Home /News /business /

CHEAPEST PERSONAL LOAN BANKS OFFERING PERSONAL LOANS AT VERY LOW INTEREST RATES MK

Cheapest Personal Loan: అతి తక్కువ వడ్డీ రేట్లకే పర్సనల్ లోన్ అందిస్తున్న బ్యాంకులివే...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Cheapest Personal Loan: అత్యవసరంగా డబ్బు కావాలంటే మనకు ప్రైవేటు రుణాల కన్నా కూడా బ్యాంకు రుణాలే అత్యుత్తమం. ప్రైవేటు రుణాలు వడ్డీరేట్లు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు సిబిల్ స్కోరులో కూడా కనిపించవు. అలాగే రుణాలకు అయితే బ్యాంకు నుంచి యాడ్ ఆన్ సౌకర్యం కూడా ఉంటుంది.

ఇంకా చదవండి ...
    Cheapest Personal Loan: అత్యవసరంగా డబ్బు కావాలంటే మనకు ప్రైవేటు రుణాల కన్నా కూడా బ్యాంకు రుణాలే అత్యుత్తమం. ప్రైవేటు రుణాలు వడ్డీరేట్లు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు సిబిల్ స్కోరులో కూడా కనిపించవు. అలాగే రుణాలకు అయితే బ్యాంకు నుంచి యాడ్ ఆన్ సౌకర్యం కూడా ఉంటుంది. అయితే అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు వ్యక్తిగత రుణాలు మన బెస్ట్ ఫ్రెండ్ లాగా పని చేస్తాయి. మీ వద్ద గ్యారెంటీగా తాకట్టు పెట్టడానికి ఏమీ లేకపోయినా, మీరు సులభంగా వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చు. ఇది పూర్తిగా అన్ సెక్యూర్డ్ రుణం, దీనిలో ఎటువంటి హామీ ఇవ్వాల్సిన పనిలేదు. కస్టమర్ తన ఆదాయానికి అనుగుణంగా రుణాన్ని తిరిగి చెల్లించగల సామర్థ్యాన్ని బట్టి ఈ రుణం ఇస్తారు. రుణాన్ని ఆమోదించే ముందు, మీ ఆదాయం, క్రెడిట్ స్కోర్‌ని తనిఖీ చేసిన తర్వాత రుణదాత రుణాన్ని ఆమోదిస్తారు. వివాహం, ఇంటి పునర్నిర్మాణం, వైద్య అత్యవసరం, విద్య మొదలైన ఏవైనా తక్షణ అవసరాల కోసం మీరు వ్యక్తిగత రుణాన్ని(Personal Loan)  బ్యాంకుల నుంచి  పొందవచ్చు.

    పర్సనల్ లోన్ కోసం అప్లై చేసే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి

    మీరు పర్సనల్ లోన్ కోసం అప్లై చేయబోతున్నట్లయితే, దానికి ముందు మీరు వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను సరిపోల్చండి. పర్సనల్ లోన్ కోసం అప్లై చేసే ముందు, ప్రాసెసింగ్ సమయం, ఇతర ఫీచర్లు, హిడెన్ ఛార్జీలతో పాటు ఇతర బ్యాంకులతో వడ్డీ రేట్లను సరిపోల్చాలి. ఎంత అవసరం ఉంటే అంత వరకు మాత్రమే వ్యక్తిగత రుణాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. తద్వారా తిరిగి చెల్లించడం సులభం అవుతుంది. భారీ మొత్తంలో లోన్ తీసుకుని ఆ తర్వాత చెల్లింపులో జాప్యం అయితే మీ సిబిల్ స్కోరు ఎఫెక్ట్ అవుతుంది.

    మనకు ఆన్ లైన్ లో  పర్సనల్ లోన్ కోసం EMIని లెక్కించేందుకు కాలిక్యులేటర్లు అందుబాటులో ఉన్నాయి. అసలు, వడ్డీ రేటు, కాల వ్యవధి లాంటి వివరాలను సమర్పించడం ద్వారా మీ EMIని సులభంగా లెక్కించవచ్చు. ఐదు సంవత్సరాల కాలవ్యవధి కోసం రూ. 5 లక్షల వ్యక్తిగత రుణంపై అతి తక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్న బ్యాంకుల జాబితాను ఇక్కడ పొందుపరుస్తున్నాం.



    పలు బ్యాంకుల  వడ్డీ రేట్లు ఇవే...
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Personal Loan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు