Home /News /business /

CHHATTISGARH YOUTH EARNED RS 4 LAKH BY SELLING COW DUNG IMPRESSED FATHER GOT DAUGHTER MARRIED GODHAN NYAY YOJANA SK

Cow Dung: ఆవు పేడను అమ్మి రూ. 4లక్షలు సంపాదించిన యువకుడు.. ఆ తర్వాతే పెళ్లయింది..

cow dung business, cow dung news, godhan nyay yojana, chhattisgarh cow dung scheme, chhattisgarh latest news, ఆవు పేడను అమ్మి 4 లక్షలు సంపాదించిన యువకుడు, ఛత్తీస్‌గఢ్ ఆవుపేడ వ్యాపారం, ఛత్తీస్‌గఢ్ గోధన్ న్యాయ్ యోజన

cow dung business, cow dung news, godhan nyay yojana, chhattisgarh cow dung scheme, chhattisgarh latest news, ఆవు పేడను అమ్మి 4 లక్షలు సంపాదించిన యువకుడు, ఛత్తీస్‌గఢ్ ఆవుపేడ వ్యాపారం, ఛత్తీస్‌గఢ్ గోధన్ న్యాయ్ యోజన

Cow dung Business: ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఎప్పుడైతే గోధన్ న్యాయ్ యోజన పథకం తీసుకొచ్చిందో అప్పటి నుంచి శ్యామ్ జీవితం మారిపోయింది. పాల వ్యాపారాన్ని పక్కనబెట్టి.. ఆవుపేడను విక్రయించడం మొదలు పెట్టారు. అలా ఇప్పటి వరకు 4 లక్షల 10 వేల రూపాయల ఆదాయం పొందాడు.

ఇంకా చదవండి ...
    సాధారణంగా పల్లెల్లో పశువులు ఎక్కువగా కనిపిస్తాయి. వ్యవసాయంలో కీలక పాత్ర పోషించేది పశువులే కాబట్టి.. చాలా మంది రైతులు ఎద్దులను పెంచుకుంటారు. మరికొందరు పాల కోసం.. గేదెలు, ఆవులను పెంచుకుంటారు. వాటి నుంచి వచ్చే పేడను కూడా రైతులు వ్యవసాయానికే వినియోగించుకుంటారు. పశువుల పేడతో తయారయ్యే ఎరువును పొలాల్లో చల్లితే.. పంట దిగుబడి పెరుగుతుంది. ఐనా పల్లెల్లో చాలా చోట్ల వృథాగా పేడ కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఛత్తీస్‌గఢ్ (Chhattisharh) ప్రభుత్వం అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. గోధన్ న్యాయ్ యోజన  (Godhan nyay yojana) పేరుతో గ్రామీణ ప్రజల నుంచి పేడను కొనుగోలు చేసే పథకాన్ని తెచ్చింది. ఇప్పుడు ఈ పథకంతో ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. పేడను విక్రయించి (Cow Dung Business) బాగా డబ్బులు సంపాదిస్తున్నారు.



    కొరియా జిల్లా మనేంద్రగఢ్ ప్రాంతానికి చెందిన శ్యామ్ కుమార్ ఆవుపేడ వ్యాపారం చేసి సక్సెస్ అయ్యాడు. మొదల్లో ఆయన పాల డెయిరీ వ్యాపారం చేసేవారు. కానీ పాల ద్వారా తక్కువ ఆదాయం వచ్చేది. ఐతే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఎప్పుడైతే గోధన్ న్యాయ్ యోజన పథకం తీసుకొచ్చిందో అప్పటి నుంచి శ్యామ్ జీవితం మారిపోయింది. పాల వ్యాపారాన్ని పక్కనబెట్టి.. ఆవుపేడను విక్రయించడం మొదలు పెట్టారు. అలా ఇప్పటి వరకు 4 లక్షల 10 వేల రూపాయల ఆదాయం పొందాడు. ఈ మధ్యే శ్యామ్ కుమార్‌కి వివాహం జరిగింది. గత ఏడాది వరకు ఆదాయం లేక చాలా ఇబ్బందులు పడ్డానని.. పిల్లనిచ్చేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదని శ్యామ్ కుమార్ తెలిపారు. ఆవు పేడతో భారీగా సంపాదిస్తున్నని తెలిసి తర్వాత.. పెళ్లి సంబంధాలు వచ్చాయని చెప్పాడు. అలా అంజు అనే యువతిని అతడు పెళ్లి చేసుకున్నాడు. ఆమె స్థానికంగా ఓ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తుంది. ఆవు పేడతో అద్భుతంగా వ్యాపారం చేస్తున్నాడని తెలిసి.. అంజు తండ్రి ఫిదా అయ్యాడు. ఈ క్రమంలోనే తన కూతురినిచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి చక్కగా పనిచేసుకుంటున్నారు.



    మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం కింద ఇటీవల ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ ప్రజలను కలుస్తున్నారు. ఇందులోభాగంగా ఆయన బుధవారం సుర్గుజా డివిజన్‌లోని కొరియా జిల్లాలో పర్యటించారు. సీఎం భూపేష్ బాఘేల్‌ను శ్యామ్ కుమార్, అంజు జంట కలిసింది. ఈ సందర్భంగా తన పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాన్ని సీఎంతో పంచుకున్నాడు. గోధన్ న్యాయ్ యోజన పథకం తర్వాత తన జీవితం మారిపోయిందని ముఖ్యమంత్రికి చెప్పి.. సంతోషం వ్యక్తం చేశారు. ఈ పథకానికి ముందుకు తాను ఎన్నో కష్టాలు పడ్డానని.. పెళ్లి చేసుకునేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదని చెప్పారు. ఆవు పేడ విక్రయాల తర్వాతే.. ఆర్థికంగా నిలదొక్కుకున్నానని తెలిపారు. శ్యామ్ కుమార్, అంజు దంపతుల స్టోరీ విని.. సీఎం కూడా వారిని అభినందించారు. మీలాంటి వారు యువతకు ఆదర్శమని ప్రశంసించారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Business, Chhattisgarh, Cow, Cow Dung

    తదుపరి వార్తలు