Home /News /business /

CHINA SAYS IT COMPLAINED TO UN ABOUT ELON MUSKS SPACEX SATELLITES MK

Elon Musk vs China: చైనాతో కాలు దువ్విన ఎలాన్ మస్క్...సై అంటే సై...ఐక్యరాజ్యసమితికి చైనా ఫిర్యాదు.

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

వరుస విజయాలతో వ్యాపార ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ (Elon Musk)ను చైనా టార్గెట్ చేసింది. అంతే కాదు అతడి స్పేస్ ఎక్స్ (SpaceX) ఫ్రోగ్రాంను సైతం నిలిపివేసేందుకు కుట్రలు చేస్తోంది.

    వరుస విజయాలతో వ్యాపార ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ (Elon Musk)ను చైనా టార్గెట్ చేసింది. అంతే కాదు అతడి స్పేస్ ఎక్స్ (SpaceX) ఫ్రోగ్రాంను సైతం నిలిపివేసేందుకు కుట్రలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన కుతంత్రాలను సైతం అమలుచేస్తోంది. తాజాగా స్పేస్ ఎక్స్ (SpaceX) సాటిలైల్స్ ద్వారా స్టార్ లింక్ ప్రాజెక్టును ప్రారంభించిన మస్క్, ప్రపంచ వ్యాప్తంగా అత్యంత చవక ధరలకే శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సర్వీసులను అందించేందుకు సిద్ధం అవుతున్నాడు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మస్క్ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు బీజింగ్ అధికారులు స్కెచ్ సిద్ధం చేశారు. ఇటీవల స్పేస్ ఎక్స్ (SpaceX) లాంచ్ చేసి రెండు ఉపగ్రహాలపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసంది. చైనా విదేశాంగ ప్రతినిధి జావో లిజియన్ తన ప్రెస్ బ్రీఫింగ్ ద్వారా అనేక విషయాలను పంచుకున్నారు. ఇందులో భాగంగా, చైనా ప్రభుత్వం ఈ నెల 3న యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుట్రెస్ కు ఈ విషయమైన ఫిర్యాదు సైతం చేసినట్లు తెలిపింది. అమెరికా రోదసిలో ఇష్టారీతిన వ్యవహరిస్తోందని ఇది ఔటర్ స్పేస్ ట్రీటి నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. జావో లిజియన్ మాట్లాడుతూ స్టార్ లింక్ పేరిట అమెరికా దుష్ట ప్రయత్నాలు చేస్తోందని, ఇతర దేశాలపై గూఢచర్యానికి పాల్పడేందుకే ఈ స్టార్ లింక్ కార్యక్రమం ప్రారంభించినట్లు ఆరోపించింది.

    Tecno Camon 18: టెక్నో కేమన్ 18 సేల్ ప్రారంభం... రూ.1,999 విలువైన ఇయర్‌బడ్స్ ఉచితం

    రోదసిలో అమెరికా బాధ్యతగా వ్యవహరించాలని, అంతేకాదు ఒప్పందాలకు అనుగుణంగా నడుచుకోవాలన కోరింది. ముఖ్యంగా చైనా ఆస్ట్రోనట్ కార్యక్రమానికి విఘాతం కలిగించేలా అమెరికా వ్యవహరిస్తోందని పేర్కొంది. ఇదిలా ఉంటే 2030లో చైనా తన ఆస్ట్రోనట్స్ ను చంద్రుడి మీదకు పంపనుంది. ఇదిలా ఉంటే అమెరికా, చైనా మధ్య మరోసారి రోదసిలో ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీయనుంది. గతంలో సోవియట్ యూనియన్, అమెరికాకు మధ్య గడిచిన ప్రచ్ఛన్న యుద్ధం, రోదసి పోటీ తరహాలోనే, చైనా సైతం కయ్యానికి కాలు దువ్వుతోందని నిపుణులు భావిస్తున్నారు.

    WhatsApp: వాట్సప్ వాడుతున్నారా? 2022 లో రాబోయే 6 ఫీచర్స్ ఇవే

    ఇదిలా ఉంటే స్పేస్ ఎక్స్ (SpaceX)ప్రోగ్రాం పేరిట ఏకంగా 1600 స్టార్ లింక్ సాటిలైట్స్ ను భూమి చుట్టూ ప్రవేశపెట్టేందుకు ఎలాన్ మస్క్ (Elon Musk)ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మిషన్ లో భాగంగా సాటిలైట్స్  చైనాలోని షాంఘైలోని ఓ ఫ్యాక్టరీలోనే తయారు చేయడం కొసమెరుపు.

    స్టార్ లింక్ ప్రోగ్రాం ద్వారా ఎలాన్ మస్క్ (Elon Musk)యావత్ ప్రపంచానికి అత్యంత తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలను అందించేందుకు సిద్ధపడుతున్నాడు. దీనికి సంబంధించిన మిషన్ ను ఇప్పటికే మస్క్ ప్రకటించాడు. అటు భారత్ లోనూ మస్క్ స్టార్ లింక్ సేవలను ప్రారంభించనున్నాడు. ఇప్పటి వరకూ కేబుల్స్, సెల్ ఫోన్ తరంగాల ద్వారా మాత్రమే అందించిన ఇంటర్నెట్ సేవలు, ఈ ప్రాజెక్టు ద్వారా రోదసి లోని సాటిలైట్స్ ద్వారా అతి చవకగా అన్ని దేశాలకు విస్తరించనున్నాయి.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: China, Elon Musk

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు