ESI : ఈఎస్‌ఐ కంట్రిబ్యూషన్ తగ్గించిన కేంద్రం.. 3.6 కోట్ల మంది ఉద్యోగులకి లాభం..

ESI | ఉద్యోగుల వాటా, కంపెనీల వాటా రెండూ దిగొస్తాయి. దీనికి సంబంధించి కేంద్రకార్మిక శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో.. ఈఎస్‌ఐలో ఇకముందు చాలామంది ఉద్యోగులు చేరే అవకాశం ఉంది. నెలకు రూ.21 వేల లోపు వేతనం ఉన్నవారికి ఈఎస్‌ఐ వర్తిస్తుంది. ఈ ఏడాది జులై 1 నుంచి తాజా నిర్ణయం అమల్లోకి వస్తుంది.

news18-telugu
Updated: June 14, 2019, 10:56 AM IST
ESI : ఈఎస్‌ఐ కంట్రిబ్యూషన్ తగ్గించిన కేంద్రం.. 3.6 కోట్ల మంది ఉద్యోగులకి లాభం..
ఈఎస్‌ఐ కంట్రిబ్యూషన్ తగ్గింపు
  • Share this:
మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 22 ఏళ్లలో ఎన్నడూలేని విధంగా తొలిసారి ఈఎస్ఐ కంట్రిబ్యూషన్ తగ్గించింది. 6.5 శాతానికి ఉన్న కంట్రిబ్యూషన్‌ 4 శాతానికి తగ్గించింది. దీంతో.. దాదాపు 3. 6ఉద్యోగుల లాభపడనున్నారు. ఇందులో ఉద్యోగుల వాటా, కంపెనీల వాటా రెండూ దిగొస్తాయి. దీనికి సంబంధించి కేంద్రకార్మిక శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో.. ఈఎస్‌ఐలో ఇకముందు చాలామంది ఉద్యోగులు చేరే అవకాశం ఉంది. నెలకు రూ.21 వేల లోపు వేతనం ఉన్నవారికి ఈఎస్‌ఐ వర్తిస్తుంది. ఈ ఏడాది జులై 1 నుంచి తాజా నిర్ణయం అమల్లోకి వస్తుంది.

కేంద్రప్రభుత్వం తగ్గించిన కంట్రిబ్యూషన్ కారణంగా.. సంస్థలకు రూ.5 వేల కోట్ల వరకూ ఆదా అవుతుండగా.. 12.85 లక్సలమంది యజమానులకు ప్రయోజనం ఉంటుంది. కంపెనీ కంట్రిబ్యూషన్ 4.75 శాతం నుంచి 3.25 శాతానికి, ఉద్యోగుల కంట్రిబ్యూషన్ 1.75 నుంచి 0.75 శాతానికి తగ్గుతుందని కార్మిక శాఖ తెలిపింది.
Published by: Amala Ravula
First published: June 14, 2019, 10:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading