CENTRE WITHDRAWS DO NOT SHARE AADHAAR PHOTOCOPY ADVICE HERE FULL DETAILS NS
Aadhar New Rule: ఆధార్ జిరాక్స్ ఎవరికీ ఇవ్వొద్దన్న ప్రకటనపై వెనక్కు తగ్గిన కేంద్రం.. కీలక ప్రకటన
ప్రతీకాత్మక చిత్రం
మాస్క్డ్ ఆధార్ ను ((Masked Aadhaar Card)) మాత్రమే ఇతరులతో పంచుకోవాలన్న ప్రకటనపై కేంద్ర ప్రభుత్వం (Central Government) వెనక్కు తగ్గింది. ఈ మేరకు తాజాగా కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఆధార్ (Aadhar) కార్డు విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ (Central Government) ఇటీవల దేశ పౌరులకు ఓ కీలక సూచన చేసిన విషయం తెలిసిందే. ఆధార్ కార్డును ఇతరులకు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ‘మాస్క్డ్ కాపీ’ (Masked Aadhaar Card) లను మాత్రమే ఇవ్వాలని ఆ ప్రకటనలో కేంద్రం స్పష్టం చేసింది. అయితే.. ఆధార్ కార్డు దుర్వినియోగం కాకుండా ఉండేందుకే ఈ సూచనలు చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. వివిధ అవసరాల కోసం ఏ సంస్థకైనా.. ఇంకా ఎవరికైనా ఆధార్ ను ఇవ్వాల్సి వస్తే ‘ఫొటోకాపీ ఆధార్’ను ఇవ్వవద్దని ఆ ప్రకటనలో కేంద్రం పౌరులకు సూచించింది. అలా ఇస్తే మీ ఆధార్ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది.
అయితే.. ఫొటోకాపీకి బదులుగా మాస్క్డ్ కాపీలను ఇవ్వండని వెల్లడించింది. కాగా.. ఈ మాస్క్డ్ కాపీలో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి. దీంతో ఆధార్ దుర్వినియోగం అవడం కుదరదని వివరించింది కేంద్రం. అయితే.. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం వెనక్కితగ్గింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. మాస్క్డ్ ఆధార్ మాత్రమే ఇతరులతో పంచుకోవాలన్న ప్రకటనను విరమించుకుంటున్నట్లు స్పష్టం చేసింది. Right to dignity : సెక్స్ వర్కర్లకు ఆధార్ కార్డులు.. కేంద్రానికి సుప్రీం ఆదేశాలు
#Aadhaar holders are advised to exercise normal prudence in using and sharing their Aadhaar numbers.
In view of possibility of misinterpretation the press release issued earlier stands withdrawn with immediate effect.https://t.co/ChmbVs8EjJ@GoI_MeitY@PIB_India
గతంలో విడుదల చేసిన ప్రకటన ను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నందున దానిని వెనక్కు తీసుకుంటున్నట్లు తెలిపింది. ప్రజలు గతంలో మాదిరిగానే ఆధార్ ను వినియోగించుకోవాలని సూచించింది కేంద్రం. ఈ మేరకు UIDAI కూడా తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఆధార్ ను వినియోగించే సమయంలో సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.