చందా కొచ్చర్‌కు షాక్...ఐసీఐసీఐకి కొత్త సారథి

వీడియోకాన్ కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు సెలవులో కొనసాగనున్న ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో చందా కొచ్చర్.

news18
Updated: June 18, 2018, 11:46 PM IST
చందా కొచ్చర్‌కు షాక్...ఐసీఐసీఐకి కొత్త సారథి
Lookout Notice: చందా కొచ్చర్‌కు మరో షాక్... లుక్ అవుట్ నోటీస్ జారీ చేసిన సీబీఐ (File Photo)
  • News18
  • Last Updated: June 18, 2018, 11:46 PM IST
  • Share this:
తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈవో చందాకొచ్చర్‌‌కు ఐసీఐసీఐ బోర్డు షాక్ ఇచ్చింది. ఆమెను దీర్ఘకాలిక సెలవుపై పంపుతూ బోర్డు నిర్ణయించింది. వీడియోకాన్‌ గ్రూప్‌నకు రుణాలివ్వడం ద్వారా ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈఓ చందా కొచ్చర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, దీని ద్వారా ఆమె కుటుంబ సభ్యులు లబ్ధి పొందారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఇప్పటికే కేసు నమోదుకావడంతో ఆమెను సుదీర్ఘ సెలవుపై పంపుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌- వీడియోకాన్‌ కేసు దర్యాప్తు పూర్తి అయ్యే వరకు ఆమె సెలవులోనే ఉండనున్నారు.

బ్యాంక్‌ సీవోవో హోదాలో సందీప్‌ బక్షికి బ్యాంకు సారధ్య బాధ్యతలు అప్పగించారు. ఆయన ప్రస్తుతం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్‌స్యూరెన్స్ ఎండీ, సీఈవోగా ఉన్నారు. ఆయన ఐసీఐసీఐ బ్యాంకు సీవోవో పదవిలో ఐదేళ్లపాటు కొనసాగనున్నారు. జూన్‌ 19 నుంచి ఆయన నియామకం అమల్లోకి రానున్నట్లు ఐసీఐసీఐ బ్యాంకు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నిర్ణయానికి రెగ్యూలేటరీ అనుమతులు రావాల్సి ఉంది. కొచ్చర్‌ సెలవులో ఉన్నంతకాలం బ్యాంక్‌ సందీప్ బక్షి బోర్డుకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. బ్యాంకుకు సంబంధించిన అందరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ మేనేజ్‌మెంట్ సందీప్ బక్షికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

ఓ రకంగా చందా కొచ్చర్‌ను ఇక ఇంటికి సాగనంపినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత పదేళ్లుగా సీఈవోగా కొనసాగుతున్న ఆమె పదవీకాలం 2019 మార్చిలో ముగియనుంది.
Published by: Janardhan V
First published: June 18, 2018, 11:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading