ఆధార్ కార్డ్... ఒకప్పుడు ఈ కార్డు ఉండటం ఆప్షనల్. కానీ ఇప్పుడు ఆధార్ తప్పనిసరి అయిపోతోంది. ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్‌లా మాత్రమే కాదు పీఎం కిసాన్ స్కీమ్ (PM Kisan Scheme) లాంటి ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందాలన్నా ఆధార్ తప్పనిసరి. కాబట్టి పౌరుల దగ్గర ఆధార్ కార్డ్ (Aadhaar Card) ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారింది. ఆధార్ కార్డుతో అవసరాలు పెరిగిపోతుండటంతో, ఆధార్ కార్డ్ చుట్టూ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇతరుల ఆధార్ కార్డ్ వివరాలను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు. మోసాలు మాత్రమే కాదు, విద్రోహ చర్యలకు కూడా పాల్పడుతున్న ఘటనలు బయటపడుతున్నాయి. మంగళూరులో జరిగిన పేలుడులో ప్రధాన సూత్రధారి ఓ రైల్వే ఉద్యోగి ఆధార్ కార్డును ఉపయోగించి ఇల్లు అద్దెకు తీసుకున్నట్టు విచారణలో తేలింది.
కాబట్టి ఆధార్ కార్డ్ హోల్డర్లు తమ ఆధార్ వివరాలు సురక్షితంగా ఉన్నాయా లేదా అని గమనిస్తూ ఉండాలి. ఆధార్ దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కొన్ని ఫీచర్స్ అందిస్తుంది. ఆధార్ కార్డ్ హోల్డర్లు ఆధార్ ఆథెంటికేషన్ హిస్టరీని సులువుగా తెలుసుకోవచ్చు. అంటే తమ ఆధార్ కార్డును ఎక్కడ ఉపయోగించారో తెలుసుకోవచ్చు.
Aadhaar Update: ఆధార్ అప్డేట్ తప్పనిసరా? చేయకపోతే ఏమవుతుంది?
ఉదాహరణకు మీరు రేషన్ షాపులో సరుకులు తీసుకోవడానికి వెళ్తే, ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ చెప్తారు. లేదా మీరు బయోమెట్రిక్ ద్వారా సరుకులు తీసుకున్నా మీ ఆధార్ వివరాలను స్వీకరించిన తర్వాతే సరుకులు ఇస్తారు. ఇలా మీ ఆధార్ నెంబర్ ఎక్కడ ఉపయోగించినా ఆ వివరాలు ఆథెంటికేషన్ హిస్టరీలో ఉంటాయి. మీరు సింపుల్ స్టెప్స్‌తో ఆధార్ ఆథెంటికేషన్ హిస్టరీ తెలుసుకోవచ్చు. ఈ స్టెప్స్ ఫాలో అవండి.
Step 1- ముందుగా https://uidai.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- హోమ్ పేజీలో Aadhaar Services పైన క్లిక్ చేయాలి.
Step 3- ఆ తర్వాత Aadhaar Authentication History పైన క్లిక్ చేయాలి.
Step 4- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ నెంబర్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి Sent OTP పైన క్లిక్ చేయాలి.
Step 5- మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి.
Step 6- ఆ తర్వాత ఆథెంటికేషన్ టైప్ సెలెక్ట్ చేయాలి.
Step 7- మీకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆధార్ ఆథెంటికేషన్ డీటెయిల్స్ కావాలో తేదీలు వెల్లడించాలి.
Step 8- ఆధార్ ఆథెంటికేషన్ హిస్టరీ స్క్రీన్ పైన కనిపిస్తుంది. డౌన్లోడ్ చేయాలి.
Gold Holding Limit: ఇంట్లో ఉన్న నగలకు లెక్కలు చెప్పాలా? రూల్స్ తెలుసుకోండి
మీరు డౌన్లోడ్ చేసిన డాక్యుమెంట్ ఓపెన్ చేయాలంటే పాస్వర్డ్ కావాలి. మీ పేరులోని మొదటి 4 అక్షరాలు, పుట్టిన సంవత్సరం కలిపి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఉదాహరణకు ఓ వ్యక్తి పేరు Rajesh అనుకుందాం. అతను 1986 సంవత్సరంలో పుట్టాడనుకుందాం. అప్పుడు RAJE1986 అని పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. డాక్యుమెంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆధార్ ఆథెంటికేషన్ హిస్టరీలో వివరాలన్నీ చెక్ చేయాలి. మీకు తెలియకుండా మీ ఆధార్ వివరాలు వాడినట్టు కనిపిస్తే 1947 నెంబర్‌కు కాల్ చేసి లేదా help@uidai.gov.in ఇమెయిల్ ఐడీకి మెయిల్ పంపి కంప్లైంట్ చేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aadhaar Card, AADHAR, UIDAI