Home /News /business /

CHECK THE NEW CARS AND PRICES RELEASING BY MAY 2021 IN INDIA BA GH

New cars: త్వరలో మార్కెట్లోకి విడుదల కానున్న ఐదు కొత్త కార్లు... వాటి ధరలు

HyundaiALCAZAR

HyundaiALCAZAR

కరోనా తరువాత ఆటోమొబైల్ ఇండస్ట్రీ మంచి పనితీరు కనబరుస్తోంది. గతేడాది మహమ్మారి కారణంగా చాలా వరకు కార్ల తయారీ సంస్థలు మూసివేయాల్సి వచ్చింది.

కరోనా తరువాత ఆటోమొబైల్ ఇండస్ట్రీ మంచి పనితీరు కనబరుస్తోంది. గతేడాది మహమ్మారి కారణంగా చాలా వరకు కార్ల తయారీ సంస్థలు మూసివేయాల్సి వచ్చింది. లాక్‌డౌన్ వల్ల కొనుగోళ్లు కూడా తగ్గడంతో కంపెనీలు నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ అక్టోబర్, నవంబర్ తరువాత వాహనాల కొనుగోళ్లు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. గత సంవత్సరం లాక్‌డౌన్ తరువాత చాలా కొత్త మోడళ్లు మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఈ సంవత్సరం కూడా కొన్ని కంపెనీలు కొత్త వాహనాలను విడుదల చేశాయి. రానున్న రోజుల్లో మరికొన్ని కొత్త వేరియంట్లు మార్కెట్లో సందడి చేయనున్నాయి. ఈ వేసవి ముగియడానికి ముందే కొన్ని ప్రత్యేకమైన మోడళ్లను కొనుగోలుకు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. వీటిల్లో టాప్-5 కార్ల జాబితాను పరిశీలిద్దాం.

టాటా హార్న్‌బిల్ 
టాటా మోటార్స్ 2020 ఆటో ఎక్స్ పోలో HBX పేరుతో ఒక మైక్రో SUVవి ఆవిష్కరించింది. దీన్ని హార్న్ బిల్ పేరుతో త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది. ఈ మోడల్‌ భారతదేశంలో అత్యంత తక్కువ ధర ఉండే టాటా SUVగా గుర్తింపు సాధించనుంది. SUV పోర్ట్ ఫోలియోలో నెక్సన్ తరువాత ఈ మోడల్‌ ఉండే అవకాశం ఉంది. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సెమీ డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, LED DRL స్ప్లిట్ హెడ్ ల్యాంపులు, హర్మాన్ సోర్స్‌డ్ ఆడియో సిస్టమ్.. వంటి ఫీచర్లతో హార్న్‌బిల్‌ను టాటా తీర్చిదిద్దుతోంది.

Tata Horn bill (Image Tata Motors)


హ్యుందాయ్ అల్కాజార్
క్రెటాలో త్రీ-రో వెర్షన్‌గా అల్కాజార్‌ కారును హ్యుందాయ్ తయారు చేస్తోంది. ఈ కారు MG హెక్టార్ ప్లస్, టాటా సఫారీ, నెక్ట్స్‌ జెనరేషన్ మహీంద్రా XUV 500 మోడళ్లతో పోటీ పడనుంది. ఈ మోడల్‌ క్రెటాకు అప్‌డేటెడ్ వెర్షన్‌గా ఉంటుంది. అప్‌డేటెడ్ ఫ్రంట్ గ్రిల్, ఫ్లాటర్ రూఫ్, రీ-డిజైన్డ్ C-పిల్లర్.. వంటివి అల్సాజార్‌లో ఉంటాయి. ఈ కారు 1.5 లీటర్ NA పెట్రోల్, 1.4 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. పాత క్రెటాలో ఐదు సీట్లు మాత్రమే ఉండగా.. అల్కాజార్‌లో అదనంగా మరో వరుస కూడా ఉండనుంది. దీని ధర క్రెటా కంటే రూ. 1- 1.5 లక్షలు ఎక్కువగా ఉండవచ్చు.

HyundaiALCAZAR (Image: Hyundai Motors)


సిట్రోన్ సీ5 ఎయిర్‌క్రాస్
సిట్రోన్ సంస్థ భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ ఫ్రెంచ్ కంపెనీ C5 ఎయిర్ క్రాస్ వాహనాన్ని త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ మిడ్ సైజ్ SUV కోసం వాహన ప్రియులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. జీప్ కంపాస్, హ్యుందాయ్ టక్సన్ వంటి మోడళ్లకు ఈ కారు పోటీ ఇవ్వనుంది. దీంట్లో శక్తిమంతమైన 2.0 లీటర్ 4 సిలిండర్ డీజల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 177 PS శక్తిని, 400 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. దీని ధరను సంస్థ అధికారికంగా ప్రకటించలేదు. C5 ఎయిర్‌క్రాస్ ధర రూ.30 లక్షల వరకు ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Citroen C5 Aircross (Image: Citroen )


మారుతి సుజుకి సెలెరియో
మారుతి సుజుకి సంస్థ సెలెరియోను ఆరేళ్ల క్రితం విడుదల చేసింది. ఇటీవల నెక్స్ట్‌ జెనరేషన్ సెలెరియోను మార్కెట్లోకి విడుదల చేయాలని మారుతి సుజుకి నిర్ణయించింది. ప్రస్తుత మార్కెట్‌ పోటీకి అనుగుణంగా పాత వేరియంట్‌కు మార్పులు చేయనున్నారు. ఈ కారులో 1.0 లీటర్ K10B త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 67 PS శక్తిని, 90 NM టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. పెట్రోల్-CNG పవర్ ట్రెయిన్‌ వేరియంట్‌ను కూడా మారుతి అభివృద్ధి చేస్తోంది. ఇవి 5 స్పీడ్ మాన్యువల్, ఆప్షనల్ AMT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో రానున్నాయి.నెక్స్ట్ జెనరేషన్ మహీంద్రా XUV 500
భారత్‌లో మిడ్ సైజ్‌ ఎస్‌యూవీ విభాగంలో మహీంద్రా XUV 500కి మంచి ఆదరణ లభించింది. పదేళ్లుగా ఈ వేరియంట్ మంచి అమ్మకాలను నమోదు చేస్తోంది. ఈ ఎస్‌యూవీకి అప్‌డేటెడ్ వెర్షన్‌ను మహీంద్రా త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనుంది. నెక్స్ట్ జెనరేషన్ XUV 500 టెస్టింగ్ సైతం పూర్తయినట్టు వార్తలు వస్తున్నాయి. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్, పనోరమిక్ సన్‌రూఫ్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్.. వంటి ఫీచర్లతో కొత్త మోడల్‌ను తీర్చిదిద్దారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Business, CAR, Cars, Honda, Hyundai, Mahindra, MARUTI SUZUKI

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు