టెలికాం సంస్థలు ప్రీపెయిడ్ టారిఫ్‌ల ధరలను వరుసగా పెంచుతున్నాయి. ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలు పెంచుతున్నట్లు ఈ వారం ప్రారంభంలో ప్రకటించింది ఎయిర్టెల్. వివిధ ప్లాన్ల ధరలు 20-25 శాతం వరకు పెరిగాయి. తాజాగా వొడాఫోన్- ఐడియా (Vodafone-Idea VI) సైతం ధరలు పెంచింది. ఇప్పటివరకు జియో మాత్రమే ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలు పెంచలేదు. ఈ నేపథ్యంలో ఈ మూడు టెలికాం దిగ్గజాలు అందిస్తున్న వివిధ ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలు ఎలా ఉన్నాయో పోల్చి చూద్దాం. (మీ టెలికాం సంస్థను బట్టి ధరల్లో కొద్దిపాటి హెచ్చుతగ్గులు ఉండవచ్చని గమనించాలి.)
* అన్లిమిటెడ్ కాలింగ్ ప్లాన్లు - 28 రోజుల వ్యాలిడిటీ
- ధరల పెంపు తరువాత ఎయిర్టెల్ బేసిక్ అన్లిమిటెడ్ కాలింగ్ ప్లాన్ ఇప్పుడు రూ. 179 నుంచి ప్రారంభమవుతుంది. ఇది రోజుకు 1GB డేటాతో పాటు రోజుకు 100 SMSలను కూడా అందిస్తుంది. ఈ విభాగంలో రూ. 299 ప్లాన్.. రోజుకు 1.5GB డేటాతో ఇవే ప్రయోజనాలను అందిస్తుంది. రూ. 359తో రోజుకు 2GB డేటాతో పాటు అన్లిమిటెడ్ కాలింగ్, 100 SMSలను పొందవచ్చు.
- Jio రూ. 149 ప్లాన్ (24 రోజులు)తో ఇలాంటి ప్రయోజనాలనే అందిస్తుంది. రోజుకు 100 SMSలు, 1GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ వంటి ప్రయోజనాలు ఉంటాయి. రోజుకు 1.5GB డేటా (28 రోజులు) ప్లాన్ ధర రూ. 199గా ఉంది. అయితే రోజుకు 2GB డేటా అందించే ప్లాన్ ధర రూ. 249. రూ. 349 ప్యాక్ రోజుకు 3GB డేటాను 28 రోజుల పాటు అందిస్తుంది.
- Vodafone Idea రోజుకు 1.5GB డేటా (28 రోజులు) అందించే ప్లాన్ ధర రూ. 299గా ఉంది. అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలతో పాటు ప్రతిరోజు 2GB డేటా అందించే ప్లాన్ ధర ఇప్పుడు రూ. 359గా ఉంది.
* అన్లిమిటెడ్ కాలింగ్ ప్లాన్లు - 56 రోజుల వ్యాలిడిటీ
- 56 రోజులు లేదా దాదాపు రెండు నెలల పాటు వ్యాలిడిటీతో రెండు అన్లిమిటెడ్ ప్లాన్లను ఎయిర్టెల్ అందిస్తుంది. రూ.479 ప్లాన్ ద్వారా రోజుకు 1.5జీబీ డేటా పొందవచ్చు. రూ.549 ప్లాన్ రోజుకు 2జీబీ డేటాను అందిస్తుంది. రెండు ప్లాన్లలో అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు కూడా ఉన్నాయి.
- జియో రూ. 399తో రోజుకు 1.5GB డేటాను, రూ. 666తో రోజుకు 2GB డేటాను అందిస్తోంది. రెండు ప్లాన్లతో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు వస్తాయి.
- వొడాఫోన్- ఐడియా రూ. 479తో రోజుకు 1.5GB డేటా ప్లాన్, రూ. 539తో రోజుకు 2GB డేటా ప్లాన్ అందిస్తోంది. రెండూ అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100SMSలు వంటి ప్రయోజనాలతో వస్తాయి.
ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు పండగ లాంటి వార్త.. బంగారం కొనేందుకు ఇదే సరైన సమయం..
* అన్లిమిటెడ్ కాలింగ్ ప్లాన్లు - 84 రోజుల వ్యాలిడిటీ
- ఎయిర్టెల్ 84 రోజుల వ్యాలిడిటీతో మూడు ప్లాన్లను అందిస్తోంది. రోజుకు 6GB డేటాను అందించే రూ.455 ప్లాన్, రోజుకు 1.5GB డేటాను అందించే రూ.719 ప్లాన్, రోజుకు 2GB డేటాను అందించే రూ.839 ప్లాన్లు ఈ జాబితాలో ఉన్నాయి. వీటి ద్వారా ఎయిర్టెల్ అందించే అదనపు ప్రయోజనాలను సైతం పొందవచ్చు.
- జియో రూ. 555 ప్లాన్‌తో రోజుకు 1.5GB డేటాను, రూ. 888 ప్లాన్‌తో 2GB డేటాను, రూ. 999 ప్లాన్‌తో 3GB డేటాను అందిస్తోంది.
- VI రోజుకు 1.5GB డేటాను రూ. 719తో, 2GB డేటాను రూ. 839తో అందిస్తోంది. రూ. 459 ప్లాన్‌తో 6GB మొత్తం డేటా ప్లాన్ కూడా ఉంది.
* డేటా టాప్-అప్స్ లేదా డేటా బూస్టర్ ప్లాన్లు
- ఎయిర్టెల్ మూడు డేటా బూస్టర్ ప్లాన్లను అందిస్తోంది. 3GB కోసం రూ. 58, 12GB కోసం రూ. 118, 50GB కోసం రూ. 301 ప్లాన్లను కస్టమర్లు ఎంచుకోవచ్చు. మీ ప్రస్తుత ప్లాన్ వ్యాలిడిటీ ముగిసే వరకు ఈ ప్లాన్ల వ్యాలిడిటీ ఉంటుంది.
- Jio రూ. 11కి 1GB డేటాను, రూ. 21కి 2GB డేటాను, రూ. 51కి 6GB డేటాను అందిస్తోంది. రూ. 101 ప్లాన్‌తో 12GB డేటాను అందిస్తోంది. 30 రోజుల వ్యాలిడిటీతో 'వర్క్ ఫ్రమ్ హోమ్' డేటా బూస్టర్లు కూడా ఉన్నాయి. దీని ధర 30GBకి రూ. 151, 40GBకి రూ.201, 50GBకి రూ.251గా ఉంది.
- VI కూడా 28 రోజుల వ్యాలిడిటీతో.. రూ. 58తో 3GB డేటాను అందిస్తోంది. 28 రోజుల వ్యాలిడిటీతో రూ. 118కి 12GB డేటాను అందిస్తోంది. 28 రోజులకు 50GB డేటాను అందించే రూ.298 ప్లాన్, 56 రోజులకు 100GB డేటాను అందించే రూ.418 ప్లాన్లు కూడా ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Airtel recharge plans, Business, Recharge, Reliance Jio, Vodafone Idea