• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • CHICKEN PRICES IN ANDHRA PRADESH TOUCH RECORD HIGH COMMON PEOPLE AFRAID OF PRICES NGS

Andhra Pradesh: ఏపీలో కోడికూర ఇకపై కోటీశ్వరులే తినాలా? బహిరంగ మార్కెట్లో కొండెక్కిన చికెన్

Andhra Pradesh: ఏపీలో కోడికూర ఇకపై కోటీశ్వరులే తినాలా? బహిరంగ మార్కెట్లో కొండెక్కిన చికెన్

ఏపీలో కొండెక్కిన కోడి

ఏపీలో చికెన్ ధరలు షాకిస్తున్నాయి. మొన్నటి వరకు డిమాండ్ లేక విలవిలలాడిన కోడి.. ఇప్పుడు కొండెక్కి కూర్చుంది. కిలో చికెన్ కొనాలి అంటేనే సామాన్యులు భయపడే పరిస్థితి నెలకొంది. ఇకపై కోడి కూర కోటీశ్వరులే తినాలి అంటూ పెదవి విరుస్తున్నారు.

  • Share this:
    బాబోయ్ కోడి కొండెక్కి కూర్చుంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కోడికి అమాంతం డిమాండ్ పెరుగుతోంది. మొన్నటి వరకు బర్డ్ ఫ్లూ భయంతో కోళ్ల బిజినెస్ దివాళా తీసింది. ఇప్పుడు మళ్లీ పౌల్ట్రీ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. అందుకు తగ్గట్టు మార్కెట్ లో సరిపడ కోళ్ల సప్లయ్ లేకపోవడంతో చికెన్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అందుకే ప్రస్తుతం ఏపీలో ధరలు చూస్తుంటే.. ఇకపై కోడీ కూర  సంగతి సామాన్య ప్రజలు మరిచిపోవాల్సి వస్తుందేమో.. ఇదే పరిస్థితి కొనసాగితే కోటీశ్వరులు తినే కూరగా మారనుందా? ప్రస్తుతం పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తోంది. ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులను ఈ పెరిగిన ధరలు భయపెడుతున్నాయి.

    ఒకవైపు పౌల్ట్రీ మార్కెట్‌, ఇప్పుడు కళకళలాడుతోంది. అయితే ఏపీ వ్యాప్తంగా డిమాండ్‌కు తగినంత సప్లయ్‌ లేకపోవడంతో ధరలు అమాంతం రెట్టింపు అవుతున్నాయి. గత వారం నుంచి రేట్లు పైపైకి వెళ్తున్నాయి. దీనికి వేసవి కాలం తోడవ్వడంతో చికెన్ ధరలకు ఊహించని రెక్కలు వచ్చాయి. ప్రస్తుతం విజయవాడ, విశాఖపట్నంలాంటి నగరాల్లో బహిరంగ మార్కెట్‌లో చికెన్‌ ధర కేజీ 310 రూపాయలకు పైగానే పలుకుతోంది. బర్డ్‌ ఫ్లూ కారణంగా కోళ్ల పెంపకం భారీగా తగ్గిందని, ఇప్పుడు డిమాండ్‌ పెరగడంతో సప్లయ్‌ లేక చికెన్‌ ధరలు పెరుగుతున్నాయని వ్యాపారస్తులు అభిప్రాయ పడుతున్నారు.

    ఒక్కసారిగా చికెన్‌ ధర 300ల రూపాయలు దాటడంతో చికెన్‌ ప్రియులు షాక్ కు గురవుతున్నారు. ఇప్పుడు కోడి కూర లొట్టలేసుకుని తినడం ఎలా అని తీవ్రంగా మదన పడుతున్నారు. ఒకప్పుడు కేజీ కొనుగోలు చేసేవారు ఇప్పుడు.. అరకేజీ, పావుకేజీతో తప్పక సరిపెట్టుకోవాల్సి వస్తోంది. మరోవైపు త్వరలోనే పెళ్లిళ్ల సీజన్ మొదలవుతోంది. దీంతో అటు నాన్‌వెజ్‌ క్యాటరింగ్‌ చేసేవారు ఈ ధరలను చూసి భయపడుతున్నారు. పెళ్లి ముహూర్తాలు ప్రారంభమైతే చికెన్ ఆర్డర్ తీసుకోవడం ఎలా అని సతమతమవుతున్నారు.

    రెండు తెలుగు రాష్ట్రాల్లో వేసవి తీవ్రత పెరగడం ఈ రేటు పెరుగుదలకు కారణమని పౌల్ట్రీ రంగ వ్యాపారులు చెబుతున్నారు. ఏటా ఈ సీజన్‌లో కోళ్ల ఉత్పత్తి తగ్గుతుందని అంటున్నారు. ప్రతిసారీ వేసవిలో చికెన్ ధరలు కచ్చితంగా పెరుగుతుంటాయని.. అయితే ఈ సారి కోళ్ల సప్లై సరిగ్గా లేకపోవడంతో రేట్లు రెట్టింపు అయ్యాయి అంటున్నారు. మరోవైపు చికెన్ దారిలోనే గుడ్ల రేట్లు కూడా పెరిగాయి. నాలుగు నెలల కిందటి వరకు కిలో చికెన్ ధర వంద లోపే ఉండేదని.. ఇప్పుడు పెరిగిన ధరలతో సామాన్యులు నాన్ వెజ్ మాట ఎత్తితేనే మండిపడే పరిస్థితి నెలకొంది.
    Published by:Nagesh Paina
    First published: