మురళీమోహన్ కోడలికే రాజమండ్రి ఎంపీ సీటు... చంద్రబాబు నిర్ణయం

తన కోడలు రూపాదేవి కోసమే మురళీమోహన్ ఎంపీ సీటును వదులుకున్నారని వార్తలు వినిపించాయి. ఇందుకు తగ్గట్టుగానే టీడీపీ అధినేత చంద్రబాబు చివరి నిమిషంలో ఆమెకు టికెట్ ఖరారు చేశారని తెలుస్తోంది. రాజమండ్రి ఎంపీ సీటు అభ్యర్థిత్వం కోసం పలువురి పేర్లను పరిశీలించిన చంద్రబాబు... చివరకు రూపాదేవి వైపే మొగ్గుచూపినట్టు సమాచారం.

news18-telugu
Updated: March 13, 2019, 7:31 PM IST
మురళీమోహన్ కోడలికే రాజమండ్రి ఎంపీ సీటు... చంద్రబాబు నిర్ణయం
మురళీమోహన్
news18-telugu
Updated: March 13, 2019, 7:31 PM IST
ప్రస్తుతం ఏపీలో ఎంపీలుగా కొనసాగుతున్న అనేకమంది నేతలు... రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం తమ పార్టీ అధినాయకత్వాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా కుదరని పక్షంలో ఇతర పార్టీల్లో చేరి... తాము అనుకున్న సీటు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. టీడీపీ ఎంపీలు రవీంద్రబాబు, అవంతి శ్రీనివాస్ ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు టీడీపీని వీడారు. అయితే ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా వ్యవహరిస్తున్న మురళీమోహన్ మాత్రం... మరో కారణంతో ఈ సారి పోటీ నుంచి తప్పుకున్నారు. ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలు అందించేందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు మురళీమోహన్ వివరణ ఇచ్చారు.

అయితే తన కోడలు రూపాదేవి కోసమే మురళీమోహన్ ఎంపీ సీటును వదులుకున్నారని వార్తలు వినిపించాయి. ఇందుకు తగ్గట్టుగానే టీడీపీ అధినేత చంద్రబాబు చివరి నిమిషంలో ఆమెకు టికెట్ ఖరారు చేశారని తెలుస్తోంది. రాజమండ్రి ఎంపీ సీటు అభ్యర్థిత్వం కోసం పలువురి పేర్లను పరిశీలించిన చంద్రబాబు... చివరకు రూపాదేవి వైపే మొగ్గుచూపినట్టు సమాచారం. కొన్నేళ్లుగా రాజమండ్రిలో తరచూ పర్యటిస్తూ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్న రూపాదేవి... రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. రాజమండ్రి పరిధిలోని నాయకులు సైతం ఎంపీ అభ్యర్థిత్వంపై నిర్ణయాన్ని చంద్రబాబుకే వదిలేయడంతో... ఆయన రూపాదేవికి ఎంపీ సీటును ఖరారు చేశారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే రూపాదేవికి రాజమండ్రి ఎంపీ సీటు ఇచ్చే అంశంపై చంద్రబాబు మురళీమోహన్‌కు ముందుగానే హామీ ఇచ్చారనే టాక్ కూడా వినిపిస్తోంది. రాజమండ్రి నుంచి మరోసారి తాను పోటీ చేయబోనని ప్రకటించిన మురళీమోహన్... నియోజకవర్గం పరిధిలో ప్రచారాన్ని మాత్రం కొనసాగిస్తున్నారు. పైకి పార్టీ కోసం ప్రచారం చేస్తున్నానని ఆయన చెబుతున్నా... వేరేవాళ్లు బరిలో ఉంటే ఆయన ఎందుకు ప్రచారం చేస్తారని కొందరు చర్చించుకుంటున్నారు. దీన్ని బట్టి రాజమండ్రి ఎంపీ సీటు తన కోడలు రూపాదేవికి వస్తుందనే విషయంపై మురళీమోహన్‌కు ముందుగానే క్లారిటీ ఉందనే టాక్ వినిపిస్తోంది.First published: March 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...