రోడ్లపై తిరిగే కార్ల సంఖ్య నానాటికి పెరిగిపోతున్నాయి. వివిధ పనుల నిమిత్తం ప్రయాణం కోసం కార్లను విరివిగా వాడుతున్నారు. దీంతో ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. అయితే చాలా మంది తమ వాహనాలకు తగిన బీమాను తీసుకోవడానికి పెదగా ఆసక్తి కనబర్చడం లేదు. కానీ ఇటీవల అన్ని వాహనాలకు థర్డ్ పార్టీ బీమాను తప్పనిసరి చేయడంతో వాహనదారులందరూ బీమా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కార్ ఇన్సూరెన్స్ పాలసీతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఏదైనా ప్రమాదంలో కారు దెబ్బతింటే, అందుకు సంబంధించిన ఖర్చులను పాలసీ కవర్ చేస్తుంది. అలాగే కారు దొంగతనానికి గురైతే, ఆ నష్టాన్ని పాలసీ ద్వారా కారు యజమాని భర్తీ చేసుకోవచ్చు. అయితే కార్ ఇన్సూరెన్స్ పాలసీ చెల్లుబాటులో ఉండాలి. దాన్ని సకాలంలో రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. సాధారణంగా కార్ ఇన్సూరెన్స్ పాలసీ గడువు తేదీని మూడు మార్గాల ద్వారా తెలుసుకోవచ్చు.
1. ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (IIB)
వాహన బీమాకు సంబంధించిన సమాచారం ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు చెందిన వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ఆధ్వర్యంలో పనిచేస్తుంది. కార్ ఇన్సూరెన్స్ పాలసీ గడువు తెలుసుకోవాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.
స్టెప్-1: బీమా సమాచార బ్యూరో అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలి.
స్టెప్-2: రిజిస్టర్డ్ పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్ ID, చిరునామా, కారు రిజిస్ట్రేషన్ నంబర్ వంటి అవసరమైన వివరాలను నమోదు చేయండి.
స్టెప్-3: క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి, సబిమిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్-4: కార్ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన సమాచారం స్క్రీన్‌పై కనిపిస్తుంది.
ఇక్కడ మీరు బీమా గడువు తేదీని చెక్ చేసుకోవచ్చు. కాగా, ఏప్రిల్ 1, 2020 తర్వాత కొనుగోలు చేసిన బీమా పాలసీలకు సంబంధించిన సమాచారం మాత్రమే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.
2. VAHAN (వాహన్)
కేంద్ర రోడ్డు రవాణా - రహదారుల మంత్రిత్వ శాఖ VAHAN వెబ్‌సైట్‌లో అన్ని బీమా పాలసీల రికార్డులను ఉంచుతుంది. మీరు ఈ వెబ్‌సైట్ ద్వారా మీ కారు పాలసీ గడువు తేదీని చెక్ చేసుకోవచ్చు.
స్టెప్-1: వాహన్ ఇ-సర్వీస్ వెబ్‌సైట్‌ను సందర్శించండి
స్టెప్-2: Know Your Details బటన్‌పై క్లిక్ చేయండి
స్టెప్-3: తరువాత పేజీలో మీ వాహనం నెంబర్, వెరిఫికేషన్ కోడ్‌ను ఎంటర్ చేయండి
స్టెప్-3: సెర్చ్ వెహికల్ బటన్‌పై క్లిక్ చేయండి
స్టెప్-4: బీమాకు సంబంధించిన వివరాలు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతాయి.
3. బీమా సంస్థ
బీమా అందించే సంస్థ కూడా మీ వాహనానికి సంబంధించిన పాలసీల రికార్డులను రూపొందిస్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లోకి లాగిన్ అయి, మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ వివరాలను చెక్ చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BUSINESS NEWS, CAR, Insurance, Term insurance