హోమ్ /వార్తలు /బిజినెస్ /

Adani Row: అదానీ గ్రూప్ వ్యవహారంలో నిపుణుల ప్యానెల్‌ ఏర్పాటుకు అభ్యంతరం లేదు.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

Adani Row: అదానీ గ్రూప్ వ్యవహారంలో నిపుణుల ప్యానెల్‌ ఏర్పాటుకు అభ్యంతరం లేదు.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు

Adani Row: హిండెన్‌బర్గ్‌ నివేదిక ఆధారంగా ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనేందుకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ, ఇతర చట్టబద్ధమైన సంస్థలు సన్నద్ధమయ్యాయని కేంద్రం, సెబీ తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చెప్పారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

అదానీ గ్రూపు షేర్ల పతనం వివాదంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, రెగ్యులేటరీ మెకానిజమ్‌లను బలోపేతం చేసేందుకు డొమైన్ నిపుణుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదనపై తమకు అభ్యంతరం లేదని కేంద్రం సోమవారం సుప్రీంకోర్టుకు (Supreme Court) తెలిపింది. హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత అదానీ స్టాక్స్ (Adani Stocks) పతనానికి సంబంధించిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది.అయితే కమిటీకి డొమైన్ నిపుణుల పేర్లను, దాని పరిధిని సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని కోరుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి తెలియజేసినట్లు వార్తా సంస్థ పిటిఐ నివేదించింది.

హిండెన్‌బర్గ్‌ నివేదిక ఆధారంగా ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనేందుకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ, ఇతర చట్టబద్ధమైన సంస్థలు సన్నద్ధమయ్యాయని కేంద్రం, సెబీ తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చెప్పారు. కమిటీ వేయడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని... కమిటీ యొక్క నిపుణుల పేర్లు, పరిధిని తాము సూచించవచ్చని, సీల్డ్ కవర్‌లో పేర్లను అందిస్తామని ఎస్‌జి మెహతా చెప్పారు.

ఫిబ్రవరి 10న అదానీ స్టాక్స్ పతనం నేపథ్యంలో భారతీయ పెట్టుబడిదారుల ప్రయోజనాలను మార్కెట్ అస్థిరత నుంచి రక్షించాల్సిన అవసరం ఉందని మాజీ న్యాయమూర్తి నేతృత్వంలోని డొమైన్ నిపుణుల ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరింది.ఇదిలావుండగా.. అదానీ గ్రూప్‌లో పెట్టుబడులపై కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ఒక ప్రశ్న అడిగిన తర్వాత ప్రభుత్వం ఇప్పుడు పార్లమెంటు ముందు గణాంకాలను నమోదు చేసింది. గత ఎనిమిదేళ్లలో ప్రభుత్వ ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల నుండి అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు రుణాలు ఇవ్వడం, పెట్టుబడులు పెరగడం వాస్తవం కాదా ? అని తివారీ ప్రశ్నించారు.

Vande Bharat Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మరింతగా పెరగనున్న వందే భారత్ రైళ్ల సంఖ్య.. రెండు నెలల్లో..

Rahul Gandhi: ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ఈసారి చర్యలు ఉంటాయన్న కేంద్రమంత్రి

ప్రతిపక్షాలు కోరినట్లుగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) అవసరం లేదని సమర్థించేందుకు అదానీ గ్రూప్‌లోని ప్రభుత్వ రంగ సంస్థల అనుమతించదగిన పరిమితుల్లో తక్కువ ఎక్స్‌పోజర్‌ను ప్రభుత్వ అధికారులు ఉదహరిస్తున్నారు. హిండెన్‌బర్గ్ నివేదిక గత నెల చివరి నుండి అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో క్రాష్‌కు దారితీసిన తర్వాత JPC కోసం డిమాండ్ చేయడంతో పార్లమెంటు బడ్జెట్ సెషన్‌లో విపక్షాలు ఆందోళన చేపట్టాయి.

First published:

Tags: Adani group, Supreme Court

ఉత్తమ కథలు