బిజినెస్

  • Associate Partner
  • diwali-2020
  • diwali-2020
  • diwali-2020

Diwali Gift: మోదీ సర్కార్ దివాళీ ధమాకా... సామాన్యులపై మరోసారి వరాలు

Diwali Gift | బీ రెడీ. మోదీ సర్కార్ దివాళీ గిఫ్ట్ ఇవ్వబోతోంది. కరోనా వైరస్ మహమ్మారి ద్వారా నెలకొన్న సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి మరో ప్యాకేజీ సిద్ధం చేస్తోంది.

news18-telugu
Updated: October 27, 2020, 11:35 AM IST
Diwali Gift: మోదీ సర్కార్ దివాళీ ధమాకా... సామాన్యులపై మరోసారి వరాలు
Diwali Gift: మోదీ సర్కార్ దివాళీ ధమాకా... సామాన్యులపై మరోసారి వరాలు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కోవిడ్-19 కారణంగా డీలాపడిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దశల వారీగా ఉద్దీపనలు, ప్యాకేజీను ప్రకటిస్తోంది. తాజాగా దీపావళి లోపు మరో దశలో ఉద్దీపనలను ప్రకటించేందుకు కేంద్రం చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. ఈసారి పట్టణ ప్రాజెక్టులకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, హాస్పిటాలిటీ, పర్యాటకం, ప్రొడక్ట్ లింక్డ్ ఇన్‌సెంటివ్స్(PLI) వంటి వాటిపై ప్రోత్సాహకాలను ప్రకటించే అవకాశం ఉంది. ఇటీవల నెలకొన్న పరిస్థితుల వల్ల పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాల కల్పనకు సంబంధించిన కార్యకలాపాలు తగ్గిపోయాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలు అర్బన్ ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టడం వల్ల ప్రత్యేక పథకాలు అవకాశం లేకుండానే నిరుద్యోగులకు ఉపాధి కల్పించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఆ నగరాలపై ప్రత్యేక దృష్టిఈ దశలో ప్రభుత్వం టైర్ 1 నుంచి టైర్ 4 నగరాలపై దృష్టి పెట్టిందని, తాజా ప్యాకేజీలు ఇలాంటి నగరాల్లో గణనీయమైన ఉపాధిని సృష్టించగలవని పేరు వెల్లడించడానికి ఇష్టపడని సీనియర్ అధికారి ఒకరు చెబుతున్నారు. నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు సంబంధించిన 20-25 ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం. క్యాపిటల్ ఎక్స్‌పెండీచర్‌ను వీలైనంత ఎక్కువగా పెంచుతూ మౌలిక సదుపాయాలు కల్పించేలా వీటిని రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్టుల్లో నవీ ముంబై, గ్రేటర్ నోయిడాలో ప్రతిపాదిత విమానాశ్రయాలు ఉండే అవకాశం ఉందని సదరు అధికారి తెలిపారు.

Home Loan: భారీగా పడిపోయిన హోమ్ లోన్ వడ్డీ రేట్లు... సొంతిల్లు కొనడానికి ఇదే సరైన సమయమా?

Samsung Single EMI Scheme: సాంసంగ్ నుంచి అద్భుతమైన ఆఫర్... ఎన్ని వస్తువులు కొన్నా ఒకే ఈఎంఐ

ఇది నాలుగో ప్యాకేజీ


తదుపరి ఉద్దీపన ప్యాకేజీని సిద్ధం చేశామని, దీపావళికి ముందే దాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని మరో అధికారి తెలిపారు. ఇది కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ప్రకటించే నాలుగో ప్యాకేజీ కానుంది. ఇంతకు ముందే మార్చి నెలాఖరులో గరీబ్ కల్యాణ్ యోజన, మే నెలలో ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రకటించిన పండుగ బోనస్‌లు, LTC స్కీమ్‌లు ఈ జాబితాలో ఉన్నాయి.

క్యాపిటల్ ఎక్స్‌పెండీచర్‌ విధానమే మంచిది


ఈ ఉద్దీపనలపై తుది కార్యాచరణ జరుగుతోందని కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వనరుల కోసం అదనంగా రుణాలు తీసుకోవాల్సిన అవసరం లేకుండా ప్రణాళికను రచిస్తున్నారు. 2020-21 సంవత్సరానికి సంబంధించి, ప్రభుత్వం విధించుకున్న 12 లక్షల కోట్ల రూపాయల రుణ లక్ష్యం పరిధిలోనే నాలుగో ప్యాకేజీకి కేటాయింపులు ఉండనున్నాయి. ఉపాధి హామీ పథకం తరహాలో పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాల కల్పన కార్యక్రమాన్ని రూపొందించడానికి బదులుగా క్యాపిటల్ ఎక్స్‌పెండీచర్‌ విధానంలో డబ్బును ప్రయోజనాల కోసం మెరుగ్గా ఉపయోగించుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. పట్టణ ఉపాధి హామీ పథకం వల్ల ఖజానాకు 35,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని గతంలో అంచనాలు వేశారు.

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? తక్కువ వడ్డీ ఎక్కడో తెలుసుకోండి

SBI Home Loan: హోమ్ లోన్ కస్టమర్లకు బంపరాఫర్... వడ్డీ తగ్గించుకోండి ఇలా

టూరిజం, హాస్పిటాలిటీ రంగాల కోసం..


కోవిడ్ -19 మహమ్మారి వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ఆతిథ్యం(హాస్పిటాలిటీ), పర్యాటకం వంటి వివిధ రంగాలకు సంబంధించిన పరిశ్రమలను గాడిన పెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని ప్రిన్సిపల్ ఎకనామిక్ అడ్వైజర్ సంజీవ్ సన్యాల్ గతంలో ఒక ఇంటర్వూలో చెప్పారు. కొన్ని రంగాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరముందని ఆయన తెలిపారు. కరోనా, లాక్‌డౌన్‌ ప్రభావం హాస్పిటాలిటీ, టూరిజం రంగాలపై నేరుగా, తీవ్రంగా పడిందని ఆయన వివరించారు.

మరిన్ని చర్యలు ఉంటాయి


ఎలక్ట్రానిక్స్, మెడిసిన్, ఫార్మా ఉత్పత్తుల కోసం ప్రస్తుతం ఉన్న PLI స్కీమ్‌ను టెక్స్‌టైల్ యూనిట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, సోలార్ ప్యానెళ్లు, ఆటోమొబైల్ భాగాల తయారీ వంటి అనేక రంగాలకు విస్తరించాలని కేంద్రం యోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం మరో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సన్యాల్ సహా ఆర్థిక శాఖ సీనియర్ అధికారులు గత కొన్ని రోజులుగా సూచనలు ఇస్తున్నారు.
Published by: Santhosh Kumar S
First published: October 27, 2020, 11:35 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading