కేదార్‌నాథ్ ధామ్ వెళ్లే భక్తులకు శుభవార్త. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కేదార్‌నాథ్ ధామ్‌కు హెలికాప్టర్ సేవల్ని అందించబోతోంది. ఏప్రిల్ 22న యమునోత్రి, గంగోత్రి ఆలయాలను తెరవడంతో యాత్ర ప్రారంభమవుతుంది. కేదార్‌నాథ్ ధామ్ 2023 ఏప్రిల్ 25న ప్రారంభం కానుంది. బద్రీనాథ్ ఆలయం ఏప్రిల్ 27న తెరుచుకోనుంది. లక్షలాది మంది భక్తులు ఈ యాత్రకు వస్తుంటారు. చార్ ధామ్ యాత్రలో (Char Dham Yatra) పాల్గొనడానికి ఇప్పటికే 2 లక్షలకు పైగా భక్తులు రిజిస్టర్ చేసుకున్నారని అంచనా. కేదార్‌నాథ్ వెళ్లే భక్తులు ఐఆర్‌సీటీసీ హెలికాప్టర్ సేవల్ని (IRCTC Helicopter Services) బుక్ చేసుకోవచ్చు.
కేదార్‌నాథ్‌కు భక్తులు హెలికాప్టర్ సేవల్ని ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా https://heliyatra.irctc.co.in/ వెబ్‌సైట్ రూపొందించింది ఐఆర్‌సీటీసీ. ఏప్రిల్ 1న బుకింగ్స్ ప్రారంభం అవుతాయి. మార్చి 31 లోపు ట్రయల్ రన్ పూర్తవుతుంది. ఆ తర్వాత బుకింగ్స్ ప్రారంభం అవుతాయి. యాత్రికుల భద్రత కోసం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మార్గదర్శకాల ప్రకారం హెలికాప్టర్ ఆపరేటర్లు పని చేస్తారు.
EPFO Good News: ఐదు కోట్ల ఈపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్... వడ్డీ రేటు పెంచిన ఈపీఎఫ్ఓ
ఐఆర్‌సీటీసీ హెలికాప్టర్ సేవల్ని బుక్ చేసుకునేముందు భక్తులు టూరిస్ట్ కేర్ ఉత్తరాఖండ్ యాప్, స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ వాట్సప్ సర్వీస్‌లో రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం పర్యాటకు Yatra అని టైప్ చేసి 918394833833 నెంబర్‌కు వాట్సప్‌లో మెసేజ్ చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత అన్ని వివరాలు ఎంటర్ చేయాలి.
చార్‌ధామ్ యాత్రకు ఇప్పటివరకు 5.97 లక్షల రిజిస్ట్రేషన్స్ పూర్తయ్యాయి. అందులో కేదార్‌నాథ్‌కు 2.2 లక్షల రిజిస్ట్రేషన్స్, బద్రీనాథ్‌కు 1.9 లక్షల రిజిస్ట్రేషన్స్, గంగోత్రికి 88,521 రిజిస్ట్రేషన్స్, యమునోత్రికి 87,352 రిజిస్ట్రేషన్స్ పూర్తయ్యాయి. 2022లో 45 లక్షల భక్తులు ఈ నాలుగు ఆలయాలను దర్శించుకున్నారని అంచనా. అందులో 17.6 లక్షల మంది భక్తులు బద్రీనాథ్‌కు, 15.6 లక్షల మంది భక్తులు కేదార్‌నాథ్‌కు, 6.2 లక్షల మంది భక్తులు గంగోత్రికి, 4.8 లక్షల మంది భక్తులు యమునోత్రికి వచ్చారు. ఈసారి కూడా ఇదే స్థాయిలో భక్తులు చార్‌ధామ్ యాత్రకు వస్తారని అంచనా.
Tax Saving Tips: ఈ మినహాయింపులతో పన్ను ఎక్కువ ఆదా చేయొచ్చు? మార్చి 31 లోపు ప్లాన్ చేయండి
ఐఆర్‌సీటీసీ టూరిజం చార్‌ధామ్ యాత్రకు వెళ్లాలనుకునేవారి కోసం ప్రత్యేకంగా టూర్ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. న్యూ ఢిల్లీ, హరిద్వార్, ముంబై, రాయ్‌పూర్ నుంచి ఈ టూర్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.55,000. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు 11 రోజుల పాటు చార్‌ధామ్ యాత్రకు వెళ్లొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Char dham Yatra, Helicopter, IRCTC, IRCTC Tourism, Kedarnath