జర్మన్ లగ్జరీ కార్ల దిగ్గజం బీఎమ్‌డబ్ల్యూ (BMW) వాహనదారుల కోసం అద్భుతమైన కార్లు లాంచ్ చేస్తోంది. ఈ కార్ల ద్వారా వాహనదారులకు ఎక్స్ట్రాడినరీ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు సరికొత్త టెక్నాలజీలను కూడా ఆఫర్ చేస్తోంది. తాజాగా ఈ కంపెనీ రంగును మార్చే (Colour Changing) బీఎమ్‌డబ్ల్యూ iX ఫ్లో (BMW iX Flow) అనే కొత్త కారు మోడల్‌ను ఆవిష్కరించింది. లాస్ వెగాస్‌లోని కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES 2022)లో తాజాగా ఆవిష్కరించిన ఈ కారు ఎప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే జస్ట్ ఓ బటన్‌ను ప్రెస్ చేస్తే చాలు ఈ కారు తన రంగును పూర్తిగా మార్చుకుంటుంది. ఇందుకు ఈ వరల్డ్స్ ఫస్ట్ కలర్ చేంజింగ్ కారులో స్పెషల్ టెక్నాలజీని అందించారు. ఇది బటన్‌ను నొక్కడం ద్వారా రంగును మార్చడానికి అనుమతిస్తుంది. మరి ఈ కారు ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బీఎమ్‌డబ్ల్యూ కొత్త కారు అన్-వీల్ ఈవెంట్ సందర్భంగా... "మేం కార్ల టెక్నాలజీని ఊహించని స్థాయికి తీసుకెళ్తున్నాం," అని తెలిపింది. మీకు నచ్చిన దుస్తులను సెలక్ట్ చేసుకున్నంత ఈజీగా ఇప్పుడు మీరు మీ కారు రంగును ఎంచుకోవచ్చని బీఎమ్‌డబ్ల్యూ తెలిపింది. జర్మన్ ఆటోమేకర్ ఈ కలర్ చేంజింగ్ టెక్నాలజీకి సంబంధించి ఎక్కువ వివరాలను వెల్లడించలేదు. ఇది ఎలక్ట్రానిక్ ఇంక్ టెక్నాలజీ అయి ఉండొచ్చని తెలుస్తోంది.
బీఎమ్‌డబ్ల్యూ ఈ టెక్నాలజీ గురించి అధికారికంగా వెల్లడించకపోయినా ట్విట్టర్లో కొత్త కారు మోడల్‌కు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసింది. ఈ క్లిప్ లో బీఎమ్‌డబ్ల్యూ iX తెలుపు రంగు నుంచి ముదురు బూడిద రంగులో మారుతుండటం కనిపించింది. లాస్ వెగాస్‌లోని కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES)లో ప్రదర్శించిన ఈ కాన్సెప్ట్ కారు బూడిద, తెలుపు రంగులకు మాత్రమే మారింది. అయితే, అన్ని కలర్ కవర్ చేయడానికి టెక్నాలజీని విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఫోన్ యాప్ ద్వారా కస్టమర్లు తమ కారు వెలుపలి రంగును మార్చగలరని కంపెనీ పేర్కొంది.
ఈ లగ్జరీ కారు రంగును మార్చడంతో పాటు ఇతర ఆసక్తికరమైన ఫీచర్లను కూడా కలిగి ఉంది. "పార్కింగ్ ప్లేసులో మీ కారు ఎక్కడుందో మర్చిపోతే.. మీరు దానిని ఫ్లాష్ అయ్యేలా చేయవచ్చు. మీ కారు ఎక్కడ పార్క్ అయ్యిందో ఈజీగా తెలుసుకోవచ్చు" అని బీఎమ్‌డబ్ల్యూ తెలిపింది. రంగును మార్చడం ద్వారా సూర్యకాంతి ప్రతిబింబాన్ని, కారు ధర్మల్ ప్రాపర్టీస్ మార్చవచ్చని బీఎమ్‌డబ్ల్యూ పేర్కొంది. బీఎమ్‌డబ్ల్యూ గ్రూప్ డిజైన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అడ్రియన్ వాన్ హూయ్డాంక్ మాట్లాడుతూ, "మేం మా వాహనాలను వాహనదారులు సులభంగా ఆపరేట్ చేసేలా తయారు చేస్తాం, మై మోడ్స్ (My Modes)తో మరింత వ్యక్తిగతంగా మారుస్తాం. మంచి డిజిటల్ ఎక్స్‌పీరియన్స్‌తో అందిస్తాం." అని అడ్రియన్ వాన్ అన్నారు.
World's first colour changing car ⚡
BMW has recently revealed the BMW iX flow, the car can literally change its colour with a press of single button#bmw #bmwm2competition #bmwmperformance #bmwm2 #bmwmotors #bmwlover #carsofinstagram #carsdaily #amazingcars247 #carenthusiasts pic.twitter.com/Teo8ZRsiQO
— King Indian Media (@Kingmediaindia) April 25, 2022
CES 2022లో, బీఎమ్‌డబ్ల్యూ తన ఫ్లాగ్షిప్ ఈవీ iX M60 మోడల్‌ను కూడా ఆవిష్కరించింది. BMW iX M60 ఎలక్ట్రిక్ మొబిలిటీ, బెస్ట్ పర్ఫామెన్స్ తో వస్తుంది. ఇది 3.8 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలరు. ఇది రీఛార్జ్ అవసరం లేకుండా 575 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bmw, CAR, Viral photo, Viral Video