హోమ్ /వార్తలు /బిజినెస్ /

Crypto Currency: క్రిప్టో కరెన్సీపై చైనా నిషేధం.. ఇకపై క్రిప్టో లావాదేవీలన్నీ చట్ట విరుద్ధమేనని ప్రకటన

Crypto Currency: క్రిప్టో కరెన్సీపై చైనా నిషేధం.. ఇకపై క్రిప్టో లావాదేవీలన్నీ చట్ట విరుద్ధమేనని ప్రకటన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇకపై దేశంలో క్రిప్టో లావాదేవీలు చేయడం అక్రమమని ప్రకటించింది చైనా. బిట్​కాయిన్ సహా అన్ని క్రిప్టో కరెన్సీలకు ఇది వర్తించనుంది. దీంతో ఇప్పటికే ఒడిదొడుకులతో సతమతమవుతున్న క్రిప్టో కపెన్సీకి షాక్ తగిలింది. చాలా క్రిప్టోల విలువ పడిపోయింది. చైనా సెంట్రల్ బ్యాంకు ప్రకటన తర్వాత బిట్​కాయిన్ విలువ 2వేల డాలర్లకు పైగా పడిపోయింది.

ఇంకా చదవండి ...

క్రిప్టో కరెన్సీ మార్కెట్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. చైనా (China)లో క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్ల(లావాదేవీలు)ను ఆ దేశ సెంట్రల్ బ్యాంకు (Central bank) పూర్తిగా నిషేధించింది. ఇకపై దేశంలో క్రిప్టో లావాదేవీ (Crypto transactions)లు చేయడం అక్రమమని ప్రకటించింది. బిట్​కాయిన్ (bitcoin) సహా అన్ని క్రిప్టో కరెన్సీలకు ఇది వర్తించనుంది. దీంతో ఇప్పటికే ఒడిదొడుకులతో సతమతమవుతున్న క్రిప్టో కరెన్సీకి షాక్ తగిలింది. చాలా క్రిప్టోల విలువ పడిపోయింది. చైనా సెంట్రల్ బ్యాంకు ప్రకటన తర్వాత బిట్​కాయిన్ విలువ 2 వేల డాలర్లకు పైగా పడిపోయింది.

సేకరించినా చర్యలు తప్పవు..

“వర్చువల్ కరెన్సీకి సంబంధించిన అన్ని వ్యాపార కార్యకలాపాలు, లావాదేవీలు ఇక నుంచి అక్రమ ఆర్థిక కార్యకలాపాలే. ఒకవేళ దీన్ని ఎవరైనా అతిక్రమిస్తే చట్టప్రకారం క్రిమినల్ (Criminal) దర్యాప్తు ఎదుర్కొంటారు” అని పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (పీబీఓసీ) ఆన్​లైన్ ప్రకటన ద్వారా వెల్లడించింది. క్రిప్టో కరెన్సీ (Cryptocurrency) ట్రేడింగ్, టోకెన్లను అమ్మడం, వర్చువల్ కరెన్సీతో సంబంధమున్న లావాదేవీలు (Transactions) చేయడాన్ని చైనా నిషేధించింది. అలాగే అక్రమంగా నిధులు సేకరించినా చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

వర్చువల్​ కరెన్సీపై వద్దంటూ..

బిట్​కాయిన్​తో పాటు మిగిలిన వర్చువల్ కరెన్సీ (Virtual currency)లు ప్రమాదకరమని చైనా ఇటీవల చెబుతోంది. ఆర్థిక వ్యవస్థలు, ఫైనాన్షియల్ ఆర్డర్​ను క్రిప్టో కరెన్సీలు అనిశ్ఛితికి గురి చేస్తున్నాయని అభిప్రాయపడుతోంది. అలాగే మనీ లాండరింగ్, అక్రమ నిధుల సమీకరణ, మోసాలు, పిరమిడ్ స్కీమ్​లు, నేరాలతో సహా మరిన్ని అక్రమాలు క్రిప్టో (crypto) వల్ల జరుగుతున్నాయని చెప్పింది. ప్రజల ఆస్తులు కూడా క్రిప్టో వల్ల ప్రమాదంలో పడే అవకాశం ఉందని పీబీఓసీ (PBOC) చెప్పింది. ఇప్పుడు మొత్తానికి క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్లను చైనా నిషేధించింది.

క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్​ (Trading)ను 2019లోనే చైనా అధికారికంగా నిషేధించింది (Banned). అయితే విదేశీ మారకం ద్వారా ఆన్​లైన్​లో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ఆ దేశంలో జరిగింది. కాగా బిట్​కాయిన్ లాంటి కరెన్సీల్లో పెట్టుబడులు కొనసాగించడం సురక్షితం కాదని ఈ ఏడాది మేలో ప్రజలను చైనా అధికార వర్గాలు హెచ్చరించాయి. అలాగే క్రిప్టో లావాదేవీల (Transactions) సేవలను ఆపేయాలని జూన్​లో బ్యాంకులు, పేమెంట్ ప్లాట్​ఫామ్​లకు చైనా సెంట్రల్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది. శక్తిమంతమైన కంప్యూటర్లను వినియోగించి కొత్త కాయిన్లను సృష్టించే క్రిప్టో మైనింగ్​ను కూడా బ్యాన్ చేసింది.

అయితే తాజాగా ఇక దేశంలో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు అక్రమమేనని (illegal) చైనా సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది. దేశంలో క్రిప్టో లావాదేవీలన్నింటిపైనా బ్యాన్ ban) విధించింది. బిట్​కాయిన్ సహా మిగిలిన క్రిప్టో కరెన్సీల ట్రాన్సాక్షన్లను చెక్ చేసేందుకు, లెడ్జర్లను షేర్ చేసేందుకు, అలాగే క్రిప్టో మైనింగ్​కు చాలా పెద్ద సంఖ్యలో కంప్యూటర్లు, విద్యుత్ కావాలి. చైనాలో విద్యుత్ చార్జీలు తక్కువ, అలాగే కంప్యూటర్ల హార్డ్​వేర్ కూడా తక్కువ ధరలోనే దొరుకుతుంది. అయితే ఇప్పుడు చైనాలో క్రిప్టో కార్యకలాపాలను బ్యాన్ చేయడం పెద్ద ఎదురుదెబ్బే.

Published by:Prabhakar Vaddi
First published:

Tags: Bitcoin, Business, China, Cryptocurrency

ఉత్తమ కథలు