తప్పిదం ఉండి ఉండవచ్చు.

2. ఒకవేళ తప్పుడు ఖాతాలో డబ్బు జమ అయితే ఏం చేయాలి?


జమ కావాల్సిన ఖాతాలో కాకుండా వేరే ఖాతాలో డబ్బు జమ అయినట్లు తెలుసుకోగానే బ్యాంకులు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ)ని ప్రారంభిస్తాయి. వెంటనే ఆ తప్పుడు ఖాతాకి చెందిన వ్యక్తికి సంబంధిత ట్రాన్సాక్షన్‌కి సంబంధించిన సమాచారం అందిస్తారు. వెంటనే ఆ డబ్బును తిరిగి పంపించే ప్రక్రియను బ్యాంకు ప్రారంభిస్తుంది. ఒక వేళ ఆ వ్యక్తి తన అకౌంట్లో ఉన్న మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు ఇష్టపడకపోతే బ్యాంకులు లీగల్ యాక్షన్ తీసుకుంటాయి. ఇందుకు గాను పోలీసులు, కోర్టుల సాయం తీసుకుంటాయి. ఇలాంటివి సాధారణంగా పెద్దగా జరగవు. ఒకవేళ జరిగితే వెంటనే లీగల్ టీమ్ రంగంలోకి దిగి ఫండ్స్ వెనక్కి తీసుకురావడానికి అవసరమైన చర్యలన్నీ చేపడుతుంది.

Sleep Internship: రోజూ 9 గంటలు... 100 రోజులు నిద్రపోతే రూ.10,00,000 మీ సొంతం... అప్లై చేయండిలా

డబ్బులు లేవా? అయినా Honda Activa 6G ఇంటికి తీసుకెళ్లండి... ఈ ఆఫర్ ఇంకొన్ని రోజులే

3. బ్యాంక్ తప్పిదం కాకపోయినా డబ్బు వెనక్కి వస్తుందా?


ఒక్కోసారి కస్టమర్లే తప్పుడు అకౌంట్ నంబర్లు రాయడం వల్ల తప్పుడు అకౌంట్లలోకి డబ్బు జమ అవుతుంటాయి. ఇలాంటప్పుడు బ్యాంకులు ఏమీ చేయలేవు. ఆ ట్రాన్సాక్షన్ జరిగిన అకౌంట్, ఆ వ్యక్తి వివరాలను మాత్రం అందించగలుగుతుంది. ఆ వివరాలతో కస్టమర్లే ఆ వ్యక్తులకు ఫోన్ చేసి డబ్బులు తిరిగి ట్రాన్స్ ఫర్ చేసేలా వారిని రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అవతలి వ్యక్తి దీనికి ఒప్పుకోకపోతే మీరే నేరుగా లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంకులు ఆ వ్యక్తి అకౌంట్ ఉన్న బ్యాంక్ కి మెయిల్ చేయడం లేదా మేనేజర్ ని కలిసి లిఖిత పూర్వక కంప్లైంట్ ఇవ్వడం చేస్తే ఆ మొత్తాన్ని తిరిగి ట్రాన్స్ ఫర్ చేస్తాయి. అందుకే ఇలాంటివి జరగకుండా ముందుగానే అకౌంట్ నంబర్, IFSC కోడ్ వంటివన్నీ సరి చూసుకోవాలి. అయితే దీనికి సంబంధించి అన్ని బ్యాంకుల నియమాలు ఒకేలా ఉండవు. కొన్ని బ్యాంకులు ఇలా తప్పు వివరాలు ఇచ్చి వేరే వ్యక్తుల ఖాతాలోకి డబ్బు జమ అయిపోయిందని వినియోగదారులు ఫిర్యాదు చేస్తే దాన్ని తీసుకొని సంబంధిత వ్యక్తి ఖాతా ఉన్న బ్యాంకుతో మాట్లాడతాయి. వారి అనుమతితో ఆ వ్యక్తి నుంచి ఆ డబ్బును తిరిగి వెనక్కి వచ్చేలా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తాయి. దీనికి 7 నుంచి 10 రోజుల సమయం పట్టొచ్చు.

అయితే దీనికి ఓ వ్యక్తి అంగీకారం తెలిపి, ఆ మొత్తాన్ని విత్ డ్రా చేయకుండా ఉంటేనే ఇలా తిరిగి వెనక్కి పంపించడం సాధ్యమవుతుంది. దీనికోసం ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే బ్యాంక్ ని సంప్రదించాల్సి ఉంటుంది. పది రోజుల్లోపు బ్యాంకు ఎలాంటి చర్యలు తీసుకోకపోతే బ్యాంకింగ్ అంబుడ్స్ మన్ సాయం కూడా తీసుకోవచ్చు. బ్యాంకులు డబ్బులు పంపేముందు వ్యక్తి పేరు, అకౌంట్ నంబర్, బ్రాంచి కోడ్ వంటివన్నీ పరిగణనలోకి తీసుకుంటాయి. కాబట్టి మీరు ఒక నంబర్ తప్పు రాసినా అక్కడ అకౌంట్ హోల్డర్ పేరు అదే ఉండదు కాబట్టి డబ్బు ట్రాన్స్ ఫర్ అవ్వదు. చాలా అరుదుగా అదే పేరుతో ఇంకో వ్యక్తి ఉంటే ట్రాన్స్ ఫర్ జరిగే అవకాశం ఉంది. అయితే ఇలాంటప్పుడు కూడా బ్యాంక్ సహకారంతో మీ డబ్బును మీరు తిరిగి పొందే అవకాశం ఉంటుంది.

SBI ATM: అలర్ట్... ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు డ్రా చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసా?

Gold Loan: గోల్డ్ లోన్‌కు అప్లై చేస్తున్నారా? ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి

4. ఒకవేళ నా ఖాతాలోకి డబ్బు వస్తే ఏం చేయాలి?


ఒకవేళ మీ అకౌంట్లోకి మీకు తెలియని వారి నుంచి డబ్బు వచ్చిందంటే అది మీ డబ్బు కాదని అర్థం. ఇలాంటప్పుడు ఆ డబ్బుపై మీకు ఎలాంటి హక్కు ఉండదు. ఇలా ప్రమాదవశాత్తూ వచ్చిన మొత్తాన్ని బ్యాంకులు తిరిగి అవతలి వారికి చెల్లిస్తాయి. దానికి వీలుగా ఈ మొత్తాన్ని మీ బ్యాంకులో అలాగే ఉంచాలి. ఒకవేళ వ్యక్తిగత తప్పిదం కాబట్టి ఆ వ్యక్తి మీకు ఫోన్ చేసి మిమ్మల్ని తిరిగి ఆ డబ్బు పంపించమని కోరితే అలా చేయడం కూడా మంచిది.
First published: