ఆకాశాన్ని తాకుతున్న చికెన్ ధర...కిలో కోడి మాంసం రూ.220 పై మాటే...

ధరల ప్రభావం వల్ల చాలామంది అటు రైతులు సైతం కోళ్ల పెంపకం నుంచి తప్పుకున్నారు. చికెన్ ధరలు పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా భావిస్తున్నారు.

Krishna Adithya | news18-telugu
Updated: November 26, 2019, 5:51 PM IST
ఆకాశాన్ని తాకుతున్న చికెన్ ధర...కిలో కోడి మాంసం రూ.220 పై మాటే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్‌లో కిలో చికెన్ ధర ప్రస్తుతం రూ.220 పలుకుతున్నది. అంతేకాదు కొన్ని ప్రాంతా ల్లో ఇంతకంటే ఎక్కువ ధర కూడా పలుకుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై పౌల్ట్రీ సంఘాలు మాత్రం ధరల పెరుగుదలకు కోళ్ల దాణాయే కారణమని చెబుతున్నారు. మొక్క జొన్న పిండి ధర రెండింతలు, సోయాబిన్, నూక లు, తౌడు ధరలు కూడా దాదాపు రెండింతలు పెరిగాయని. ఈ ప్రభావం చికెన్ ధరలపై పడిందని ఆరోపిస్తున్నాయ. అయితే పెరిగిన దాణా ధరల కారణంగా ఒక్కో కోడికి అయ్యే దాణా ఖర్చు దాదాపు రెండింతలు అవుతున్నది. అంతేకాదు, ధరల ప్రభావం వల్ల చాలామంది అటు రైతులు సైతం కోళ్ల పెంపకం నుంచి తప్పుకున్నారు. చికెన్ ధరలు పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా భావిస్తున్నారు. దీంతో కోళ్లఫారాల్లో పెంపకం కూడా తగ్గిపోవడంతో చికెన్ రేటుకు మరింత రెక్కలొచ్చాయి. ఆదివారాల్లో పక్క రాష్ట్రాల నుంచి కూడా కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారని పరిశ్రమ వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి.

First published: November 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు