హోమ్ /వార్తలు /బిజినెస్ /

Cigarettes: సిగరెట్లు తాగే వారికి బ్యాడ్ న్యూస్.. ప్రభుత్వం కొత్త రూల్స్, వాటిపై నిషేధం?

Cigarettes: సిగరెట్లు తాగే వారికి బ్యాడ్ న్యూస్.. ప్రభుత్వం కొత్త రూల్స్, వాటిపై నిషేధం?

Cigarettes: సిగరెట్లు తాగే వారికి బ్యాడ్ న్యూస్.. ప్రభుత్వం కొత్త రూల్స్, వాటిపై నిషేధం?

Cigarettes: సిగరెట్లు తాగే వారికి బ్యాడ్ న్యూస్.. ప్రభుత్వం కొత్త రూల్స్, వాటిపై నిషేధం?

Loose Cigarettes Ban | మీకు సిగరెట్లు తాగే అలవాటు ఉందా? అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే రానున్న రోజుల్లో కొత్త రూల్స్ అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Smoking Zones | మీరు సిగరెట్లు కాలుస్తారా? ఒకేసారి సిగరెట్ బాక్స్ కాకుండా ఒకటి, రెండు సిగరెట్లు కొంటూ ఉంటారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం (Government) కొత్త రూల్స్ తీసువచ్చే పనిలో ఉంది. వెలుడుతున్న నివేదికల ప్రకారం చూస్తే.. కేంద్ర ప్రభుత్వం.. సిగరెట్ల (Cigarettes) విడి అమ్మకాలపై నిషేధం విధించనుంది. త్వరలోనే ఈ కొత్త రూల్ అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

లూజ్ సిగరెట్లపై నిషేధం వచ్చే కొన్ని నెలల్లో అమలులోకి రావొచ్చని నివేదికలు పేర్కంటున్నాయి. 2023-24 కేంద్ర బడ్జెట్ కన్నా ముందు ఈ నిర్ణయం అమలులోకి రావొచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023 ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్ 2023-24ను ఆవిష్కరించనున్నారు. ఒకవేళ ఒకటి లేదా రెండు ఇలా విడి సిగరెట్ల అమ్మకాలపై బ్యాన్ విధిస్తే.. చాలా మందికి ఇది బ్యాడ్ న్యూస్ అవుతుందని చెప్పుకోవచ్చు.

ఈ బ్యాంకుల్లో అకౌంట్ కలిగిన వారికి అదిరే శుభవార్త!

మీడియా నివేదికల ప్రకారం.. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఇప్పటికే సిగరెట్ల విడి అమ్మకాలను నిషేధించాలని సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా ఈ నిషేధాన్ని అమలు చేయాలని సూచించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. యూనియన్ బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల కన్నా ముందే ఈ నిర్ణయం తీసుకోవాలని సిఫార్చు చేసినట్లు తెలుస్తోంది.

రూ.35 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్ .. అదిరిపోయే ఫీచర్లతో!

దేశంలో పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పొగాకు నియంత్రణ కార్యక్రమానికి ఈ విడి సిగరెట్ల అమ్మకాలు తూట్లు పొడుస్తున్నాయని కేంద్రం భావిస్తోంది. కేవలం ఇది మాత్రమే కాకుండా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ మరో సిఫార్సు కూడా చేసినట్లు తెలుస్తోంది. విమానాశ్రయాల్లో ఉన్న అన్ని స్మోకింగ్ జోన్లను తొలగించాలని కూడా కమిటీ సిఫార్సు చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. పొగాకు ఉత్పత్లుల అమ్మకాలు, వ్యాప్తిని అడ్డుకోవడానికి కేంద్రం ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు మీడియా నివేదికలు తెలియజేస్తున్నాయి.

స్టాండింగ్ కమిటీ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తే.. దేశంలో రానున్న కాలంలో కేవలం సిగరెట్ బాక్స్‌ల అమ్మకాలు మాత్రమే జరగనున్నాయి. విడి సిగరెట్లు కొనడానికి వీలు ఉండదు. కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల కిందట, కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇసిగరెట్లపై నిషేధం విధించింది. వీటి వల్ల ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతుండటంతో బ్యాన్ చేసింది. అలాగే మరోవైపు కేంద్రం పొగాకు ఉత్పత్తులపై జీఎస్‌టీ పెంపు నిర్ణయం వల్ల కూడా సిగరెట్ అమ్మకాలపై పెద్దగా ప్రభావం ఏమీ కనిపించలేదు. డబ్ల్యూహెచ్‌వో కూడా పొగాకు ఉత్పత్తులు, స్మోకింగ్ ప్రొడక్టులపై 75 శాతం జీఎస్‌టీ విధించాలని ప్రభుత్వానికి సూచించింది. మద్యం, పొగాకు వినియోగం వల్ల క్యాన్సర్ సంభవించే అవకాశం ఉంటుంది. అందుకే ప్రభుత్వం విడి సిగరెట్ల అమ్మకాలపై బ్యాన్ విధించొచ్చు.

First published:

Tags: Cancer, New rules, Smoking habbit

ఉత్తమ కథలు