Car Production in India: ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలకు, రవాణాకు ఎక్కువగా ఫోర్ వీలర్లనే (Four wheelers) వాడుతున్నారు. వాహనదారుల ఆసక్తులను బట్టి కార్ల తయారీ కంపెనీలు ఎప్పటికప్పుడూ కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 10 కోట్ల కార్లు తయారవుతున్నాయని అంచనా. వివిధ దేశాల అవసరాలకు తగ్గట్లు పెద్ద కంపెనీలు స్థానికంగా తయారీ యూనిట్ల (manufacturing units)ను ఏర్పాటు చేసుకుంటున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కార్ల వాడకం పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో పెద్ద దేశాల్లో, పేరున్న కంపెనీలు ఎన్ని కార్లను తయారుచేస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేసింది బ్రిటన్‌కు చెందిన మనీషేక్ (Moneyshake) అనే పరిశోధన సంస్థ. ప్రతి నిమిషానికి ఎన్ని కార్లు ఉత్పత్తి అవుతున్నాయి? వివిధ కంపెనీల ఆదాయం ఎంత? అనే వివరాలను మనీషేక్ వెల్లడించింది. ప్రపంచంలో 5వ అతిపెద్ద కార్ల తయారీ దేశంగా భారత్ నిలిచినట్లు ఆ సంస్థ తెలిపింది. ఈ జాబితాలో చైనా మొదటి స్థానంలో ఉంది.
* అందనంత ఎత్తులో చైనా:
ఆటోమొబైల్ ఇండస్ట్రీ (Automobile industry) విభాగంలో చైనా ఆధిపత్యం చెలాయిస్తోంది. చైనాలో ప్రతి నిమిషానికి సగటున 48.9 వాహనాలు ఉత్పత్తి అవుతున్నాయి. భారతదేశం ఉత్పత్తి చేసే సంఖ్య కంటే ఇది 10 రెట్లు ఎక్కువ కావడం విశేషం. ఆ దేశం ప్రతి సంవత్సరం 2.57 కోట్ల వాహనాలను తయారుచేస్తోంది. ఆ దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థలైన SAIC, Dongfengలు భారీ స్థాయిలో కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి. అమెరికా, జపాన్, జర్మనీ దేశాలన్నీ కలిపి ఉత్పత్తి చేసే కార్ల సంఖ్యతో పోలిస్తే... చైనాలోనే ఎక్కువ వాహనాలు ఉత్పత్తి అవుతున్నాయి.
* ప్రతి నిమిషానికి ఉత్పత్తి అయ్యే కార్లు:
1. చైనా - 48.9 నిమిషానికి
2. అమెరికా - 20.7 నిమిషానికి
3. జపాన్ - 18.4 నిమిషానికి
4. జర్మనీ - 8.9 నిమిషానికి
5. ఇండియా - 8.6 నిమిషానికి
* ఉత్తత్తిలో మొదటి స్థానంలో టయోటా:
ప్రపంచంలో అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీల ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా మనీషేక్ లెక్కించింది. ప్రపంచవ్యాప్తంగా మంచిపేరున్న టయోటా కంపెనీ నిమిషానికి సగటున 19.9 వాహనాలను తయారు చేస్తూ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. జపాన్‌కు చెందిన ఈ సంస్థ సంవత్సరానికి 1.04 కోట్ల ఫోర్ వీలర్లను తయారుచేస్తోంది. అంటే నెలకు 8,72,000 టయోటా వాహనాలు తయారవుతున్నాయి. ఈ లెక్కన చూస్తే ప్రతి రోజు 28,000, నిమిషానికి 19.9 టయోట వాహనాలు ఉత్పత్తి అవుతున్నాయి.
* ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు ఇవే
1. టయోట (Toyota) - 19.9 నిమిషానికి
2. వోక్స్ వ్యాగన్ (Volkswagen) - 19.8 నిమిషానికి
3. హ్యూందయ్ (Hyundai) - 13.7 నిమిషానికి
4. జనరల్ మోటార్స్ (General Motors) - 13.0 నిమిషానికి
5. ఫోర్డ్ (Ford) - 12.2 నిమిషానికి
* ఆదాయంలోనూ అవే కంపెనీలు
పెద్ద కంపెనీలుగా పేరున్న టయోటా(Toyota), వోక్స్ వ్యాగన్(Volkswagen) కంపెనీలే ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నాయి. ఈ రెండు సంస్థలూ ప్రతి నిమిషానికి 5,00,000 డాలర్లకంటే ఎక్కువ సంపాదిస్తున్నాయని మనీషేక్ వెల్లడించింది.
ఇది కూడా చదవండి:Ghost: రోడ్డుపై నడుస్తూ వెళ్లిన దెయ్యం?.. CCTV ఫుటేజ్ వీడియో వైరల్
* ప్రతి నిమిషానికి కంపెనీలకు వచ్చే ఆదాయం
1. టయోట (Toyota) - రూ.3,92,51,602
2. వోక్స్ వ్యాగన్ (Volkswagen) - రూ. 3,85,09,929
3. డైమ్లర్ (Daimler) - రూ.2,64,75,613
4. ఫోర్డ్ (Ford) - రూ.2,09,76,170
5. హోండా (Honda) - రూ.1,99,26,618
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BUSINESS NEWS, Cars, China, India