• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • CHICKEN PRICES HIGH DUE TO LOCKDOWN EFFECT SUPPLY WAS VERY LOW MK

చికెన్ ధర రూ. 300 దాటేసింది...కరోనా దెబ్బతో కోళ్ల కరువుతో...మోగుతున్న ధరల దరువు...

చికెన్ ధర రూ. 300 దాటేసింది...కరోనా దెబ్బతో కోళ్ల కరువుతో...మోగుతున్న ధరల దరువు...

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం లాక్ డౌన్ నుంచి పౌల్ట్రీ పరిశ్రమ నెమ్మదిగా కోలుకుంటోంది. అయితే ఉత్పత్తి భారీగా పడిపోవడంతో, తెలుగు రాష్ట్రాల్లో కిలో చికెన్‌ ధర ఎన్నడూ లేనంత ఎక్కువగా పెరిగి రూ. 300 పలికింది.

  • Share this:
    కరోనా దెబ్బ పౌల్ట్రీ పరిశ్రమపై భారీగా తగిలింది. దీంతో ఒక దశలో కోళ్లను ఎంత వస్తే అంతకు తెగనమ్ముకున్నారు వ్యాపారస్తులు. కొన్ని చోట్ల ధర లేక, డిమాండ్ పతనమై కోళ్లను పాతి పెట్టేశారు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ నుంచి పౌల్ట్రీ పరిశ్రమ నెమ్మదిగా కోలుకుంటోంది. అయితే ఉత్పత్తి భారీగా పడిపోవడంతో, తెలుగు రాష్ట్రాల్లో కిలో చికెన్‌ ధర ఎన్నడూ లేనంత ఎక్కువగా పెరిగి రూ. 300 పలికింది. నిన్నమొన్నటి వరకు కిలో చికెన్‌ ధర రూ. 230వరకు విక్రయాలు జరిగగా, ప్రస్తుతం చికెన్‌ ధర రూ. 300 కి చేరింది. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ధరలతో చికెన్‌ను విక్రయిస్తున్నారు. దేశంలోనే ఇప్పటి వరకు ఎక్కడ విక్రయించని విధంగా ఏపీలో పలు ప్రాంతాల్లో కిలో చికెన్‌ ధర రూ. 310 పలికి ఆల్‌టైం రికార్డ్‌ సృష్టించింది. ఇప్పటిక వరకూ రూ. 260 కిలో చికెన్‌ ధర దేశంలో ఆల్‌టైం రికార్డు. కానీ ప్రస్తుతం రూ. 310 పలకడంతో ఇప్పడు ఇదే ఆల్‌టైం రికార్డుగా మారింది. కరోనా ప్రభావం వల్ల పౌల్ట్రి రైతులు ఆర్థికంగా నష్టపోయారు. ప్రస్తుతం చికెన్‌ కొనుగోళ్లు పెరిగినప్పటికీ ఆ స్థాయిలో కోళ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో ఉన్న కోళ్లకు డిమాండ్‌ పెరగడంతో చికెన్‌ ధరలు అమాంతం కొండెక్కాయి. పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేద్దామన్నా లాక్‌డౌన్‌ ఉండటంతో కిలో చికెన్‌ ధర రూ. 310 పెరగింది.

    పలు ప్రాంతాల్లో చికెన్‌ను ఉచితంగా కూడా పంపిణీ చేసిన సందర్భాలు ఉన్నాయి. కరోనా మహమ్మారి భారత్‌లో వ్యాపిస్తున్న తొలిరోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ కరోనా వ్యాప్తి పెరిగింది. దీంతో చికెన్‌ తింటే కూడా కరోనా వ్యాపిస్తుందనే వదంతులు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా చికెన్‌ ధరలు భారీగా పడిపోయాయి. పలు ప్రాంతాల్లో పౌల్ట్రి యాజమానులు కోళ్లను ఉచితంగా కూడా పంపిణీ చేశారు. చికెన్‌ తినడం వల్ల కరోనా వైరస్‌ సోకదని ప్రభుత్వాలు చెప్పడంతో మళ్లి చికెన్‌ ధరలు పెరగడం మొదలు పెట్టాయి.
    Published by:Krishna Adithya
    First published: