HOME »NEWS »BUSINESS »china target alibaba founder jack ma orders enquiry on monopoly behavior report ba

Jack Ma - Alibaba: జాక్ మాకు షాక్ ఇచ్చిన చైనా.. అలీబాబా కంపెనీపై సంచలన నిర్ణయం

Jack Ma - Alibaba: జాక్ మాకు షాక్ ఇచ్చిన చైనా.. అలీబాబా కంపెనీపై సంచలన నిర్ణయం
అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా

అలీబాబా కంపెనీలో ప్రధానంగా మూడు ముఖ్యమైన సైట్లు ఉన్నాయి. అవి Taobao, Tmall, Alibaba.com. ఈ మూడింట్లో కొన్ని లక్షల మంది వ్యాపారాలు చేస్తున్నారు. Ant ఐపీఓను నవంబర్‌లో రద్దు చేశారు. ఆ తర్వాత కంపెనీకి ప్రాబ్లం ప్రారంభమైంది.

  • Share this:
    చైనాలో దిగ్గజ కంపెనీ అలీ బాబా, ఆ సంస్థ అధినేతను ఆ దేశం టార్గెట్ చేసింది. అలీ బాబా కంపెనీ నియంతృత్వ పోకడల మీద విచారణకు ఆదేశించింది. ఈ మేరకు చైనా అధికారికంగా ప్రకటించింది. ‘అత్యంత ముఖ్యమైన సమాచారం అందడంతో చైనా పరిపాలన, మార్కెట్ రెగ్యులేషన్ అధికారులు అలీ బాబా కంపెనీ మీద విచారణ జరుపుతున్నారు. ఎక్స్‌క్లూజివ్ డీలింగ్ అగ్రమెంట్ చేయడం ద్వారా గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.’ అని జిన్‌హువా అనే చైనా అధికారిక న్యూస్ ఏజెన్సీ తెలిపింది. చైనా ప్రకటనతో ఆ సంస్థ షేర్లు కుప్పకూలాయి. అలీబాబా సంస్థతో పాటు ఆ సంస్థకు అనుబంధంగా ఉన్న విభాగాలకు చెందిన షేర్లు విలువ కూడా తగ్గిపోయాయి. స్టార్ మార్కెట్ అనే సంస్థ 2.1 శాతం దిగజారింది. సీఎస్ఐ టీఎంటీ ఇండెక్స్ 1.5 శాతం పడిపోయిందని రాయిటర్స్ వార్తా సంస్థ ప్రకటించింది. హాంగ్ కాంగ్‌లో అలీ బాబా కంపెనీ షేర్లు 9 శాతం పడిపోయాయి.

    ఇవి కూడా చదవండి



    యూకేలో వచ్చిన కొత్త కరోనా వైరస్ లక్షణాలు

    తక్కువ ధరకే సొంతిల్లు కొనుక్కోవడం ఎలా? 3 చిట్కాలు

    ఒకప్పుడు స్కూల్ టీచర్ అయిన జాక్ మా ఆ తర్వాత చైనాలో అత్యంత సంపన్న కుబేరుడిగా ఎదిగారు. ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ వ్యాపారవేత్త అయ్యారు. సంఖ్యా పరంగా చూస్తే అలీబాబా అనేది ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఈ కామర్స్ ప్లాట్ ఫాం. దానికి కోట్లాది మంది యూజర్లు, అలాగే, బిలియన్ల డాలర్ల టర్నోవర్ ఉంది. ప్రముఖ వ్యాపార మేగజీన్ బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం అలీబాబా ఆసియాలోనే అత్యంత విలువైన కార్పొరేషన్.

    ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. 2021 ఏప్రిల్ నుంచి మీ టేక్ హోమ్ జీతం తగ్గబోతోంది..

    TATA Cars offers: డిసెంబర్‌లో టాటా కార్ల బంపర్ ఆఫర్.. డిస్కౌంట్ డబ్బులతో బైక్ కూడా కొనొచ్చు 

    అలీబాబా కంపెనీలో ప్రధానంగా మూడు ముఖ్యమైన సైట్లు ఉన్నాయి. అవి Taobao, Tmall, Alibaba.com. ఈ మూడింట్లో కొన్ని లక్షల మంది వ్యాపారాలు చేస్తున్నారు. Ant ఐపీఓను నవంబర్‌లో రద్దు చేశారు. ఆ తర్వాత కంపెనీకి ప్రాబ్లం ప్రారంభమైంది. ఇప్పుడు విచారణకు ఆదేశించింది. ఆ కంపెనీ గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహించే విధంగా ప్రవర్తిస్తోందనే ఆరోపణల మీద విచారణ జరగనుంది. ఒక కంపెనీ తన ప్లాట్ ఫాం మీద వస్తువులు విక్రయించాలంటే మరే దాంట్లో కూడా దాన్ని విక్రయించకూడదనేలా నిబంధనలు విధిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. తన ప్రత్యర్థి కంపెనీలకు చెక్ పెట్టేందుకు అలీబాబా అనుసరించిన ఈ వ్యూహం చైనాకు ఆగ్రహాన్ని తెప్పించింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:December 24, 2020, 14:57 IST