CHECK CIBIL SCORE KNOW HOW TO CHECK YOUR CIBIL SCORE AND DOWNLOAD CIBIL REPORT ONLINE WITH THESE SIMPLE STEPS SS
CIBIL Score: మీ క్రెడిట్ స్కోర్ ఎంత? సింపుల్‌గా చెక్ చేయండి ఇలా
CIBIL Score: మీ క్రెడిట్ స్కోర్ ఎంత? సింపుల్‌గా చెక్ చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)
CIBIL Score | ఓ వ్యక్తి బ్యాంకుల నుంచి ఎన్నిసార్లు అప్పులు తీసుకున్నాడు? తిరిగి ఎలా చెల్లించాడు? అతని క్రెడిట్ హిస్టరీ ఏంటీ అన్న వివరాలు సిబిల్ రిపోర్ట్‌లో (CIBIL Report) చెక్ చేయొచ్చు. ప్రతీ ఒక్కరూ తమ సిబిల్ స్కోర్ ఉచితంగా చెక్ చేయొచ్చు.
మీ క్రెడిట్ స్కోర్ ఎంతో చెక్ చేసుకున్నారా? చివరిసారిగా మీ సిబిల్ రిపోర్ట్ (CIBIL Report) ఎప్పుడు చెక్ చేశారు? ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా తరచూ తమ సిబిల్ స్కోర్ చెక్ చేస్తూ ఉండాలి. గతంలో బ్యాంకులో లోన్‌కు అప్లై చేస్తే బ్యాంకు సిబ్బంది వెరిఫికేషన్ చేసి రుణాలు మంజూరు చేయాలా వద్దా అని నిర్ణయించేవారు. ఇప్పటికే కొన్ని లోన్స్‌కి ఈ ప్రాసెస్ ఉంది. అయితే ఇప్పుడు ఎవరైనా కస్టమర్ లోన్ కోసం దరఖాస్తు చేస్తే బ్యాంకులు మొదట చెక్ చేసేది సిబిల్ స్కోర్ (CIBIL Score). పర్సనల్ లోన్, కార్ లోన్, టూవీలర్ లోన్, హోమ్ లోన్, క్రెడిట్ కార్డ్ (Credit Card) లాంటివాటికి అప్లై చేస్తే బ్యాంకులు ముందుగా కస్టమర్ల సిబిల్ స్కోర్ చెక్ చేసి సదరు కస్టమర్ క్రెడిట్ హిస్టరీ, గతంలో తీసుకున్న అప్పుల్ని చెల్లించిన తీరుపై ఓ అంచనాకు వస్తాయి. ఆ తర్వాత లోన్ ప్రాసెస్ ప్రారంభిస్తాయి. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే ముందే లోన్ రిజెక్ట్ చేస్తాయి.
ఇండియాలో సిబిల్ స్కోర్ 2007లో అమలులోకి వచ్చింది. అప్పట్నుంచి బ్యాంకులు, ఫైనాన్సింగ్ సంస్థల్లో అప్పులు తీసుకొని చెల్లించినవారికి క్రెడిట్ స్కోర్ కేటాయిస్తోంది ట్రాన్స్‌యూనియన్ సిబిల్ సంస్థ. ఈ స్కోర్‌నే సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ రిపోర్ట్ అంటారు. ఆర్థిక లావాదేవీలు జరిపే ప్రతీ ఒక్కరూ తమ సిబిల్ స్కోర్ ఎంత చెక్ చేసుకోవాలి. ఈ స్కోర్ 300 నుంచి 900 మధ్య ఉంటుంది. 750 కన్నా ఎక్కువ సిబిల్ స్కోర్ ఉంటే మంచి క్రెడిట్ స్కోర్‌గా భావిస్తారు. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే రుణాలు మంజూరు చేసే ప్రక్రియ సులువవుతుంది.
LIC: ఎల్ఐసీ పాలసీ ఉన్నవారికి అద్భుత అవకాశం... మే 9 వరకే
సిబిల్ రిపోర్ట్ చెక్ చేస్తే అందులో క్రెడిట్ స్కోర్ ఎంతో తెలుస్తుంది. దీంతో పాటు గతంలో ఎన్ని రుణాలు తీసుకున్నారు, వాయిదాలు ఎలా చెల్లించారు, ప్రస్తుతం ఎన్ని రుణాలు యాక్టీవ్‌లో ఉన్నాయి, ఎన్ని క్రెడిట్ కార్డులు వాడుతున్నారు అన్న వివరాలన్నీ సిబిల్ రిపోర్ట్‌లో ఉంటాయి. ఒకవేళ మీ ప్రమేయం లేకుండా ఎవరైనా రుణాలు తీసుకున్నా సిబిల్ రిపోర్ట్‌లో తెలుసుకోవచ్చు.మరి ఆన్లైన్లో మీ సిబిల్ రిపోర్ట్ ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.
Step 1- ముందుగా https://www.cibil.com/ వెబ్సైట్ ఓపెన్ చేయండి.
Step 2- ఆ తర్వాత Get your CIBIL Score పైన క్లిక్ చేయండి.
Step 3- ఆ తర్వాత మీ వివరాలతో రిజిస్ట్రేషన్ చేయండి.
Step 4- మీ వివరాలతో లాగిన్ అయిన తర్వాత go to dashboard పైన క్లిక్ చేయండి.
Step 5- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ క్రెడిట్ స్కోర్ కనిపిస్తుంది.
ఇలా మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేయడంతో పాటు సిబిల్ రిపోర్ట్ డౌన్లోడ్ చేయొచ్చు. సిబిల్ రిపోర్ట్‌ను ఏడాదికి ఒకసారి ఉచితంగా ఆన్లైన్లో చెక్ చేయొచ్చు. లేదా వార్షిక సభ్యత్వం తీసుకుంటే ఏడాదిలో ఎన్ని సార్లైనా క్రెడిట్ స్కోర్, సిబిల్ రిపోర్ట్ చెక్ చేయొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.