GST: ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీ తగ్గింపు

GST: ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.

news18-telugu
Updated: July 27, 2019, 12:56 PM IST
GST: ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీ తగ్గింపు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలోని జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రొత్సహించే విధంగా పన్ను రాయితీలు ఇవ్వాలని భావించిన కేంద్రం... ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఇక ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన బ్యాటరీలపై కూడా భారీగా పన్నులను తగ్గించింది. ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించింది. తగ్గించిన ధరలు ఆగస్టు ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో పాటు స్థానిక సంస్థలు అద్దెకు తీసుకునే ఎలక్ట్రిక్ బస్సులకు జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలన్న ప్రతిపాదనకు కూడా జీఎస్టీ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా కాలుష్య రహితమైన ఎలక్ట్రిక్ వాహనాలను ప్రొత్సహించాలని భావిస్తున్న కేంద్రం... అందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాలకు జీఎస్టీ తగ్గించాలని నిర్ణయించింది.
Published by: Kishore Akkaladevi
First published: July 27, 2019, 12:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading