Aadhaar card: మీ పిల్లలకు ఆధార్ కార్డు తీసుకోండి ఇలా

Child Aadhaar | మీ పిల్లల వయస్సు 15 ఏళ్లు దాటిన తర్వాత కొత్త ఆధార్ కార్డు కోసం అప్లై చేయాల్సి ఉంటుంది.

news18-telugu
Updated: March 19, 2020, 3:14 PM IST
Aadhaar card: మీ పిల్లలకు ఆధార్ కార్డు తీసుకోండి ఇలా
Aadhaar card: మీ పిల్లలకు ఆధార్ కార్డు తీసుకోండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీ పిల్లలకు ఆధార్ కార్డు ఉందా? ఇంకా తీసుకోలేదా? ఈ రోజుల్లో ఆధార్ కార్డ్ ప్రతీ చోట అవసరం అవుతోంది. బ్యాంకు అకౌంట్ దగ్గర్నుంచి ప్రభుత్వ స్కీమ్‌ల వరకు చాలా చోట్ల ఆధార్ అవసరం. పెద్దలకే కాదు... పిల్లలు కూడా ఆధార్ కార్డు తీసుకోవాల్సిందే. అందుకే పిల్లలకు కూడా ఆధార్ కార్డు తీసుకోవాలి. పిల్లలకు తల్లిదండ్రులు ఆధార్ కార్డు తీసుకునేలా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI సేవలు అందిస్తోంది. అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా తల్లిదండ్రులు ఆధార్ కార్డు తీసుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.

మీ పిల్లల వయస్సు ఐదేళ్ల లోపు అయితే తల్లిదండ్రులు ఇద్దరూ పిల్లల్ని తీసుకొని ఆధార్ కేంద్రానికి వెళ్లాలి. తల్లి లేదా తండ్రి తమ ఆధార్ కార్డును చూపించాలి. ఎన్‌రోల్‌మెంట్ ఫామ్ పూర్తి చేసి, పిల్లల బర్త్ సర్టిఫికెట్, తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డ్ కాపీ ఇవ్వాల్సి ఉంటుంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ని వెరిఫికేషన్ కోసం తీసుకెళ్లాలి. పిల్లల ఫోటో మాత్రమే చాలు. బయోమెట్రిక్స్ తీసుకోరు. మీ పిల్లల వయస్సు 5 ఏళ్లు దాటిన తర్వాత 15 ఏళ్ల లోపు ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ స్కాన్, ఫేషియల్ స్కాన్ చేయించాలి.

మీ పిల్లల వయస్సు 5 నుంచి 15 ఏళ్ల మధ్య ఉంటే ఎన్‌రోల్‌మెంట్ ఫామ్‌తో పాటు స్కూల్ ఐడీ కార్డు, బోనఫైడ్ సర్టిఫికెట్ కాపీ జత చేయాలి. అడ్రస్ ప్రూఫ్, బర్త్ సర్టిఫికెట్ కూడా ఉండాలి. పిల్లలకు స్కూల్ ఐడీ కార్డు లేకపోతే తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డు కాపీ జత చేయాలి. ఇక మీ పిల్లల వయస్సు 15 ఏళ్లు దాటిన తర్వాత కొత్త ఆధార్ కార్డు కోసం అప్లై చేయాల్సి ఉంటుంది. పిల్లలకు ఆధార్ కార్డు విషయంలో యూఐడీఏఐ కొన్ని సేవల్ని ఉచితంగా అందిస్తోంది. వాటి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కుడా చదవండి:

Pan Card: పాన్ కార్డ్ కావాలా? 10 నిమిషాల్లో ఫ్రీగా తీసుకోండి ఇలా

Arogya Sanjeevani: సామాన్యుల కోసం సరికొత్త హెల్త్ ఇన్స్యూరెన్స్... ఏప్రిల్ 1న ప్రారంభం

Credit Card: క్రెడిట్ కార్డుపై మీరు కట్టే వడ్డీ ఎంతో తెలిస్తే షాకే
Published by: Santhosh Kumar S
First published: March 19, 2020, 3:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading