IPO Grey Market Premium: దెవ్‌యానీ, క్రిష్ణా డయాగ్నస్టిక్స్, ఎక్సారో టైల్స్, విండ్‌లాస్ బయోటెక్ గ్రే మార్కెట్ ప్రీమియం ఎంతంటే

Grey Market Premium: దెవ్‌యానీ, క్రిష్ణా డయాగ్నస్టిక్స్, ఎక్సారో టైల్స్, విండ్‌లాస్ బయోటెక్ గ్రే మార్కెట్ ప్రీమియం ఎంతంటే (ప్రతీకాత్మక చిత్రం)

IPO Grey Market Premium | దేవ్‌యానీ ఇంటర్నేషనల్, కృష్ణా డయాగ్నస్టిక్స్, విండ్‌లాస్ బయోటెక్, ఎక్సారో టైల్స్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ఈరోజు ముగుస్తుంది. గ్రే మార్కెట్ ప్రీమియం ఎంతో తెలుసుకోండి.

  • Share this:
    స్టాక్ మార్కెట్లోకి ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్-IPO జాతర కొనసాగుతోంది. ఇటీవల కంపెనీలన్నీ వరుసగా ఐపీఓలు తీసుకొస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే ఫుడ్ డెలివరీ దిగ్గజం అయిన జొమాటో ఐపీఓ సూపర్ హిట్ అయింది. దీంతో ఐపీఓలకు ఇన్వెస్టర్లలో డిమాండ్ పెరిగిపోతోంది. ఆగస్ట్ 4న ఒకే రోజు నాలుగు ఐపీఓల సబ్‌స్క్రిప్షన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. దేవ్‌యానీ ఇంటర్నేషనల్, కృష్ణా డయాగ్నస్టిక్స్, విండ్‌లాస్ బయోటెక్, ఎక్సారో టైల్స్ సబ్‌స్క్రిప్షన్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఆగస్ట్ 6న అంటే ఈరోజే సబ్‌స్క్రిప్షన్ ముగుస్తుంది. ఐపీఓ అనగానే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత అని చెక్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ నాలుగు ఐపీఓల గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత అనేదానిపై ఇన్వెస్టర్లలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి దేవ్‌యానీ ఇంటర్నేషనల్, కృష్ణా డయాగ్నస్టిక్స్, విండ్‌లాస్ బయోటెక్, ఎక్సారో టైల్స్ గ్రే మార్కెట్ ప్రీమియం ఎంతో తెలుసుకోండి.

    Gold Purity Check: బంగారు నగలు నకిలీవా? ఒరిజినలా? ఈ చిట్కాలతో మీ ఇంట్లోనే టెస్ట్ చేయండి

    Bank Account: మీకు ఒకే బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే జాగ్రత్త

    Devyani International IPO GMP: దేవ్‌యానీ ఇంటర్నేషనల్ ప్రైస్ బ్యాండ్ చూస్తే రూ.86 నుంచి రూ.90 మధ్య ఉంది. కటాఫ్ ధర రూ.90. గ్రే మార్కెట్ ప్రీమియం రూ.63 ఉంది. అంటే 70 శాతం ప్రీమియం లభిస్తుంది.

    Krsnaa Diagnostics IPO GMP: క్రిష్ణా డయాగ్నస్టిక్స్ ప్రైస్ బ్యాండ్ చూస్తే రూ.933 నుంచి రూ.954 మధ్య ఉంది. కటాఫ్ ధర రూ.954. గ్రే మార్కెట్ ప్రీమియం రూ.450 ఉంది. అంటే 47 శాతం ప్రీమియం లభిస్తుంది.

    Windlas Biotech IPO GMP: విండ్‌లాస్ బయోటెక్ ప్రైస్ బ్యాండ్ చూస్తే రూ.448 నుంచి రూ.460 మధ్య ఉంది. కటాఫ్ ధర రూ.460. గ్రే మార్కెట్ ప్రీమియం రూ.130 ఉంది. అంటే 28 శాతం ప్రీమియం లభిస్తుంది.

    Business Idea: లక్షల్లో ఆదాయం వచ్చే వ్యాపారం... రతన్ టాటా పెట్టుబడి పెట్టిన కంపెనీ ఫ్రాంఛైజ్ తీసుకోండిలా

    Bank Account Closed: జూలై 31 తర్వాత మీ బ్యాంక్​ అకౌంట్ క్లోజ్​ అయిందా? ఇలా చెక్​ చేసుకోండి

    Exxaro Tiles IPO GMP: ఎక్సారో టైల్స్ ప్రైస్ బ్యాండ్ చూస్తే రూ.118 నుంచి రూ.120 మధ్య ఉంది. కటాఫ్ ధర రూ.120. గ్రే మార్కెట్ ప్రీమియం రూ.20 ఉంది. అంటే 18 శాతం ప్రీమియం లభిస్తుంది.

    గ్రే మార్కెట్ ప్రీమియం ప్రతీ రోజు మారుతుందన్న విషయాన్ని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి. మార్కెట్ పరిస్థితులను బట్టి గ్రే మార్కెట్ ప్రీమియం పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. కేవలం లిస్టింగ్ గెయిన్స్ కోసం ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు ఈ రిస్కును గుర్తుంచుకొని పెట్టుబడి పెట్టాలి. ఇక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు ఆ కంపెనీకి సంబంధించి పూర్తిగా స్టడీ చేసి, బిజినెస్ అర్థమై, భవిష్యత్తులో ఆ వ్యాపారం బాగుంటుందని అనుకుంటేనే ఇన్వెస్ట్ చేయాలి.
    Published by:Santhosh Kumar S
    First published: