CHINESE BILLIONAIRE INCLUDING JACK MA COULD BE BARRED FROM US WITH TRAVEL BAN MK
చైనాకు ఘోర అవమానం... అలీబాబా అధినేత జాక్మా అమెరికా ప్రవేశం నిషేధం...
అలిబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా
చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సిసిపి) సభ్యులందరినీ తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించాలన్న యోచనలో ట్రంప్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రముఖ బిలియనీర్ అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మాతో సహా పలువురు చైనా అగ్ర వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు కూడా దేశంలో ప్రవేశించకుండా నిషేధించే అవకాశముంది.
చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సిసిపి) సభ్యులందరినీ తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో ప్రముఖ బిలియనీర్ అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మాతో సహా చైనా అగ్ర వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. చైనాకు చెందిన 9 కోట్ల మందికి పైగా ప్రజలను ప్రభావితం చేసే ప్రయాణ నిషేధాన్ని అమెరికా విధించవచ్చని ఇంతకు ముందు ఒక నివేదిక తెలిపింది.
చైనాకు చెందిన పలువురు సంపన్న వ్యాపారవేత్తలు, డాలియన్ వాండా గ్రూప్ వ్యవస్థాపకుడు వాంగ్ జియాన్లిన్ మరియు BYD వ్యవస్థాపకుడు వాంగ్ చువాన్ఫు వంటి వారు ఈ నిషేధానికి గురైయ్యే అవకాశముంది. ఎందుకంటే వారంతా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులుగా ఉన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద సినిమా థియేటర్ గొలుసు AMCని వాండా నిర్వహిస్తుండగా, చువాన్ఫు-స్థాపించిన BYD చైనా ప్రముఖ ఇ-కార్ సంస్థ అధినేతగా ఉన్నారు.
"చైనా కు చెందిన బిలియనీర్లు, అలాగే ఇండస్ట్రీయలిస్టుల్లో చాలా వరకూ చైనా కమ్యూనిస్టు పార్టీసభ్యులు" అని హాంకాంగ్ చైనీస్ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ చైనా స్టడీస్ యొక్క అనుబంధ ప్రొఫెసర్ విల్లీ లామ్ పేర్కొన్నారు. గత సంవత్సరం ప్రచురించిన ఒక అధ్యయనంలో సర్వే చేసిన 8,000 మంది పారిశ్రామికవేత్తలలో సగానికి పైగా వారు సిసిపి సభ్యులు అని వెల్లడించారు.
అలాగే, ఈ విధమైన నిషేధం చైనాలోని వ్యాపారాలకు తీవ్రమైన అడ్డంకులను సృష్టించగలదని, ఇటువంటి నిషేధాన్ని అమలు చేస్తే దారుణమని చైనా విదేశాంగ శాఖ గురువారం తెలిపింది. కరోనావైరస్ వ్యాప్తికి చైనా అధ్యక్షుడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిందించినప్పుడు, బీజింగ్, వాషింగ్టన్ మధ్య సంబంధాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి దిగజారాయి.హాంకాంగ్ భద్రతా చట్టం, చైనా టెలికాం దిగ్గజం హువావే ఇష్యూ కూడా అమెరికా, చైనా సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.