మాజీ సీఈఓ చందాకొచ్చర్ ఐసీఐసీఐకి రూ.350 కోట్లు చెల్లించాల్సిందేనా?

మాజీ సీఈఓ చందాకొచ్చర్ ఐసీఐసీఐకి రూ.350 కోట్లు చెల్లించాల్సిందేనా?

ఆమె బ్యాంకు నియమావళిని ఉల్లంఘించారంటూ ఐసీఐసీఐ విచారణ కమిటీ తేల్చిచెప్పడం చందాకొచ్చర్‌కు మరో షాక్. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఆమెను తొలగించడమే కాదు, ఏప్రిల్ 2009 నుంచి మార్చి 2018 వరకు ఆమె తీసుకున్న బోనస్‌లు తిరిగి చెల్లించాల్సిందేనని ఐసీఐసీఐ ఎంక్వైరీ కమిటి స్పష్టం చేసింది.

 • Share this:
  చందా కొచ్చర్... బ్యాంకింగ్ రంగంలో ఈ పేరు తెలియని వాళ్లుండరు. ప్రైవేట్ బ్యాంకైన ఐసీఐసీఐ సీఈఓగా కొన్నేళ్లపాటు సేవలందించారామె. కానీ ఒక్క కుంభకోణం ఆమె ఉద్యోగ జీవితాన్ని తలకిందులు చేసింది. ఏ బ్యాంక్ అయితే ఆమెను మహారాణిలా చూసిందో చివరకు అదే బ్యాంకు నుంచి వివాదాస్పద రీతిలో వైదొలగాల్సి వచ్చింది. సీఈఓ పదవికి రాజీనామా చేయడంతో ఆమె మాజీగా మిగిలిపోయారు. అంతేకాదు... కేసులూ చుట్టుముట్టాయి. ఇటీవల సీబీఐ చందాకొచ్చర్‌తో పాటు ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియాకాన్ గ్రూప్ ఎండీ వేణుగోపాల్ ధూత్‌పై కేసు నమోదు చేసింది. ఇప్పుడు ఆమె బ్యాంకు నియమావళిని ఉల్లంఘించారంటూ ఐసీఐసీఐ విచారణ కమిటీ తేల్చిచెప్పడం చందాకొచ్చర్‌కు మరో షాక్. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఆమెను తొలగించడమే కాదు, ఏప్రిల్ 2009 నుంచి మార్చి 2018 వరకు ఆమె తీసుకున్న బోనస్‌లు తిరిగి చెల్లించాల్సిందేనని ఐసీఐసీఐ ఎంక్వైరీ కమిటి స్పష్టం చేసింది.

  Read this: Health Insurance: హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలో యాడ్-ఆన్ మంచిదేనా?

  వాస్తవానికి చందాకొచ్చర్‌పై ఆరోపణలు వచ్చినప్పుడు గతేడాది మార్చిలో అదే బోర్డు క్లీన్ చిట్ కూడా ఇవ్వడం విశేషం. 2018 జూన్ నుంచి సెలవులో ఉన్న చందా కొచ్చర్ అక్టోబర్‌లో ఐసీఐసీఐ సీఈఓ పదవికి రాజీనామా చేశారు. బోర్డు రాజీనామాను ఆమోదించిన తర్వాతే పదవిలోంచి వైదొలిగారు. అయితే రాజీనామాను 'టెర్మినేషన్‌'గా పేర్కొనడం షాకిచ్చిన్నట్టు చందాకొచ్చర్ స్పందించారు. రుణాలకు సంబంధించిన నిర్ణయాలేవీ ఏకపక్షంగా తీసుకున్నవి కాదని, కమిటీ తీసుకున్న నిర్ణయమని వివరణ ఇచ్చారు. ఐసీఐసీఐ బ్యాంక్ తాజా నిర్ణయంతో రిటైర్మెంట్ తర్వాత చందా కొచ్చర్‌కు రావాల్సిన ప్రయోజనాలన్నీ ఆగిపోనున్నాయి. అంతేకాదు... 2009 నుంచి చెల్లించిన బోనస్‌లను రికవరీ చేయనున్నారు. చందాకొచ్చర్‍కు ఇచ్చిన బోనస్‌లు, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్లు మొత్తం కలిపిసే సుమారు రూ.350 కోట్లు కావచ్చని అంచనా. మరి ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందాకొచ్చర్ రూ.350 కోట్లు బ్యాంకుకు తిరిగి చెల్లించాల్సిందేనా? లేక ఆమె న్యాయ పోరాటం చేస్తారా? అన్నది చూడాలి.

  Honor View 20: అదిరిపోయే ఫీచర్లతో హానర్ వ్యూ 20...

  ఇవి కూడా చదవండి:

  Attention Please: ఇకపై మీ రైలు ఆలస్యంగా రాదు... భారతీయ రైల్వే కొత్త ప్లానింగ్

  IRCTC Refund Rules: ఐఆర్‌సీటీసీ ఇ-టికెట్ క్యాన్సిల్ చేశారా? రీఫండ్ రూల్స్ ఇవే...
  First published: